చిరంజీవి 68వ పుట్టినరోజు, మనవరాలితో ఫోటో

మెగాస్టార్ చిరంజీవి తన 68వ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ బర్త్ డే విషెస్ స్పెషల్ గా చెప్పారు. ఈ 68వ పుట్టినరోజు ప్రత్యేకమైనదని, చిరంజీవి మనవరాలు క్లిన్ కారా పుట్టిన వేల విశేషం, ఇది ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు అంటూ సోషల్ మీడియాలో విషెస్ షేర్ చేశారు రామ్ చరణ్.  మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పసిపాప రాక ఇప్పుడు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చిందని, ఆగస్టు […]

Share:

మెగాస్టార్ చిరంజీవి తన 68వ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ బర్త్ డే విషెస్ స్పెషల్ గా చెప్పారు. ఈ 68వ పుట్టినరోజు ప్రత్యేకమైనదని, చిరంజీవి మనవరాలు క్లిన్ కారా పుట్టిన వేల విశేషం, ఇది ఒక ప్రత్యేకమైన పుట్టినరోజు అంటూ సోషల్ మీడియాలో విషెస్ షేర్ చేశారు రామ్ చరణ్. 

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పసిపాప రాక ఇప్పుడు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువచ్చిందని, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపాడు. క్లిన్ కారాను మెగాస్టార్ ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ మురిసిపోయాడు రామ్ చరణ్. 

క్లిన్ కారా రాక: 

రామ్ చరణ్-ఉపాసన జంట, జూన్ 20న తమ కుమార్తెకు స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని రామ్ తండ్రి చిరంజీవి ఇంటి వద్ద గ్రాండ్, హృదయపూర్వక వెల్కమ్ను అందుకున్న తర్వాత, ఉపాసన ఇప్పుడు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తన చిన్న బిడ్డతో, రామ్ చరణ్ పోజులిచ్చిన ఫోటోను షేర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

తల్లితండ్రులుగా మారిన రామ్ చరణ్ మరియు ఉపాసనలు సాధా తెల్ల రంగు బట్టలు వేసుకుని అద్భుతంగా కనిపించారు. ఉపాసన వారి చిన్న కుమార్తెను ఎత్తుకొని ఉండగా, పక్కనే రామ్ చరణ్ వారి పెంపుడు ప్రాసను ప్రేమగా పట్టుకున్నా ఫోటో ఇటీవల వైరల్ గా మారింది. 

జూన్ నెలలో తన కూతురు పుట్టిన తర్వాత మీడియాతో, సంతోషంగా మాట్లాడిన రామ్ చరణ్ “మీడియాకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు. నాన్న చెప్పినట్లు జూన్ 20న నా కూతురు పుట్టింది.ఉపాసన బాగా కోలుకుంది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నా వైద్యులకు, సిబ్బందికి నా ధన్యవాదాలు. మేము చాలా అదృష్టవంతులం. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఇద్దరూ చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలు ఎప్పటికీ మరువలేను. అన్ని దేశాల నుండి మాకు లభించిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా భావిస్తున్నాను. చాలా ధన్యవాదాలు.” అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.

ఎన్నో సంవత్సరాలుగా బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నా తల్లిదండ్రులకు ఇది సంతోషకరమైన సమయం అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో ఎన్నో ప్రశ్నలను ఈ దంపతులు ఎదుర్కొన్నారు. కానీ అన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఈ చిన్న పాప సమాధానం చెప్పింది. తల్లితండ్రులు అవ్వాలన్న విషయంలో ఈ దంపతులు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అంతర్గతంగా ఎన్నో అవమానకరమైన విషయాలను ఎదుర్కొన్నట్లు కూడా చాలా సందర్భాలలో చూసాము. ఏది ఏమైనప్పటికీ ఈ చిన్న పాప రాకతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనంద సంబరాలు వెల్లువెత్తాయని చెప్పుకోవచ్చు. 

రామ్ చరణ్, చిరంజీవి సినిమాలు: 

వర్క్ పరంగా చూసుకుంటే, రామ్ చరణ్ తర్వాత రాబోయే తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, ఎస్‌జె సూర్య, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్, జయరామ్ మరియు నాజర్ కూడా నటించారు. 

2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం వేదాళం రీమేక్ ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోలా శంకర్. ఈ చిత్రంలో తమన్నా చిరంజీవికి జతగా నటించక, మరోవైపు కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో కనిపించింది. బోలా శంకర్ చిత్రంలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, మరియు ఉత్తేజ్ కూడా నటించారు.