Animal Movie: ‘అన్‌స్టాపబుల్’ షోకు ‘యానిమల్’ హీరో

బాలయ్య - రణబీర్ ఫోటో వైరల్

Courtesy: Twitter

Share:

Animal Movie: ర‌ణ్‌బీర్‌ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'యానిమల్'(Animal Movie). ఈ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చిన రణబీర్ బాలయ్య(Balayya) టాక్ షోలో పాల్గొన్నారు. 

'అర్జున్ రెడ్డి'(Arjun Reddy) సినిమాతో సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) సంచలన విజయం అందుకున్నారు. స్టోరీ టెల్లింగ్ పరంగా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి, అక్కడా భారీ విజయం అందుకున్నారు. ఇప్పుడు ర‌ణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor) హీరోగా 'యానిమల్' సినిమా  చేస్తున్నారు.  ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై బాలీవుడ్(Bollywood) తో పాటు టాలీవుడ్ లోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో విడుదల చేసి మాంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలని దర్శకుడు భావిస్తున్నారు.డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్(Promotion) కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) ముంబై నుంచి హైదరాబాద్ లో అడుగు పెట్టారు. ‘బ్రహ్మాస్త’ సినిమాతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన, ఈ సినిమాతో మరింత ఫ్యాన్ బేస్(Fan Base) పెంచుకోవాలని భావిస్తున్నారు.  అందుకే ‘యానిమల్’ సినిమాను గట్టిగా ప్రమోట్ చేయబోతున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా పలు రియాలిటీ షోలతో పాటు టాక్ షోలలోనూ పాల్గొనబోతున్నారు.

 

ప్రస్తుతం తెలుగులో ‘బిగ్ బాస్’(Big Boss) రియాలిటీ షో(Reality Show) కొనసాగుతోంది. ‘యానిమల్’ ప్రమోషన్ లో భాగంగా ఆయన ‘బిగ్ బాస్’ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అటు బాలయ్య హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’(Unstoppable)లో పాల్గొన్నారు. బాలయ్యతో కలిసి ఈ షోలో సందడి చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా(Social media)లో వైరల్(Viral) అవుతోంది. ‘యానిమల్’ సినిమాలో భీకరంగా కనిపించిన రణబీర్ బాలయ్యను కలిసిన సందర్భంగా చాలా కూల్ గా కనిపిస్తున్నారు. 

ఇప్పటికే రణబీర్(Ranbir kapoor)తో బాలయ్య(Balayya) ఇంటర్వ్యూ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. బాలయ్య, రణబీర్ టాక్ షో చాలా ఫన్నీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రణబీర్ ను బాలయ్య ఏ ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం చెప్పారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు సరిగా రాని రణబీర్ తో బాలయ్య హిందీలో ఎలా మాట్లాడారు? రణబీర్ తెలుగు ఎలా మాట్లాడారు? అనేది తెలుసుకునేందుకు ఆత్రంగా చూస్తున్నారు. ఈ షో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ కాగా, ఇకపై జాతీయ స్థాయిలో పాపులర్ కానుంది. 

ఈ చిత్రంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అమెరికాలో భారీ ఎత్తున విడుదలవుతోంది. నార్త్  అమెరికాలో 888 స్క్రీన్లలో ‘యానిమల్’ విడుదలవుతోంది. ఇంతకుముందు విడుదలైన ‘జవాన్’ సినిమా నార్త్ అమెరికాలో 850 స్క్రీన్‌లో రిలీజ్ అయ్యింది. ‘బ్రహ్మాస్త్ర’కు 810 స్క్రీన్లలో రిలీజ్(Release) అయ్యింది. ఈ రికార్డును ‘యానిమల్’ బద్దలు కొట్టింది. 

అమెరికాలో ఇంత భారీ స్థాయిలో విడుదలైన తొలి హిందీ చిత్రంగా యానిమల్(Animal) గుర్తింపు తెచ్చుకుంది. ‘జవాన్’, ‘బ్రహ్మాస్త్ర’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. భారతదేశంలోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘యానిమల్’ చిత్రానికి విదేశాల్లో ఎక్కువ స్క్రీన్లు లభించాయి కాబట్టి కచ్చితంగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్(Movie teaser) సినిమా పై అంచనాలను పెంచేసింది. దాంతో  అభిమానులు ‘యానిమల్’ని చూడాలని ఎదురుచూస్తున్నారు.రణ్‌బీర్, రష్మికతో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్ ఈ చిత్రంలో నటించారు. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని కలసి నిర్మిస్తున్నారు.