రామాయ‌ణ‌ నిర్మాతల ‘అతి జాగ్రత్త’

ఆదిపురుష్ చిత్రం రిలీజ్ అయి కొన్ని రోజుల అయినప్పటికీ, ఆ సినిమాలో చూపించిన విజువల్స్ మీద ఇంకా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి, రామాయణం ఆధారంగా రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించబోతున్న చిత్ర నిర్మాతలు ఈ విషయంలో ‘జాగ్రత్తగా’ ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి అంతేకాకుండా, ఆది పురుషు మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు మీరు నిర్మాతలు.  కొత్త నివేదిక ప్రకారం, ఈ నెల ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన, భారతీయ ఇతిహాసం ఆధారంగా విడుదలైన ప్రభాస్, […]

Share:

ఆదిపురుష్ చిత్రం రిలీజ్ అయి కొన్ని రోజుల అయినప్పటికీ, ఆ సినిమాలో చూపించిన విజువల్స్ మీద ఇంకా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి, రామాయణం ఆధారంగా రణబీర్ కపూర్ మరియు అలియా భట్ నటించబోతున్న చిత్ర నిర్మాతలు ఈ విషయంలో ‘జాగ్రత్తగా’ ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి అంతేకాకుండా, ఆది పురుషు మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు మీరు నిర్మాతలు. 

కొత్త నివేదిక ప్రకారం, ఈ నెల ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన, భారతీయ ఇతిహాసం ఆధారంగా విడుదలైన ప్రభాస్, కృతి సనన్ మరియు సైఫ్ అలీఖాన్‌ల ఆదిపురుష్‌పై ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, రాబోయే మాగ్నమ్ ఓపస్ నిర్మాతలు సినిమాను తెరకెక్కించే విషయంలో చాలా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.రామాయణం ఆధారంగా నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ మరియు అలియా భట్లు, రాముడు, సీత పాత్రలలో కనిపించనున్నారు. 

ఓం రౌత్ యొక్క ఆదిపురుష్‌లో డైలాగులు విషయంలో ఎన్నో ఎదరు దెబ్బలు తిన్న విషయం తెలిసిందే అదే విధంగా ఈ సినిమాను బాయ్ కట్ చేయాలని కూడా పలు ప్రాంతాలలో నినాదాలు కూడా వినిపించాయి. సినిమా విఎఫ్‌ఎక్స్‌తో పాటు కాస్ట్యూమ్స్‌ మీద కూడా కొన్ని విమర్శలు వినిపించడం జరిగాయి. ఆదిపురుష్‌లో, ప్రధాన పాత్రలు ప్రభాస్ -రాఘవ్ (రాముడు ఆధారంగా), సైఫ్ అలీ ఖాన్ -లంకేష్ (రావణ్) మరియు కృతి సనన్- జానకి (సీత) పాత్రలు పోషించారు. నితీష్ తివారీ, రామాయణంపై ఆధారంగా తీయబోతున్న చిత్రంలో ఆలియా భట్, రణబీర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

రచయితల మీద విమర్శలు: 

అయితే ఆది పురుషుల్లోని డైలాగ్స్ రచించిన రచయిత మీద ఎన్నో విమర్శలు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే రామాయణం ఆధారంగా, నితేష్ తివారీ మరియు అతని బృందం రామాయణాన్ని రూపొందించడానికి ఎలా ప్లాన్ చేయాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లు కొంతమంది పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆదిపురుష్‌లో కనిపించిన ‘విసుగు పుట్టించే డైలాగ్‌లు’ మీద విమర్శలు వెలువడిన తర్వాత డైలాగ్‌ల విషయంలో కూడా, టీం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇతిహాసాలను మూలలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా చిత్రీకరించాలనేదే ఇప్పుడు ముఖ్యమైన అంశం.

రామాయణం vs ఆదిపురుష్: 

ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా మాట్లాడుతూ, నితీష్ తివారీ చిత్రం ఆదిపురుష్ లాగా కాకుండా ఇది చూపులను ఆకట్టుకునే విధంగా, ఇతిహాసాలను మూలాలను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరణ జరుగుతుందని వెల్లడించారు.

నితేష్, ముఖ్యంగా లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇతిహాసాలను మూలలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా చిత్రీకరించాలనేదే ఇప్పుడు ముఖ్యమైన అంశం. అలాగే వివాదాస్పదమైన పాటలు పెట్టకుండా శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు జరుగుతున్నాయి. స్క్రీన్‌పై దేవుళ్లను చూపించనున్నారు కాబట్టి కాంటెంపరరీ కాస్ట్యూమ్‌లు, మేకప్‌లు ఉపయోగించకూడదు అని నిర్ణయించుకున్నారు. ప్రాథమికంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆదిపురుష్ మళ్లీ రిపీట్ అవ్వకూడదు. ప్రేక్షకులు తప్పకుండా ఈ రామాయణాన్ని అంగీకరించేలా చిత్రీకరణ జరిగేలా అన్ని జాగ్రత్తలు ఉంటాయి.

రాబోతున్న రామాయణం సినిమా గురించి: 

ఇటీవల చిత్రాల బరిలో దిగిన, KGF: చాప్టర్ 2 లో చివరిగా కనిపించిన నటుడు యష్ నితేష్ తివారీ చిత్రంలో రావణ్ పాత్రను చేయడానికి, ఆయన్ని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, న్యూస్ 18 నివేదిక ప్రకారం, యష్ ఈ ఆఫర్ని తీసుకోలేనట్లు తెలుస్తుంది.