బెంగళూరు బస్సు డిపోకి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చిన రజినీకాంత్

రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ బెంగళూరులోని బిఎంటీసి డిపో కి వెళ్ళాడు. తను యాక్టర్ కాకముందు రజనీకాంత్ ఇక్కడే పని చేసేవాడు. రజనీకాంత్ ఇక్కడికి రావడంతో అందరూ షాక్ అయ్యారు. రీసెంట్గా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా టీమ్ అంతా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రజనీకాంత్  సూపర్ స్టార్ అయినా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని మాత్రం మర్చిపోలేదు. బాలచందర్ అపూర్వ […]

Share:

రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ బెంగళూరులోని బిఎంటీసి డిపో కి వెళ్ళాడు. తను యాక్టర్ కాకముందు రజనీకాంత్ ఇక్కడే పని చేసేవాడు. రజనీకాంత్ ఇక్కడికి రావడంతో అందరూ షాక్ అయ్యారు.

రీసెంట్గా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా టీమ్ అంతా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రజనీకాంత్  సూపర్ స్టార్ అయినా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని మాత్రం మర్చిపోలేదు.

బాలచందర్ అపూర్వ రాగంగల్ సినిమాలో నటించడానికి ముందు రజనీకాంత్ బస్సు కండక్టర్గా చేసేవాడు. ఈ అపూర్వ రాగంగల్ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటించాడు. ఈ సినిమాలో శ్రీవిద్య,  జయసుధ లాంటి వాళ్ళు కూడా నటించారు.

బిఎంటిసి బస్సు డిపోకు వెళ్లిన రజనీకాంత్:

సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ బిఎంటిసి బస్ డిపోలో కండక్టర్గా పని చేసేవాడు. తను రీసెంట్ గా బిఎంటిసి బస్సు డిపోకు వెళ్లి కండక్టర్స్,  డ్రైవర్స్ ని కలిశాడు. వాళ్లతో చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. వాళ్లతో సెల్ఫీస్ కూడా తీసుకున్నాడు. రజనీకాంత్ కోసం వచ్చిన ఫ్యాన్స్ తో కూడా సెల్ఫీస్ తీసుకున్నాడు.

రజినీకాంత్ కర్ణాటకలోనే పుట్టాడు,  రజినీకాంత్ పేరు శివాజీ రావు గైక్వాడ్. సినిమాల్లోకి వచ్చాక తన పేరుని రజినీకాంత్ గా మార్చుకున్నాడు. రజినీకాంత్ ఇలా ఈ బస్సు డిపో కి వచ్చి చాలామందిని సర్ప్రైజ్ అయ్యేలా చేశాడు. రజనీకాంత్ ఇక్కడికి వచ్చినందుకు వాళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన జైలర్ భారీ విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ప్రస్తుతం ఈ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది.

రజినీకాంత్ సినీ కెరీర్:

రజనీకాంత్ తన సినీ కెరియర్ మొదట్లో చాలా నెగెటివ్ పాత్రల్లో కూడా చేశాడు. తర్వాత రాను రాను పెద్ద దర్శకుల సినిమాల్లో నటించాడు. రజనీకాంత్ సినిమా సినిమాకు తన స్టైల్ తో తన రేంజ్ ను పెంచుకున్నాడు.

సూపర్ స్టార్ సినిమాలు వస్తున్నాయంటే తమిళనాడులో క్రేజ్ మామూలుగా ఉండదు. నరసింహ సినిమాతో రజనీకాంత్ తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. రజనీకాంత్ సినిమాలు అంటే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. చంద్రముఖి సినిమా అయితే తెలుగులో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. దాదాపుగా అప్పట్లో ఈ సినిమా భారీ సంచలనాలే సృష్టించింది. రజనీకాంత్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఓపెనింగ్స్ భారీగానే ఉంటాయి. ఇక సినిమాలో కంటెంట్ మంచిగా ఉంటే వసూళ్లు ఇంకా భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో తెలుగులో రజనీకాంత్ సినిమాల జోరు కాస్త తగ్గింది. కబాలి,  కాలా లాంటి సినిమాలు తెలుగులో అంతగా ఆడలేదు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కి సినిమాలో కంటెంట్ కొంచెం ఉన్నా సరిపోతుంది. జైలర్ సినిమాలో రజనీకాంత్ తన నటనతో అభిమానులను అలరించాడు. భవిష్యత్తులో కూడా రజినీకాంత్ అభిమానులను అలరించాలని కోరుకుందాం. 

రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చెన్నైలో ఆఫీసులకు సెలవులు ఇస్తున్నారు అంటే తన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తను ఎంత ఎదిగినా చాలా కూల్ గా,  అందరితో కలిసి పోతూ ఉంటాడు. అందుకే తను సూపర్ స్టార్ అయ్యాడు. రజనీకాంత్ గారు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం.