రామ్ గోపాల్ వర్మ సత్య సినిమాకి 25 ఏళ్లు

రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకు ప్రత్యేకత ఉంది.. సినీ ఇండస్ట్రీలో అరుదైన మైలురాయిని సృష్టించిన ఆయన సినిమాలు ఎన్నో.. మూస సినిమాల సమయంలో తెలుగు సినిమా గతిని మార్చేసిన విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ..ఆయన చేసిన ప్రయోగానికి అప్పట్లో దేశమంతా ఎట్రాక్ట్ అయింది. నిజ జీవిత కథల నుంచి మొదలైన కథను వర్మ చూపించిన విధానమే అందుకు కారణం. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమా 25 ఏళ్ళు అవుతుంది . […]

Share:

రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకు ప్రత్యేకత ఉంది.. సినీ ఇండస్ట్రీలో అరుదైన మైలురాయిని సృష్టించిన ఆయన సినిమాలు ఎన్నో.. మూస సినిమాల సమయంలో తెలుగు సినిమా గతిని మార్చేసిన విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ..ఆయన చేసిన ప్రయోగానికి అప్పట్లో దేశమంతా ఎట్రాక్ట్ అయింది. నిజ జీవిత కథల నుంచి మొదలైన కథను వర్మ చూపించిన విధానమే అందుకు కారణం. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమా 25 ఏళ్ళు అవుతుంది . 1998 వరకు వచ్చిన ప్రోటీన్ కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు సరికొత్త అర్ధాన్ని చెప్పిన సినిమా “సత్య”.. గ్యాంగ్స్టర్ అన్న పేరు వినడమే కానీ వాళ్ళు ఎలా ఉంటారు కూడా తెలియదు వాళ్ల జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించగలిగాడు రామ్ గోపాల్ వర్మ ..

ఒక రియల్ గ్యాంగ్స్టర్ జీవితాన్ని దగ్గరనుంచి చూసి ఈ సినిమాను తీశానని పలు సందర్భాలలో ఆయన తెలిపారు. రియల్ ఇన్సిడెంట్ తో కొత్త నటీనటులతో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించారు. ఊర్మిళా మండోత్కర్ హీరోయిన్ మనోజ్ వాజ్పాయ్ తో పాటు అనురాగ్ కస్యప్, సౌరబ్ శుక్లా తో సహా ప్రముఖులు ఈ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. 

ఈ చిత్ర షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ముగిసిపోయింది. మళ్ళీ రెండు వారాల తర్వాత రామ్ గోపాల్ వర్మ మళ్లీ పట్టాలెక్కించారు.  వాస్తవానికి ఈ సినిమాలో ఎలాంటి పాటలు లేకుండా ప్లాన్ చేశారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరన్న కారణంగా వర్మ తనదైన శైలిలో విశాల్ భరద్వాజ్ తో పాటలను కంపోజ్ చేయించారు.  అప్పట్లో రెండు కోట్లతో అధికష్టం మీద ఈ సినిమాను పూర్తి చేశారు. రామ్ గోపాల్ వర్మ జూలై మూడున ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైంది. సినిమా విడుదలైన రెండు రోజులు ఈ సినిమా చూడటానికి అంతంత మాత్రమే ప్రేక్షకులకు వచ్చినా.. కానీ మొదటివారం గడిచేసరికి థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 18 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. 1998లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా గా కూడా సత్య అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. రంగీలా, క్షణక్షణం, సినిమాలతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన వర్మ మూడవ చిత్రం సత్య..

వర్మ కేవలం 50 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ సినిమా రివ్యూ వేస్తే హిందీ సినిమా చరిత్రలో దీనంత వరస్ట్ సినిమా మరొకటి లేదని అన్నారు. రెండు వారాలపాటు ఎక్కడ కూడా టాక్ వినిపించలేదు. కానీ ఆ తర్వాత నుంచి నెమ్మదిగా సినిమా ప్రేక్షకులకు నచ్చేసింది. అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సత్య సినిమాకు మొత్తం 6 ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ డిజైన్ ఇలా వివిధ విభాగాల్లో ఈ చిత్రానికి ఆరు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి అని ఆ చిత్ర దర్శకుడు దాని బోయ స్వయంగా చెప్పడం మరో విశేషం.

రాంగోపాల్ వర్మ సత్య అని ఆ చిత్రానికి ఎందుకు పేరు పెట్టవలసి వచ్చిందో కూడా ఒక ట్వీట్ చేశారు అదేంటంటే ల్యాండ్ మార్క్ ఫిలిం సత్య , క్షణక్షణం లో శ్రీదేవి పేరు పోలవరపు సత్య.. అలా ఈ చిత్రానికి సత్య అని పేరు పెట్టానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.