తెలుగు సినీ పరిశ్రమను కొనియాడిన రక్షిత్ శెట్టి

777 చార్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రక్షిత్ శెట్టి అభిమాని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఎంతగానో పాపులర్ అయింది. అంతేకాకుండా అభిమానులను సంపాదించి పెట్టింది. చార్లీ సినిమాలో రక్షిత్ శెట్టి అదేవిధంగా ఒక చార్లీ అనే ఒక మంచి శునకం మధ్యలో ఉన్న ప్రత్యేకమైన స్నేహ బంధాన్ని ఆకర్షణీయంగా చూపించి సక్సెస్ అయ్యారు.  కొనియాడిన రక్షిత్ శెట్టి:  తెలుగు సినిమా పరిశ్రమ గురించి రక్షిత్ శెట్టి తనదైన శైలిలో పొగిడారు. తెలుగు సినిమా […]

Share:

777 చార్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు రక్షిత్ శెట్టి అభిమాని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఎంతగానో పాపులర్ అయింది. అంతేకాకుండా అభిమానులను సంపాదించి పెట్టింది. చార్లీ సినిమాలో రక్షిత్ శెట్టి అదేవిధంగా ఒక చార్లీ అనే ఒక మంచి శునకం మధ్యలో ఉన్న ప్రత్యేకమైన స్నేహ బంధాన్ని ఆకర్షణీయంగా చూపించి సక్సెస్ అయ్యారు. 

కొనియాడిన రక్షిత్ శెట్టి: 

తెలుగు సినిమా పరిశ్రమ గురించి రక్షిత్ శెట్టి తనదైన శైలిలో పొగిడారు. తెలుగు సినిమా చూసేందుకు అభిమానులు ఎంతగా ఆరాటపడుతూ ఉంటారో తన మాటల్లో వ్యక్తం చేశారు కూడా. చార్లీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్న రక్షిత్ శెట్టి, తెలుగు పరిశ్రమలో ఉండే సినిమా కల్చర్ గురించి గుర్తు చేశారు. తెలుగు ప్రేక్షకులు సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే విధానం మరి ఏ ఇతర సెలబ్రేషన్ లో కనిపించదు అంటూ మాట్లాడారు రక్షిత్ శెట్టి. సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ, సినిమా ఎందుకు హిట్ అవ్వలేదు అని కొంతమంది అభిమానులు చూస్తారని చార్లీ హీరో మాట్లాడటం జరిగింది.

రక్షిత్ శెట్టి సినీ ప్రయాణం: 

తెలుగు సినిమా ప్రపంచంలోకి శెట్టి ప్రయాణం అసాధారణమైనది. వీసీఆర్‌లు, సీడీల ద్వారా తన రూమ్‌మేట్ శ్రీ కృష్ణ ఆచార్య, సినిమాలను పరిచయం చేయడంతో ఇదంతా తన ఇంజనీరింగ్ రోజుల్లోనే ప్రారంభమైందని అతను వెల్లడించాడు. అతని రూమ్‌మేట్ ఇష్టపడే స్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు. శెట్టి చిరంజీవి సినిమాలు అంటే పడి చచ్చేవారని, చిరంజీవి సినిమాలు చూసి తను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చాలా సార్లు చెప్పారు, రక్షిత్ శెట్టి.

తెలుగు కుటుంబాలు పాటించే ఆచారాలు పట్ల నటుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “ఇది ఒక సంప్రదాయం,” అని అతను చెప్పుకొచ్చాడు, అభిమానాలు తెలుగు కుటుంబాలు ప్రతి వారం కనీసం ఒక సినిమా చూడటం ఒక అంశంగా పెట్టుకుంటారని. ఒక సినిమా బాగా ఆడకపోయినా తెలుగు ప్రేక్షకులు సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ సినిమా బాగాలేకపోయినా, ఎందుకు బాగోలేదో చూసేందుకు వెళ్లి సినిమా చూస్తారు’ అని నవ్వుతూ తనదైన శైలిలో చెప్పాడు రక్షిత్ శెట్టి. నిజంగా తాను చలనచిత్రంలోకి అడుగుపెట్టిన తర్వాతే, తెలుగు సినీ రంగానికి ఉన్న లోతు మరింత తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు రక్షిత్ శెట్టి. 

రక్షిత్ శెట్టి పర్సనల్ లైఫ్: 

కొన్ని సంవత్సరాల క్రితం, రష్మిక మందన్న మరియు రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరిగింది. అయితే, నటి తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ తమ తమ పర్సనల్ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన సినిమాలతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా రష్మిక మందన నేషనల్ క్రష్ గా పాపులర్ అయింది. ఇటీవల రష్మిక మందాన నటించిన పుష్ప సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా చాలామంది పాపులర్ యాక్టర్ సరసన నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

రక్షిత్ శెట్టి రాబోయే సినిమాలు: 

సింపుల్ స్టార్‌గా ప్రసిద్ధి చెందిన తుగ్లక్ సినిమా నటుడు ప్రస్తుతం తన రాబోయే చిత్రం సప్త సాగరదాచే ఎల్లో: సైడ్ బి, ప్రత్యేకంగా తెలంగాణా రాష్ట్రంలో ప్రమోషన్‌లను పెంచడానికి హైదరాబాద్‌లో తన అభిమానులతో థాంక్స్ స్పెండ్ చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో విడుదలైన సప్త సాగరదాచే ఎల్లో: సైడ్ ఎ అనే కన్నడ చిత్రానికి తెలుగు వర్షన్ లో సీక్వెల్ ఈ చిత్రం.