రామ్ చరణ్ కి గ్రాండ్ వెల్కమ్.. కిక్కిరిసిన జనసంద్రోహం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అవార్డులు తీసుకున్న తరువాత అంతా హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం ఏగబడ్డారు.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అవార్డులు […]

Share:

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అవార్డులు తీసుకున్న తరువాత అంతా హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం ఏగబడ్డారు..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును అందుకుంది. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అవార్డులు తీసుకున్న తరువాత అంతా హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం ఏగబడ్డారు. కాగా ఒక్క రామ్ చరణ్ మాత్రం ఢిల్లీకి వెళ్లారు.

రామ్ చరణ్ కోసం జనసంద్రోహం

ఢిల్లీ విమానాశ్రమం వద్ద రామ్ చరణ్ రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అభిమానులు. వేలాదిగా మెగా అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఆర్ఆర్ఆర్ బ్యానర్లు, చరణ్ ఫ్లెక్సీలు పట్టుకుని రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికారు.  కాగా అక్కడ ఎయిర్ పోర్టులో అభిమానులు సెల్ఫిస్ కోసం రామ్ చరణ్ ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. కానీ.. అందుకు ఆస్కారం ఇవ్వలేదు. రామ్ చరణ్ కోసం అభిమానులు భారీ సంఖ్యలో ఏర్పోర్ట్ కి చేరుకున్నారు. చుట్టూ జనసంద్రోహంలో రామ్ చరణ్ ఉన్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అభిమానులకు సెల్ఫీలు ఇవ్వకపోయినా.. అక్కడ ఉన్న మీడియాతో మాత్రం మాట్లాడారు. నాటు నాటు పాటను దేశ ప్రజలు బాగా ఆదరించారని, ఆ పాట తమ సినిమా పాటగా కాదని, దేశ ప్రజలందరిదని రామ్ చరణ్ అన్నారు. అంతే కాకుండా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో పాటు ఆస్కార్ కు ఎంపిక అయ్యేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అంతా హైదరాబాద్ చేరుకున్నారు. కానీ రామ్ ఒక్కడే ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అని అనుమానాలు కూడా పలువురికి కలిగాయి. కాగా.. సోషల్ మీడియాలో వినిపించిన సమాచారం ప్రకారం.. ఆ రోజు రాత్రి మోడీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. అంతే కాకుండా సచిన్ టెండుల్కర్ కూడా అక్కడికి విచ్చేయనున్నారని వార్తలు వినిపించాయి.

RC15:

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గొప్ప క్రేజ్ అందుకున్నారు. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాతో సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక సెకండ్ హీరోయిన్ గా అంజలి కూడా నటించనుంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అంటే మార్చి 27న విడుదల చేయనున్నారు. 

బర్త్ డే సిడిపి: 

మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బర్త్ డే కామన్ డిపిని విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాల్లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న రామ్ చరణ్ బర్త్ డే సిడిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాస్టార్ వారసుడిగా అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత మగధీరతో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగాధీరుడు అనిపించుకున్నాడు. గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా అదరగొట్టి.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను ఎన్టీఆర్ తో కలిసి తిరగ రాశారు. అంతేకాకుండా లోకల్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.