విరాట్ కోహ్లీ బయోపిక్.. రామ్ చరణ్ ..?

విరాట్ కోహ్లీ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి, ఒక దిగ్గజ క్రికెటర్ ఆట తీరు గుర్తొస్తుంది కదా.. మరి అలాంటి విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ప్రస్తుతం కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల RRR సినిమాతో పాపులర్ హిట్ కొట్టిన రామ్ చరణ్, విరాట్ కోహ్లీ బయోపిక్ లో, విరాట్ కోహ్లీ పాత్రను పోషిస్తున్నట్లు పలు వార్తలు వెలువడుతున్నాయి. మరి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ […]

Share:

విరాట్ కోహ్లీ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి, ఒక దిగ్గజ క్రికెటర్ ఆట తీరు గుర్తొస్తుంది కదా.. మరి అలాంటి విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ప్రస్తుతం కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల RRR సినిమాతో పాపులర్ హిట్ కొట్టిన రామ్ చరణ్, విరాట్ కోహ్లీ బయోపిక్ లో, విరాట్ కోహ్లీ పాత్రను పోషిస్తున్నట్లు పలు వార్తలు వెలువడుతున్నాయి. మరి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తున్నారా? మరి రామ్ చరణ్ అందులో.. విరాట్ కోహ్లీ పాత్ర పోషిస్తున్నాడా? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.. 

రామ్ చరణ్ మాటల్లో : 

రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే సినిమా గేమ్ చేంజెస్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకించి తను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసే క్రమంలో ఉన్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ బయోపిక్ వార్తలు బయటికి వస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది రాంచరణ్, విరాట్ కోహ్లీ అభిమానులు ఈ వార్త విని ఎక్సైట్మెంట్తో తమ వైపు నుంచి కూడా ఈ వార్తను షేర్ చేయడం మొదలుపెట్టారు. అయితే వైరల్ గా మారిన వార్తలో, ముఖ్యంగా ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ బ్యానర్ ఈ ప్రాజెక్టు టేకప్ చేస్తున్నట్లు, అంతేకాకుండా అందులో రంగస్థలం యాక్టర్ రామ్ చరణ్ హీరోగా నటించిబోతున్నట్లుగా వార్తలు రాసుకు వచ్చారు. రామ్ చరణ్ ఇటీవల మాట్లాడుతూ, అటువంటి ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ప్రస్తావన రాలేదని, అంతేకాకుండా తాను విరాట్ కోహ్లీ పాత్రలో నటించే ప్లాన్ కూడా ఇంకా చేసుకోలేదని, ప్రస్తుతం వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు రాంచరణ్. 

రామ్ చరణ్ గేమ్ చేంజర్: 

మొదటిలో కైరా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఇప్పటివరకు శంకర్ డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. 

నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల సినిమా గేమ్ చేంజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

సినిమా చాలాసార్లు ఆలస్యం అవుతుండడంతో, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి శైలేష్ కొలను బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ -రామ్ చరణ్‌ కొంబోలో రాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్‌గా మారవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదనే చెప్పాలి. శైలేష్ సినిమాలో కొంత భాగం మాత్రమే డైరెక్ట్ చేయడం జరుగుతుందని మిగిలిన ముఖ్యమైన సినీ సన్నివేశాలు మొత్తం శంకర్ చేతుల మీదగా డైరెక్ట్ అవుతుందని స్పష్టమైంది.