ఉపాస‌న బ‌ర్త్‌డే.. రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి మొత్తం శుభమే  జరుగుతుంది. #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ ని చూసి ఆయన అభిమానులు ఎంతలా మురిసిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు దశాబ్దాలలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా సాధించలేని ఎన్నో అద్భుతమైన  విజయాలను రామ్ చరణ్ సాధిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇది అభిమానులు నిజంగా ఎంతో […]

Share:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి మొత్తం శుభమే  జరుగుతుంది. #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ ని చూసి ఆయన అభిమానులు ఎంతలా మురిసిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు దశాబ్దాలలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా సాధించలేని ఎన్నో అద్భుతమైన  విజయాలను రామ్ చరణ్ సాధిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇది అభిమానులు నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. కెరీర్ పరంగా అభిమానులు రామ్ చరణ్ కాలర్ ఎగరేసుకునేలా చేసాడు. కానీ వ్యక్తిగతంగా వాళ్లకు ఎప్పటి నుండో ఉన్న కోరిక కూడా మొన్న తీరిపోయింది. పెళ్లి జరిగి 11 ఏళ్ళు పూర్తయిన కూడా రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న సంతానం జన్మించలేదు అనే బాధ అభిమానుల్లో ఉండేది. అయితే ఆ బాధకి తెరపడి నెల రోజులు పూర్తి అయ్యింది. ఈ ఇద్దరు దంపతులు క్లిన్ కారా అనే చిన్నారికి జన్మని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

క్లిన్ కారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ లో అన్నీ శుభాలే జరుగుతున్నాయి:

ఈ చిన్నారి పుట్టగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. క్లిన్ కారా పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతీ దేవాలయం పూజలు జరిపించి పాప నిండు నూరేళ్లు సంతోషం గా , ఆరోగ్యంగా జీవించాలని, తల్లిదండ్రులు మరియు అభిమానులు గర్వపడే స్థాయికి ఆమె చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేసారు. ఇంత ప్రేమాభిమానం అందుకుంటున్న ఆ చిన్నారి ఎంతో అదృష్టవంతురాలు అనే చెప్పాలి. ఇక క్లిన్ కారా ఉపాసన కడుపులో పడినప్పటి నుండి మెగా ఫ్యామిలీ లో అన్నీ శుభాలే జరుగుతున్నాయి. రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజి రావడం , చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి నిశ్చయం అవ్వడం, పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ పొలిటికల్ టూర్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం, ఇలా అన్నీ శుభాలే జరిగాయి. ఈ విషయాన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నాడు.

ఎమోషనల్ వీడియో ని షేర్ చేసిన రామ్ చరణ్ – ఉపాసన :

ఇక రీసెంట్ గానే ఈ పాపకి క్లిన్ కారా అని నామకరణం చేసారు. దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా ఉపాసన మరియు రామ్ చరణ్ క్లిన్ కారా  పుట్టే సమయం లో ఇంట్లో ఏర్పడిన పండగ వాతావరణం కి సంబంధించిన వీడియో ని విడుదల చేసారు. ఈ వీడియో లో ఉపాసన హాస్పిటల్ అడ్మిట్ అయినా దగ్గర నుండి, బిడ్డ పుట్టే వరకు జరిగిన స్వీట్ మూమెంట్స్ అభిమానులతో పంచుకున్నారు. ఇక రామ్ చరణ్ దీని గురించి మాట్లాడుతూ ‘మా ఇద్దరికీ పెళ్ళైన 11 ఏళ్ళ తర్వాత పుట్టిన అమ్మాయి. ఉపాసన గర్భం దాల్చిన 9 నెలలు నేను ఎంతో ఎంజాయ్ చేశాను. ఎప్పుడెప్పుడు పాప బయటకి వస్తుందా, ఎప్పుడు చేతిలో తీసుకుంటానా అని ఎంతో థ్రిల్ కి గురి. ఈ బిడ్డ మాకు ఎంతో ప్రత్యేకం,మా ప్రేమకి ప్రతిరూపం’ అంటూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులు కూడా ఈ వీడియో ని చూసి ఎంతో మురిసిపోతున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.