శంకర్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌

ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను అందించిన ఎస్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న గేమ్ చేజర్ మూవీలో నటిస్తున్న హీరో రామ్ చరణ్ తమ ట్విట్టర్ నుంచి శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన గైడెన్స్ తన వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఎంతగానో సహాయపడిందని తనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా చాలా సంతోషంగా భావిస్తున్నానని, ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా డైరెక్టర్ శంకర్ కి తనదైన శైలిలో విషెస్ తెలిపారు రామ్ చరణ్. […]

Share:

ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను అందించిన ఎస్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న గేమ్ చేజర్ మూవీలో నటిస్తున్న హీరో రామ్ చరణ్ తమ ట్విట్టర్ నుంచి శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన గైడెన్స్ తన వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఎంతగానో సహాయపడిందని తనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా చాలా సంతోషంగా భావిస్తున్నానని, ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా డైరెక్టర్ శంకర్ కి తనదైన శైలిలో విషెస్ తెలిపారు రామ్ చరణ్.

గేమ్ చేంజర్ మూవీ: 

మొదటిలో కైరా అద్వానీ- రామ్ చరణ్ జతగా నటించిన వినయ విధేయ రామ ప్రేక్షకుల ఆదరభిమానాలు అందుకున్న తర్వాత, మళ్లీ ఈ జంట గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఇప్పటివరకు శంకర్ డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపించినప్పటికీ, ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. 

నిర్మాత దిల్ రాజుకు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్‌ల సినిమా గేమ్ చేంజర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఇది నిర్మాతగా దిల్ రాజు తీస్తున్న 50వ సినిమా. అంతేకాకుండా, అతని అత్యంత ఖరీదైన నిర్మాణంతో మొదటి పాన్-ఇండియన్ చిత్రం అవడం విశేషం. ఇది మావెరిక్ ఫిల్మ్ మేకర్ శంకర్ తీస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా. ఇంకా, తన కెరీర్‌లో మొదటిసారి, నిర్మాత దిల్ రాజు కూడా తన సినిమాను పూర్తిగా కార్పొరేట్ స్టూడియో జి స్టూడియోస్కి అమ్మడం జరిగింది. 325 కోట్ల – 350 కోట్ల రేంజ్‌లో ఈ డీల్ జరిగినట్లు సమాచారం. 

మూవీలో మరో డైరెక్టర్:

అందుకున్న సమాచారం ప్రకారం, సినిమా చాలాసార్లు ఆలస్యం అవుతుండడంతో, గేమ్ ఛేంజర్‌లో కొంత భాగాన్ని చిత్రీకరించడానికి శైలేష్ కొలను బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ -రామ్ చరణ్‌ కొంబోలో రాబోతున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త షాక్‌గా మారవచ్చు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదనే చెప్పాలి. శైలేష్ సినిమాలో కొంత భాగం మాత్రమే డైరెక్ట్ చేయడం జరుగుతుందని మిగిలిన ముఖ్యమైన సినీ సన్నివేశాలు మొత్తం శంకర్ చేతుల మీదగా డైరెక్ట్ అవుతుందని స్పష్టమైంది. గేమ్ చేజర్ మూవీలో నటిస్తున్న హీరో రామ్ చరణ్ తమ ట్విట్టర్ నుంచి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన గైడెన్స్ తన వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఎంతగానో సహాయపడిందని తనకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా చాలా సంతోషంగా భావిస్తున్నానని, ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా డైరెక్టర్ శంకర్ కి తనదైన శైలిలో విషెస్ తెలిపారు రామ్ చరణ్.

శంకర్ డైరెక్షన్లో రాబోతున్న చిత్రాలు: 

శంకర్ తీసిన రెండు భారీ చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ కాకుండా, ప్రముఖ దర్శకుడు కమల్ హాసన్‌తో ఇండియన్ 2లో కూడా కలిసి పని చేశారు. వారి 1996లో హిట్ అయిన ఇండియన్‌కి సీక్వెల్, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఏడాది విడుదల కానుంది. శంకర్ ఏకకాలంలో రెండు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలను వర్క్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అవుతాడని ఆశిద్దాం.