రామ్ చరణ్ కు ముఖం మీద గాయాలు.. 

గేమ్ చేంజెర్ షూటింగ్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది యాక్టర్లు అవైలబుల్ గా లేకపోవడం వల్ల షూటింగ్ అక్టోబర్ లో జరిగే అవకాశం ఉందని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ నెలలో షూటింగ్ జరగాల్సిన రెండు రోజుల ముందు రామ్ చరణ్ కు ముఖం మీద గాయాలైనట్లు సమాచారం.  పది రోజుల రెస్ట్ తప్పదు:  రామ్ చరణ్ కు తమ ఇంట్లోనే ముఖానికి గాయాలైనట్లు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించిన […]

Share:

గేమ్ చేంజెర్ షూటింగ్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది యాక్టర్లు అవైలబుల్ గా లేకపోవడం వల్ల షూటింగ్ అక్టోబర్ లో జరిగే అవకాశం ఉందని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ నెలలో షూటింగ్ జరగాల్సిన రెండు రోజుల ముందు రామ్ చరణ్ కు ముఖం మీద గాయాలైనట్లు సమాచారం. 

పది రోజుల రెస్ట్ తప్పదు: 

రామ్ చరణ్ కు తమ ఇంట్లోనే ముఖానికి గాయాలైనట్లు సమాచారం అందింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం గోప్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమాకు గాను సెప్టెంబర్ నెలలో జరగాల్సిన షూటింగ్, అక్టోబర్ రెండో వారానికి వాయిదా పడింది. అయితే అక్టోబర్ లో యాక్షన్ సీన్స్ తీయాల్సి ఉంది. కాకపోతే రామ్ చరణ్ పూర్తిగా కోలుకున్న తరువాతే షూటింగ్ లో పాల్గొంటారని డాక్టర్లు వెల్లడించారు. రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిన తర్వాతే, షెడ్యూల్ జరిగే అవకాశం ఉందని సినీ బృందాలు అంచనా వేస్తున్నాయి. 

రామ్ చరణ్ గేమ్ చేంజర్: 

మొదటిలో కైరా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఇప్పటివరకు శంకర్ డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. 

నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల సినిమా గేమ్ చేంజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

సినిమా చాలాసార్లు ఆలస్యం అవుతుండడంతో, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి శైలేష్ కొలను బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ -రామ్ చరణ్‌ కొంబోలో రాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్‌గా మారవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదనే చెప్పాలి. శైలేష్ సినిమాలో కొంత భాగం మాత్రమే డైరెక్ట్ చేయడం జరుగుతుందని మిగిలిన ముఖ్యమైన సినీ సన్నివేశాలు మొత్తం శంకర్ చేతుల మీదగా డైరెక్ట్ అవుతుందని స్పష్టమైంది. 

కియారా అద్వానీ గురించి మరింత: 

ఆమె ప్రస్తుతం టాలీవుడ్ సినిమా గేమ్ చేంజెస్ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్గా నటిస్తోంది. ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా గేమ్ చేంజెస్ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ రివిల్ కానుంది. ఆమె టాలీవుడ్ లోనే కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె హవా కొనసాగిస్తుంది.

రామ్ చరణ్ గురించి మరింత: 

చరణ్ తన మొదటి చిత్రం చిరుత (2007)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూపర్ డూపర్ హిట్ అయిన RRR (2022), ఇది ₹1,200 కోట్లు (US$150 మిలియన్లు) సంపాదించింది, తర్వాత అదే అత్యధిక వసూళ్లు సాధించింది. RRRలో తన నటనతో ఆకర్షించి, యాక్షన్ మూవీలో ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్లో అవార్డ్స్‌ అందుకున్నాడు.