రామ్ చరణ్ హాలీవుడ్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు

చిత్రం పేరు త్వరలో వెల్లడికానుంది రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పాపులారిటీ కూడా బాగా పెరిగింది. వీరిద్దరి అద్భుత నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర విజయం తర్వాత.. రామ్ చరణ్ పేరు మోగిపోతోంది. కొన్నిసార్లు తన వృత్తిపరమైన జీవితం, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితం.. ఇలా […]

Share:

చిత్రం పేరు త్వరలో వెల్లడికానుంది

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పాపులారిటీ కూడా బాగా పెరిగింది. వీరిద్దరి అద్భుత నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్ర విజయం తర్వాత.. రామ్ చరణ్ పేరు మోగిపోతోంది. కొన్నిసార్లు తన వృత్తిపరమైన జీవితం, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితం.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో ఉంటున్నాడు. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ హాలీవుడ్ చిత్రాల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సామ్ ఫ్రాగోసో హోస్ట్ చేసిన వీక్లీ పాడ్‌కాస్ట్ లో.. టాక్ ఈజీలో రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ విజయం తర్వాత తన భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలియజేశాడు.

యుఎస్‌లో ఉన్న రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఆస్కార్‌లను గెలుచుకోవడం తనకు, భారతీయ సినీ పరిశ్రమకు ఎంతో ప్రతిష్టను తెచ్చిపెడుతుందని రామ్ చరణ్ అన్నాడు. ఈ పాడ్‌క్యాస్ట్‌ ఈజీ టాక్ లో అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. దీనిని మాజీ సినీ విమర్శకుడు సామ్ ఫ్రాగోసో హోస్ట్ చేశారు. అయితే.. హైలైట్ ఏమిటంటే, తాను హాలీవుడ్‌లో పని చేయబోతున్నట్లు రామ్ చరణ్ అంగీకరించాడు.

హాలీవుడ్‌లో పని చేస్తున్నారనే పుకార్లపై రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘చర్చలు జరుగుతున్నాయి… రెండు నెలల్లో వార్తలు బయటకు వస్తాయి’ అన్నారు.

రామ్ చరణ్ హాలీవుడ్ లో పనిచేయాలనుకుంటున్నాడు

రామ్ చరణ్ ఇటీవల డేవిడ్ పోలాండ్ నిర్వహించిన DP/30 సిరీస్‌లో కనిపించాడు. దీనిపై రామ్ చరణ్ మాట్లాడుతూ..  హాలీవుడ్ యాక్టర్ అవ్వాలని ఎవరికి ఉండదు? సినిమా అనేది ఏ భాష పైనా, సరిహద్దు పైనా ఆధారపడదు. ఇప్పుడు గ్లోబల్ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఇది కేవలం బాలీవుడ్, హాలీవుడ్‌కే పరిమితం కాలేదు. సంస్కృతి, వ్యక్తుల ప్రతిభ కూడా అన్నిచోట్లా వ్యాపిస్తుందని ఆయన అన్నారు. ఇంకా, దర్శకులందరూ మా నటప్రతిభను చూడాలని, నేను కూడా అలాగే పని చేయాలని కోరుకుంటున్నానని, ఇది అందరికీ చాలా మంచి సినర్జీగా ఉంటుందని ఆయన అన్నారు. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాతలు దర్శకులు, కళాకారులతో కలిసి పని చేయాలనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా గొప్ప అనుభవం అవుతుందని ఆయన అన్నారు. ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నానని, మరికొద్ది నెలల్లో తన మొదటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేస్తానని వెల్లడించాడు.

జూలియా రాబర్ట్స్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ వంటి హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు రామ్ చరణ్ వెల్లడించాడు. ఇప్పుడు రామ్ చరణ్ హాలీవుడ్ సినిమా చేస్తాడా? లేదా.. సిరీస్‌లో చేస్తాడా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి నిర్ధారణా లేదు. రామ్ చరణ్ గతంలో కూడా హాలీవుడ్‌లో నటించాలనే కోరికను వ్యక్తం చేశాడు. నేను హాలీవుడ్‌లో పని చేయాలనుకుంటున్నాను అని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.

ఆస్కార్ అవార్డుల కోసం రామ్ చరణ్ ఈ రోజుల్లో అమెరికాలో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ నుండి ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయబడింది. ఈ సమయంలో, రామ్ చరణ్ హాలీవుడ్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా, క్లేటా ఎంటర్టైన్మెంట్ షోలలో కనిపించాడు.