Ram charan: ఇండియన్ 2 లో నటించబోతున్న గ్లోబల్ స్టార్..?

శంక‌ర్ (shankar) ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ (ram charan) గేమ్ ఛేంజ‌ర్ (game changer) అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోప‌క్క శంక‌ర్.. క‌మ‌ల్ హాస‌న్‌తో (kamal haasan) ఆల్‌టైం బ్లాక్ బ‌స్ట‌ర్ భార‌తీయుడు (bharateeyudu) సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 (indian 2) తీస్తున్నారు. ఈ రెండు సినిమాలు శంక‌ర్ తీస్తున్న‌వే కాబ‌ట్టి.. భారతీయుడు 2 సినిమాలో శంక‌ర్.. రామ్ చ‌ర‌ణ్ కోసం స్పెష‌ల్‌గా కేమియో రోల్ రాసిన‌ట్లు తెలుస్తోంది.  గేమ్ ఛేంజర్ మూవీ […]

Share:

శంక‌ర్ (shankar) ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ (ram charan) గేమ్ ఛేంజ‌ర్ (game changer) అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోప‌క్క శంక‌ర్.. క‌మ‌ల్ హాస‌న్‌తో (kamal haasan) ఆల్‌టైం బ్లాక్ బ‌స్ట‌ర్ భార‌తీయుడు (bharateeyudu) సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 (indian 2) తీస్తున్నారు. ఈ రెండు సినిమాలు శంక‌ర్ తీస్తున్న‌వే కాబ‌ట్టి.. భారతీయుడు 2 సినిమాలో శంక‌ర్.. రామ్ చ‌ర‌ణ్ కోసం స్పెష‌ల్‌గా కేమియో రోల్ రాసిన‌ట్లు తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ మూవీ గురించి రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే శంకర్ ఒకేసారి అటు కమల్‌ హాసన్ హీరోగా భారతీయుడు 2(indian 2) , మరోవైపు రామ్ చరణ్హీ(ram charan) రోగా గేమ్ ఛేంజర్ చేస్తుండటంతో.. చెర్రీ మూవీ కాస్త ఆలస్యం అవుతోంది. భారతీయుడు 2 మూవీ కూడా మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ కావడంతో.. దేనిని తక్కువ చేయకుండా పర్ఫెక్ట్ ఔట్‌పుట్ కోసం శంకర్(shankar) తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారతీయుడు 2 సినిమా గురించి వచ్చిన కీలక అప్‌డేట్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.

భారతీయుడు 2ప్రీ క్లైమాక్స్ లో రామ్ చరణ్(ram charan) కనిపించనున్నాడని, అందులో కీలక పాత్ర చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. భారతీయుడు 2 క్లైమాక్స్ తర్వాత కూడా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని సమాచారం. గేమ్ ఛేంజర్ సినిమా ముగియగానే చరణ్‌తో శంకర్ ఈ కీలక సీక్వెన్స్ తెరకెక్కిస్తారట. అలాగే భారతీయుడు 2 కు కొనసాగింపుగా భారతీయుడు 3 కూడా తెరకెక్కిస్తారట శంకర్. భారతీయుడు 3 మూవీలో రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ కీ రోల్ చేయబోతున్నాడని బజ్ క్రియేట్ అయింది. కీ రోల్ అంటే విలనా, లేక హీరోగానా అనేది తేలాల్సి ఉంది.

కాగా, చెర్రీ మాత్రం ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. సంక్రాంతి బరిలో నిలవాల్సిన సినిమా లేట్ అవుతోందని, సమ్మర్ లో రిలీజ్ కానుండటంతో వేగంగా చేసేయ్యాలని చెర్రీ భావిస్తున్నాడు. గేమ్ ఛేంజర్(game changer) అయిపోగానే వెంటనే బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు రామ్ చరణ్.

‘భారతీయుడు 2’

లోక నాయకుడు కమల్ హాసన్ కరియర్ లో బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలలో “భారతీయుడు(indian)” సినిమా కూడా ఒకటి. అప్పట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా “భారతీయుడు 2 (indian 2)” త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “భారతీయుడు” సినిమాకి దర్శకత్వం వహించిన శంకర్(Shankar) ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడి మళ్లీ ఈ మధ్యనే పట్టాలెక్కింది.

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేయడానికి చిత్ర బృందం రాత్రింబవళ్లు కష్టపడుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయట. దీనికోసం దక్షిణాఫ్రికాలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పెద్ద ట్రైన్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్(Action episode) చిత్రీకరణ ఉంటుందట. కేవలం ఒక్క ఎపిసోడ్ కోసమే చిత్ర బృందం అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ లను ఎంపిక చేసుకుందని ఇంకా నిర్మాతలు కూడా ఈ ఎపిసోడ్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక సినిమా మొత్తం మీద ఈ యాక్షన్ సన్నివేశాలు అతిపెద్ద హైలైట్ గా నిలుస్తాయట. ఇంకా 35 రోజుల షూటింగ్ పెండింగ్లో ఉందట. సినిమా షూటింగ్ మే కల్లా పూర్తి చేసి దీపావళి(Diwali) సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal)హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh,), సిద్ధార్థ్, సముద్రఖని, బాబి సింహ, ప్రియ భవాని శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.