Rajini: త‌లైవా ముత్తు సినిమా రీ రిలీజ్

Rajini: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తమిళ సూపర్ స్టార్ అయినా కానీ ఈ యాక్టర్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంక తెలుగు నాట ఫ్యాన్స్ ఉండకుండా అసలుకే ఉండలేరు. ఎందుకోసమంటే రజనీ ఎప్పటి నుంచో తన సినిమాలను తెలుగు నాట రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఆయన మ్యానరిజమ్స్ ఒక్క సినిమాలో చూస్తేనే ఎవరైనా సరే అభిమానులుగా మారిపోతారు. అటువంటిది ఇన్ని సంవత్సరాల నుంచి అతడు […]

Share:

Rajini: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తమిళ సూపర్ స్టార్ అయినా కానీ ఈ యాక్టర్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంక తెలుగు నాట ఫ్యాన్స్ ఉండకుండా అసలుకే ఉండలేరు. ఎందుకోసమంటే రజనీ ఎప్పటి నుంచో తన సినిమాలను తెలుగు నాట రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఆయన మ్యానరిజమ్స్ ఒక్క సినిమాలో చూస్తేనే ఎవరైనా సరే అభిమానులుగా మారిపోతారు. అటువంటిది ఇన్ని సంవత్సరాల నుంచి అతడు తన సినిమాలను తెలుగు నాట రిలీజ్ చేస్తున్నాడంటే.. అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండకుండా ఉండే చాన్సే లేదు. 

మొన్నటి దాకే జైలర్ హంగామా.. 

జైలర్ (Jailer) మూవీ తమిళ్ మూవీయే అయినా కానీ తెలుగు నాట కూడా రికార్డులు కొల్లగొట్టింది. చాలా రోజుల నుంచి సరైన హిట్ లేకుండా కాలం వెళ్లదీస్తున్న రజనీకాంత్(Rajinikanth) కు జైలర్ సినిమా ఒక మంచి హిట్ ఇచ్చిందనే చెప్పాలి. జైలర్ హిట్ కనుక లేకపోతే రజనీ(Rajinikanth) స్టామినా తగ్గిందని అంతా అనుకునేవారు. వరుసగా కొద్ది రోజుల నుంచి రజనీ సినిమాలు ప్లాప్ అవుతూ వస్తుండే సరికి రజనీ పని అయిపోయిందని చాలా మంది కామెంట్లు చేశారు. కానీ వారి మాటలకు చెక్ పెడుతూ రజనీకాంత్ (Rajinikanth) జైలర్ (Jailer) మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ మూవీలో రజనీకాంత్ తన పాత సినిమాల్లో లాగ పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా కొట్టలేదు. కేవలం నడుచుకుంటూ వస్తే సినిమా వందల కోట్ల రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకుంది. అది రజనీకాంత్ (Rajinikanth) స్టామినా అని జైలర్ సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు. ఈ మూవీకి పెద్దగా బడ్జెట్ కూడా అవసరం లేకుండానే ఇది కోట్లు కొల్లగొట్టింది. 

నడుస్తున్న రీరిలీజ్ ల ట్రెండ్..

ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమలల్లో రీరిలీజ్ (Re-Release) ల ట్రెండ్ నడుస్తోంది. పాత సినిమాలకు 4కే (4K) మ్యూజిక్ యాడ్ చేసి మరలా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రీరిలీజ్ ల ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తుంది. అప్పట్లో రాని కలెక్షన్లు ఇప్పుడు రీరిలీజ్ ద్వారా వస్తున్నాయి. ఇక రజనీకాంత్ సినిమా అంటే ఒక రకమైన రేంజ్ ఉంటుంది. ఆయన ఇప్పటి సినిమాలు మాత్రమే కాకుండా పాత సినిమాలు కూడా చాలా పెద్ద హిట్ అయి ఉన్నాయి. అలాగే రజనీకాంత్ నటించిన పాత మూవీ ముత్తు ఇప్పుడు డిసెంబర్ లో రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

అసలేంటీ ముత్తు స్టోరీ.. 

ముత్తు (Muthu) మూవీ 1995లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇది ఒక యాక్షన్ మూవీ. ఈ మూవీలో హీరోయిన్ గా మీనా (Meena) నటించింది. అంతే కాకుండా ఈ మూవీలో శరత్ బాబు, రాధా రవి, జయభారతి, వడివేలు మరియు ఇంకా చాలా మంది తారాగణం ఉన్నారు. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఈ మూవీలో ఒక జమీందార్ మరియు అతడి వద్ద పని చేసే వ్యక్తి ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. జమీందార్ గా శరత్ బాబు, పని వాడి రోల్ లో రజనీకాంత్(Rajinikanth) నటించారు.ఇక ఈ మూవీకి రెహమాన్ సమకూర్చిన స్వరాలు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి. ఈ మూవీ అప్పట్లో  పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ సినిమాలోని పాటలు (Songs) ఈ మూవీకి పెద్ద హైలెట్. 

తలైవర్ 171తో రజనీ..

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ప్రస్తుతం తలైవర్ 171 (వర్కింగ్ టైటిల్) సినిమాను చేస్తున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీని క్రియేట్ చేసి అందులో పలు హిట్ సినిమాలను తెరకెక్కంచిన లోకేష్ కనగరాజన్ (Lokesh Kanagaraj) ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న లోకేష్ కనగరాజన్ కు ప్లాప్ అన్నదే లేదు. ఈ మూవీ కూడా రజనీ సినీ కెరియర్ లో మరో మైల్ స్టోన్ అవుతుందని అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. కేవలం ఇది మాత్రమే కాకుండా టీజే జ్ఞానవేల్ రాజాతో (Gnanavel Raja) కలిసి తలైవర్ 170ని కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక రేంజ్ లో ఉంటాయని అంతా అనుకుంటున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా ఇంకా అనేక ఇండస్ట్రీల తారాగణం భాగం అయ్యారు. కావున ఈ మూవీ కూడా బిగ్ హిట్ అవడం చాలా పక్కా.. అని అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.