ధోనీని కలిసిన రామ్ చరణ్.. మళ్లీ 13 ఏళ్ల తరవాత..

రామ్ చరణ్ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో అయ్యప్ప మాల విరమణ చేశారు. ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో భాగంగా ఆయన ముంబై వెళ్లారు. అయితే, అక్కడ మహేంద్ర సింగ్ ధోనీని చరణ్ కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఉన్న […]

Share:

రామ్ చరణ్ ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో అయ్యప్ప మాల విరమణ చేశారు. ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో భాగంగా ఆయన ముంబై వెళ్లారు. అయితే, అక్కడ మహేంద్ర సింగ్ ధోనీని చరణ్ కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టార్లు ఇద్దరినీ ఒక్క ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఆనందంతో ఫొటోను షేర్ చేస్తున్నారు. బెస్ట్ పిక్ ఆఫ్ ద డే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎం.ఎస్.ధోనీని రామ్ చరణ్ ముంబైలో కలిశారు. ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం రామ్ చరణ్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రామ్ చరణ్.. ముంబై ఎయిర్‌ పోర్టులో కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. అయితే, ఈరోజు ఉదయం ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో రామ్ చరణ్ తన దీక్షను విరమించారు. అయ్యప్ప మాల విరమణ చేశారు. సిద్ధి వినాయక ఆలయం వద్ద రామ్ చరణ్ ఉన్న వీడియోలు, ఫొటోలు సైతం ఈరోజు వైరల్ అయ్యాయి.

ఈ వీడియో బయటికి వచ్చిన కాసేపటికే ధోనీ, రామ్ చరణ్ ఫొటో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. నిజానికి ధోనీ, రామ్ చరణ్ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారట. అందుకే, వీళ్లిద్దరూ కలిశారని సమాచారం. సుమారు 13 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. 2009లో పెప్సి యాడ్‌లో వీరిద్దరూ కనిపించారు. మళ్లీ ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించబోతున్నారని సమాచారం.

అయితే, ఈ ఫొటోలో రామ్ చరణ్ కన్నా ఎం.ఎస్.ధోనీ ఫిట్‌గా ఉన్నారని కామెంట్లు వస్తున్నాయి. నిజానికి దానిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ధోనీ స్వతహాగా క్రికెటర్ కాబట్టి ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు వెనకడుగు వేయరు. రామ్ చరణ్ కూడా అంతే అనుకోండి. కాకపోతే సినిమాలో చేసే పాత్రను బట్టి ఆహార్యాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అలా, ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో ఆయన రెండు పాత్రలు చేస్తున్నారు కాబట్టి ఆ పాత్రకు తగ్గట్టు తన శరీరాన్ని మలుచుకుని ఉంటారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ ఆలస్యం కావడంతో రామ్‍చరణ్ ప్రస్తుతం ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈనెలాఖరులో గేమ్ చేంజర్ చిత్రీకరణ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.

 అయితే, ధోనీ కూడా హీరోలా ఉన్నారనే కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇక, మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‍లో కొనసాగుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్నారు. ధోనీ కెప్టెన్సీలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‍ను చెన్నై కైవసం చేసుకుంది. శరీరం సహకరిస్తే వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతానని మహీ ఇప్పటికే చెప్పారు.

కాగా, 2009లో పెప్సి యాడ్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ యాడ్ తరవాత మళ్లీ ధోనీ, రామ్ చరణ్‌ కాంబినేషన్ రిపీట్ చేయాలనే డిమాండ్స్ అభిమానుల నుంచి వచ్చాయి. నిజానికి 2016లో ఎం.ఎస్.ధోనీ బయోపిక్ తెరకెక్కిస్తున్నప్పుడు అందులో సురేష్ రైనా పాత్రను రామ్ చరణ్ చేస్తారనే వార్తలు వినిపించాయి. కానీ, అదొక రూమర్‌ గానే మిగిలిపోయింది. మొత్తానికి ఇద్దరి స్టార్ల అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఒక వాణిజ్య ప్రకటన కోసం ధోనీ, రామ్ చరణ్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. సుమారు 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి ఒక యాడ్‌లో నటిస్తున్నారు.