జై భీంకు రాని అవార్డ్.. ద‌గ్గుబాటి రానా స్పంద‌న‌

అల్లు అర్జున్.. ‘పుష్ప’లో తన పర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ గెలవడం అందరికీ సంతోషాన్ని ఇచ్చినా.. సూర్య నటించిన ‘జై భీమ్’కు ఏ మాత్రం గుర్తింపు రాకపోవడం తెలుగు ప్రేక్షకులను సైతం కలవరపెడుతోంది. యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. రానా గురించి చెప్పాలంటే.. ఎలాంటి విషయాన్ని అయినా ఎలాంటి వివాదంపైన మీడియా ముందు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తన మనసుకి ఏది […]

Share:

అల్లు అర్జున్.. ‘పుష్ప’లో తన పర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ గెలవడం అందరికీ సంతోషాన్ని ఇచ్చినా.. సూర్య నటించిన ‘జై భీమ్’కు ఏ మాత్రం గుర్తింపు రాకపోవడం తెలుగు ప్రేక్షకులను సైతం కలవరపెడుతోంది.

యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. రానా గురించి చెప్పాలంటే.. ఎలాంటి విషయాన్ని అయినా ఎలాంటి వివాదంపైన మీడియా ముందు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తన మనసుకి ఏది అనిపిస్తే దాన్ని చెప్పేస్తుంటాడు. ఇలా ఎన్నోసార్లు రానా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాలలో ఇరుక్కున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. 

అయితే అందులో కూడా నిజం లేకపోలేదు అనేది చాలామంది వాదన. ఇకపోతే ప్రస్తుతం రానా జాతీయ అవార్డుల విషయంలో ఒక సినిమాకు అన్యాయం జరిగిందని చెప్పకనే చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కోలీవుడ్ సినిమా జై భీమ్ కు అవార్డు రాకపోవడంపై అవమానులు ఎంతటి అసహనాన్ని వ్యక్తం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఎంతో అద్భుతమైన సినిమాకు అవార్డు రాకపోవడంతో తామందరం నిరాశ చెందామని చెప్పుకొచ్చారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రముఖులు సైతం ఈ సినిమా విషయంలో బాధపడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముఖ్యంగా హీరో నాని జై భీమ్ కు అవార్డు రాకపోవడంతో తన మనసు ముక్కలవుతున్నట్టు ఎమోజీ పెట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అప్పట్లో నాని ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన విషయం కూడా తెలిసిందే.

తెలుగు హీరో అయిన అల్లు అర్జున్.. ‘పుష్ప’లో తన పర్ఫార్మెన్స్‌కు నేషనల్ అవార్డ్ గెలవడం అందరికీ సంతోషాన్ని ఇచ్చినా.. సూర్య నటించిన ‘జై భీమ్’కు ఏ మాత్రం గుర్తింపు రాకపోవడం బాధకరం. నేచురల్ స్టార్ నాని సైతం ‘జై భీమ్’ విషయంలో హార్ట్ బ్రేక్‌కు గురయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా రానా కూడా తన అభిప్రాయాన్ని తెలిపాడు. తాజాగా సైమా అవార్డులకు అటెండ్ అయిన రానా.. ఏ విషయంలో అయినా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అభిప్రాయాలు వేరేగా ఉన్నా.. వ్యక్తులు మాత్రం కలిసే ఉంటారు. నేషనల్ అవార్డ్స్ విషయంలో నటుల మధ్య ఎలాంటి కాంట్రవర్సీ చోటుచేసుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

‘ప్రతీ ఒకరికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. నాకు ఒక సినిమా నచ్చుతుంది. మీకు వేరే సినిమా నచ్చుతుంది. ఆర్టిస్టుల విషయంలో కూడా అంతే. ఆర్టిస్ట్ గురించి కాకపోయినా ఆ కథకు ఎన్నో అవార్డులు వచ్చుండాలి. కానీ అలా జరగలేదు.. అంతే. ఇప్పుడు తనకు అవార్డ్ దక్కకపోవచ్చు. అలా అని ఎప్పటికీ దక్కదని కాదు కదా..’ అని రానా ‘జై భీమ్’కు అవార్డ్ రాకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. జరిగిపోయినదాని గురించి ఆలోచించకూడదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. అంతే కాకుండా నేషనల్ అవార్డ్స్‌పై ప్రస్తుతం ఎలాంటి కాంట్రవర్సీ జరగడం లేదని, ప్రేక్షకులు.. సెలబ్రిటీల అభిప్రాయాలను ఆ కోణంలో చూడవద్దని క్లారిటీ ఇచ్చాడు.

ఇది ఎప్పుడూ కాంట్రవర్సీ కాదు. చాలావరకు స్టార్లంతా ట్వీట్స్ తప్పా ఏమీ చేయడం లేదు. కాంట్రవర్సీ అంటే మీరు చేస్తున్నదే. ఆర్టికల్స్, వీడియోలు, బేస్ వాయిస్‌తో యూట్యూబ్ లింక్స్ క్రియేట్ చేసి, వాటిని వైరల్ చేస్తున్నారు. అప్పుడు అది కాంట్రవర్సీ అవుతోంది. కానీ మా మధ్య మాత్రం ఏదీ కాంట్రవర్సీ కాదు.’ అంటూ ఆర్టిస్టుల మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి కచ్చితంగా చెప్పాడు రానా. నాని రియాక్షన్ గురించి రానాను అడగగా.. ‘నాని ఏం చేశాడు? అది కాంట్రవర్సీ ఎందుకు అయ్యింది? అవన్నీ మీ ఊహలు అంతే. నాకు చాలా విషయాలు నచ్చవచ్చు. మీకు చాలా విషయాలు నచ్చవచ్చు. అందరికీ ఒకే గుర్తింపు దక్కకపోవచ్చు. అవన్నీ అభిప్రాయాలు మాత్రమే. ప్రతీ ఒక్కరికీ అభిప్రాయం అనేది ఉంటుంది’ అంటూ నాని చేసిన ‘జై భీమ్’ సోషల్ మీడియా పోస్ట్‌కు సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు రానా.