సూపర్ స్టార్ ట్యాగ్ తీసేస్తే బెట‌ర్: రజినికాంత్

రజినికాంత్ సినిమా ఆగష్టు నెలలో, చిరంజీవి భోళా శంకర్ సినిమా తో పోటీ పడేందుకు, విడుదలకు సిద్ధం కాబోతోందన్న విషయం తెలిసిందే. జైలర్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి రజనీకాంత్ జైలర్ గురించి, మద్యపానం గురించి వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. భారీ అంచనాలున్న రజనీకాంత్ చిత్రం జైలర్ వచ్చే నెలలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శుక్రవారం, మేకర్స్ చెన్నైలో గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి రజనీకాంత్, తమన్నా భాటియా, నెల్సన్ దిలీప్‌కుమార్, అనిరుధ్ […]

Share:

రజినికాంత్ సినిమా ఆగష్టు నెలలో, చిరంజీవి భోళా శంకర్ సినిమా తో పోటీ పడేందుకు, విడుదలకు సిద్ధం కాబోతోందన్న విషయం తెలిసిందే. జైలర్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి రజనీకాంత్ జైలర్ గురించి, మద్యపానం గురించి వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. భారీ అంచనాలున్న రజనీకాంత్ చిత్రం జైలర్ వచ్చే నెలలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శుక్రవారం, మేకర్స్ చెన్నైలో గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి రజనీకాంత్, తమన్నా భాటియా, నెల్సన్ దిలీప్‌కుమార్, అనిరుధ్ రవిచందర్ తదితరులు హాజరయ్యారు. సూపర్ స్టార్ ని చూసేందుకు సముద్ర ప్రవాహంలా వచ్చిన తన అభిమానులను ఉద్దేశించి జైలర్ గురించి మద్యపానం గురించి వేదికపై మాట్లాడుతూ వ్యక్తిగత విశేషాలను కూడా పంచుకున్నారు. 

నెల్సన్ దిలీప్‌కుమార్ “బీస్ట్” భయం: 

రజనీకాంత్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. ఇతను విజయ్ తో ఇంతకముందు తీసిన “బీస్ట్” తెలుగులో తమిళంలో విఫలం అయ్యిందని మనకి తెలుసు. బీస్ట్‌కి గాను వచ్చిన నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ, అతనితో రజినీకాంత్ ఎందుకు సినిమా చేశారో అనే దాని గురించి మాట్లాడుతూ.. బీస్ట్ ఇష్యూ మధ్య నెల్సన్‌పై ఎలా విశ్వాసం పొందాననే విషయం వివరిస్తూ, “మేము సన్ పిక్చర్స్‌లో ఇంటర్నల్ డిస్కషన్ అనేది పెట్టుకున్నాము, అప్పుడు బీస్ట్ కి చాలా ప్రతికూల సమీక్షలు ఉన్నప్పటికీ, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బు ఏమీ పోలేదని గమనించాము. .” హుకుమ్ పాట విన్న తర్వాత రజిని లిరిక్స్ నుండి “సూపర్ స్టార్” అనే పదాన్ని తీసెయ్యమన్నారట. “సూపర్ స్టార్ టైటిల్ ఎప్పుడూ సమస్యే” అని సరదాగా అంటూ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరియు తమన్నా భాటియాపై కూడా ప్రశంసలు కురిపించారు రజిని. నిర్మాత కళానిధి మారన్‌పై కూడా సరదా వ్యాఖ్యానించి “ఐపిఎల్ స్టాండ్‌లలో విచారంగా ఉన్న కావ్య మారన్‌ని ఇష్టపడడు” కాబట్టి ఎస్ఆర్హెచ్ కి మెరుగైన ఆటగాళ్లను పెట్టాలని చెప్పాడు. 

రజిని అలవాటు: 

ఈ విషయాలతో పాటు, రజనీకాంత్ తనకు మద్యపాన వ్యసనం ఉండేదని చెబుతూ, మద్యపానం వలన అనారోగ్యంతో పాటు, ఒకరి కుటుంబంలో అందరినీ బాధిస్తుందని, అలాంటి వ్యసనం నుంచి దూరంగా ఉండమని అభిమానులకు సలహా ఇచ్చారు. ఆయన తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటిగా మద్యపానాన్ని గురించి పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఒకసారి నాటకం ప్రదర్శన తర్వాత రాత్రి 2 గంటలకు తాగి ఇంటికి వస్తే, వేడుకలు చేసుకోవడానికి తాగు కానీ, అలవాటు చేసుకోవద్దని తన అన్న సలహా ఇచ్చారని పంచుకున్నారు. 

కాన్ఫిడెన్స్ పంచుకున్న రజిని: 

ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చెన్నైలోని ప్రతిష్టాత్మక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగింది. రజినికి ప్రేక్షకుల నుండి చప్పట్లతో అద్భుతమైన స్పందన వచ్చింది. తనపై వచ్చిన ప్రతికూల వ్యాఖ్యలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని ముగిస్తూ, “మొరగని కుక్కలు లేవు, విమర్శించని నాలుకలు లేవు, ఈ రెండూ లేని ప్రదేశాలు లేవు.” అన్నారు. రజనీకాంత్‌తో పాటు, జైలర్‌లో జాకీ ష్రారోఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా మరియు మలయాళం స్టార్ మోహన్‌లాల్ అతిధి పాత్రలో సమిష్టి తారాగణంగా కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు, ఆ పాటలు ఇప్పటికే ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. జైలర్ ఆగస్ట్ 11న విడుదల కానుంది.