రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న కూతురి పేరు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ముద్దుల కొడుకు, నటుడు రామ్ చరణ్, ఉపాసన కొణిదల పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో సంతోషించారు. ఆ పాపకు ఎలాంటి పేరు పెడతారేమోనని మెగా అభిమానులు గత కొన్ని రోజులుగా తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరికీ నచ్చిన పేరు వారు సలహా ఇచ్చారు. జూన్ 30న రామ్ చరణ్ ఉపాసన దంపతుల పాపకు బారసాల వేడుక, నామకరణం కార్యక్రమాలు మెగాస్టార్ […]

Share:

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల ముద్దుల కొడుకు, నటుడు రామ్ చరణ్, ఉపాసన కొణిదల పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో సంతోషించారు. ఆ పాపకు ఎలాంటి పేరు పెడతారేమోనని మెగా అభిమానులు గత కొన్ని రోజులుగా తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరికీ నచ్చిన పేరు వారు సలహా ఇచ్చారు. జూన్ 30న రామ్ చరణ్ ఉపాసన దంపతుల పాపకు బారసాల వేడుక, నామకరణం కార్యక్రమాలు మెగాస్టార్ చిరంజీవి అంగరంగ వైభవంగా జరిపించారు. పాపకు క్లీన్ కారా అని పేరు పెట్టారు. దాంతో ఒక్కసారిగా ఈ పేరు నెట్టింట   ట్రెండింగ్ గా మారింది. ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసుకునేందుకు చాలామంది గూగుల్ సెర్చింగ్ చేయడం మొదలుపెట్టారు.

బిడ్డ ముఖాన్ని ఇప్పటివరకు మీడియాకి చూపించలేదు కానీ,  బిడ్డను ఎత్తుకొని ఫోటోలు మాత్రం చాలానే దిగారు. రామ్ చరణ్ ఉపాసన ఫోటోలు బాగా ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలుస్తుంది. ఇక ఈ ఫోటోలను రామ్ చరణ్ , ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి ఎవరికి వారు సోషల్ మీడియాలో పంచుకుంటూ విభిన్నమైన స్టోరీలను పంచుకున్నారు.

 చిరంజీవి ట్వీట్ చేస్తూ.. నా మనవరాలికి క్లీన్ కారా కొణిదెల అని  నామకరణం చేసాము. ఈ పేరుని లలితా సహస్రనామ శ్లోకం నుండి తీసుకున్నాము క్లీన్ కారా అంటే ప్రకృతికి స్వరూపం అని అర్థం. అంతే అతీతమైన అమ్మవారి శక్తి అని కూడా ఈ పేరులో ఉంటుంది. మా బిడ్డ ఎదిగే కొద్ది లక్షణాలను కూడా పొందుతుంది అని అనుకుంటున్నాము అంటూ చిరంజీవి పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పేరు పలకడం కాస్త కష్టమే కానీ రామ్ చరణ్ కూతురు కాబట్టి అభిమానులు నెమ్మదిగా అలవాటు చేసుకుంటారని అంతా అనుకుంటున్నారు. పాపని ఉయ్యాలలో వేస్తూ ఒకపక్క చిరంజీవి సురేఖ నిలబడగా మరోపక్క రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ ఫోటోని అభిమానులు వైరల్ చేస్తున్నారు.

ఇంతకీ రామ్ చరణ్ ఉపాసనల కూతురికి క్లీన్ కారా అని పేరు పెట్టింది మరెవరో కాదు ఉపాసనా తల్లి శోభన కామినేని. తాజాగా ఈ విషయంపై ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారా ఉపాసన నువ్వు పుట్టినప్పుడు నీకు క్లీన్ కారా అని పేరు పెట్టాలనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. రామ్ చరణ్ ఉపాసనలకు అభినందనలు. మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి. మేము నిన్ను ప్రేమిస్తున్నాము కారా అని తన మనవరాలు బారసాల వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది శోభన కామినేని. ఈ పోస్ట్ కి ఉపాసన స్పందిస్తూ ధన్యవాదాలు అమ్మ అని రిప్లై ఇచ్చింది. 

ప్రస్తుతం మెగా వారసురాలి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిన్నారి పేరుని KKK గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన కూతురుకు తన బాబాయ్ ఒరిజినల్ పేరు కళ్యాణ్ కుమార్ కొణిదల KKK పేరు కలిసొచ్చే విధంగా తన కుమార్తెకు క్లీన్ కారా కొణిదల KKK అని నామకరణం చేశారని , పలువురు ఇద్దరి పేర్లు మ్యాచ్ చేస్తున్నారు.  ఇలా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ పేరుతో రామ్ చరణ్ కూతురు పేరు మ్యాచ్ అవ్వడంతో బాబాయ్ పేరుని తన కుమార్తె పేరు కలిసి వచ్చేలా రామ్ చరణ్ పెట్టుకున్నారని, ఈ విధంగా తన బాబాయ్ పై ఉన్న ప్రేమను రామ్ చరణ్ చాటుకున్నారని తెలిపారు. ఉపాసన రాంచరణ్ తమ కూతురుకు లలితా సహస్రనామాలలో ఒకటైన ఈ పేరును తమ కూతురికి ఎంపిక చేసినట్లు తెలిపారు.