‘ఓపెన్‌హైమర్’ సెక్స్ సీన్‌పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ 

జీనియస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓపెన్‌హైమర్‌తో. ఇది ప్రపంచవ్యాప్తంగా  థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేస్తోంది. తొలిరోజు రూ.14.5 కోట్ల నికర వసూలు చేసింది. కధ ఎలా ఉండబోతుంది అంటే…  లెస్లీ గ్రోవ్స్ , యూఎస్ ఆర్మీ కార్ప్స్ కి చెందిన ఇంజనీర్స్ అధికారి, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో థియోరిటికల్ ఫిజిక్ […]

Share:

జీనియస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓపెన్‌హైమర్‌తో. ఇది ప్రపంచవ్యాప్తంగా  థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేస్తోంది. తొలిరోజు రూ.14.5 కోట్ల నికర వసూలు చేసింది.

కధ ఎలా ఉండబోతుంది అంటే… 

లెస్లీ గ్రోవ్స్ , యూఎస్ ఆర్మీ కార్ప్స్ కి చెందిన ఇంజనీర్స్ అధికారి, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో థియోరిటికల్ ఫిజిక్ సైంటిస్ట్ అయిన J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అటామిక్ బాంబ్ తయారు చేయమని అడిగాడు. ఓపెన్‌హైమర్ మరియు ఇతర శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు. దీనిని యూఎస్ ప్రభుత్వం తరువాత యుద్ధంలో ఉపయోగించింది. తరువాత, ఓపెన్‌హైమర్ ను “ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్” అని పిలవడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, ఓపెన్‌హైమర్‌పై విచారణ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఓపెన్‌హైమర్ తర్వాత ఏమి చేస్తాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చిత్రం లో కనిపిస్తాయి.

సినిమా 3 గంటల రన్‌టైమ్ ను కలిగి ఉంది. ఇది చూసే కొంతమంది ప్రేక్షకులకి విసుగు తెప్పించవచ్చు. అయితే స్టోరీ లో లేనమైన వారు రన్ టైమ్ ను అంతగా పట్టించుకోరు.

స్క్రీన్‌ప్లేలో కొన్ని డిఫరెంట్ టైమ్ లైన్స్ ను ఉపయోగించడం, ఓపెన్‌హైమర్ జీవితం గురించి తక్కువ నాలెడ్జ్ ఉన్న ఆడియెన్స్ కి ఛాలెంజింగ్ గా ఉంటుంది. అయితే ఈ సైంటిస్ట్ గురించి కొంత బ్యాక్ గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్నవారు మరింత గా సినిమాను అర్దం చేసుకొనే అవకాశం ఉంది.

మొదటి గంట లో ఎక్కువగా డ్రామా ఉంది. అయితే ఇది సెకండాఫ్ లో కూడా సినిమా పై ప్రభావం చూపుతుంది. ఒకే రంగులో ఉండే సన్నివేశాలు ఆడియెన్స్ కి అంతగా నచ్చక పోవచ్చు. పాత్రల గురించి, ఓపెన్‌హైమర్ కథ గురించి తెలియని వారు గందరగోళానికి గురి అయ్యే అవకాశం ఉంది.

అయితే  క్రిస్టొఫ‌ర్ నోలాన్  డైరెక్ట్ చేసిన ఓపెన్‌హైమ‌ర్ సినిమా చర్చనీయాంశంగా మారింది అన్న సంగతి తెలిసిందే..అయితే   నోలాన్  ఇందులో సెక్స్ సీన్ పెట్టి.. హీరో సిలియ‌న్ మ‌ర్ఫీ చేత భ‌గ‌వద్గీతలోని ఓ శ్లోకం చెప్పించార‌ని సినిమా చూసిన భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

దీనిపై డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించారు. మ‌న దేశంతో మ‌న భాష‌తో సంబంధం లేని ఓపెన్‌హైమ‌ర్ భ‌గ‌వద్గీత చ‌దివారు కానీ మ‌న భార‌తీయుల్లో .0000001 శాతం మంది కూడా ఆ మ‌హాకావ్యాన్ని చదివారా అన్నది సందేహమే అని అయన శైలిలో ట్వీట్ చేసారు.

 వర్మ చేసిన ట్వీట్ కి స్పందిస్తున్న ప్రేక్షకులు…. 

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కి కొంతమంది  ఏకాభివిస్తూ  ట్వీట్ చేస్తే ఇంకొంతమంది  రామ్ గోపాల్ వర్మ మీద విరుచుకుపడ్డారు…. భగవద్గీతను పడకగదిలో చూపించడం పట్ల భారతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అని ఆయన తెలిపారు.. ఇంకొంతమంది ట్వీట్ లో అవును మేము చదవకపోవచు కానీ భగవత్గీత మేము విన్నాము అని మరియు నువ్వు  0. 0000001% కూడా చదవేలేదు అని అర్ధమవుతుంది అని వర్మ కి కౌంటర్ లు వేస్తున్నారు. 

మరొకరు వర్మ కి  కౌంటర్ ఇస్తూ, “చాలా మంది భారతీయులు బైబిల్ చదివారు, ఇది 0.000000001% అమెరికన్లు చదవడానికి ధైర్యం చేసి ఉంటారని నాకు అనుమానం ఉంది…అని ఆయన అన్నారు. 

న్యూక్లియ‌ర్ అటామిక్ బాంబ్ క‌నిపెట్టిన సైంటిస్ట్ ఓపెన్‌హైమ‌ర్  మొద‌టిసారి న్యూక్లియర్ టెస్ట్ చేప‌ట్టిన‌ప్పుడు నేను ప్ర‌పంచాల‌ను అంతం చేసే చావునయ్యాను అని భ‌గ‌వద్గీత‌లోని ఓ శ్లోకాన్ని గుర్తుచేసుకున్నారు. అదే సీన్‌ను క్రిస్టొఫ‌ర్ నోలాన్ సినిమాలో వాడారు. కానీ సెక్స్ సీన్‌లో ఈ శ్లోకాన్ని వాడార‌ని భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే అది భ‌గ‌వద్గీత‌లోని శ్లోకం కాద‌ని మ‌రికొంద‌రి అంటున్నారు .