వారం రోజులకి రజనీకాంత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే… ఆశ్చర్యపోతారు 

రజనీ తాజాగా ఓ చిత్రం కోసం వారం రోజులకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట సూపర్ స్టార్ రజినీకాంత్.. పరిచయం అవసరం లేని పేరు, ఎవరికీ లేనంత స్టార్‌‌డమ్. ఈయనకున్న క్రేజ్ గురించి గురించి చెప్పక్కర్లేదు. 70 ఏళ్ల వయసులో కూడా హీరోగా సినిమాలు చేస్తూ, అదే క్రేజ్ కొనసాగిస్తున్నారు. రజనీకాంత్ తమిళ సినిమాకి ప్రసిద్ధ నటుడు మరియు నిర్మాత, అంతే కాకుండా, అతను విజయవంతమైన స్క్రీన్ రైటర్ కూడా. తమిళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గానే కాకుండా […]

Share:

రజనీ తాజాగా ఓ చిత్రం కోసం వారం రోజులకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట

సూపర్ స్టార్ రజినీకాంత్.. పరిచయం అవసరం లేని పేరు, ఎవరికీ లేనంత స్టార్‌‌డమ్. ఈయనకున్న క్రేజ్ గురించి గురించి చెప్పక్కర్లేదు. 70 ఏళ్ల వయసులో కూడా హీరోగా సినిమాలు చేస్తూ, అదే క్రేజ్ కొనసాగిస్తున్నారు. రజనీకాంత్ తమిళ సినిమాకి ప్రసిద్ధ నటుడు మరియు నిర్మాత, అంతే కాకుండా, అతను విజయవంతమైన స్క్రీన్ రైటర్ కూడా. తమిళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గానే కాకుండా దేవుడిగా కూడా పరిగణిస్తారు. సినిమాల్లో తనదైన శైలిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి కింగ్ ఆఫ్ స్టైల్ అని పిలుచుకుంటారు. కాగా ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రతి సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే తలైవా.. తన కూతురు డైరెక్ట్ చేసే ఒక సినిమాకి కేవలం వారం రోజులకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రజనీ ఎన్ని ప్లాప్ సినిమాలు చేసినా కానీ ఆయనకు ఉన్న క్రేజ్ ఇంతైనా తగ్గదు. ఎక్కడో బస్ కండక్టర్ నుంచి ఇంత పెద్ద సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడంటే ఆయన స్టార్ డమ్ వెనుక ఎంత కృషి ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే కానీ అంత పెద్ద స్టార్లుగా ఎదగలేరు. ఇక రజనీకాంత్ కేవలం తమిళ ఇండస్ట్రీకి, భారతీయ సినిమాకు మాత్రమే పరిమితం కాదు.. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్టైల్, మేనరిజంకే అభిమానులుంటారు. ఇంత మంది అభిమానులు ఉన్నా కానీ రజనీ షూటింగ్స్ లేని సమయాల్లో బయటకు వచ్చినపుడు విగ్గు పెట్టుకోకుండానే బట్టతల తోనే వస్తారు. ఆయనకు స్టార్ హీరోననే అహంకారం అస్సలుకే ఉండదు. తనకు తెలియని విషయాన్ని తన కంటే చిన్న వారినైనా అడిగి తెలుసుకుంటారు. రజనీ సినిమా వచ్చిందంటే …  ఆ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చినా సరే.. కోట్లు వసూలు చేయకుండా ఆ సినిమాలు థియేటర్లను వదిలి వెళ్లవు. రజనీ తాజాగా ఓ చిత్రం కోసం వారం రోజులకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్‌‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన సినిమాలంటే ఫ్యాన్స్‌‌కి పండగే. రజినీకాంత్ తెరపై కనిపిస్తే చాలు, కలెక్షన్లు కోట్లలో ఉంటాయి. సినిమా టాక్‌‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. ఆయన స్థాయి అలాంటిది కాబట్టే పారితోషికం కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆయన నటిస్తున్నారు. దీనితో పాటుగా ఆయన తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో వస్తున్న ‘లాల్ సలాం’ చిత్రంలో కూడా అతిధి పాత్రలో కనిపిస్తారు. 

విశ్వ విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం రజనీకాంత్ వారం రోజులు కాల్‌‌షీట్లను కేటాయించారట. ఈ వారం రోజుల కోసం రజనీకాంత్ భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్టు తెలిసింది. ఈ వారం రోజుల కోసం రజనీకాంత్‌‌కు 25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి లైకా సంస్థ డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. త్వరలోనే లాల్ సలాం సెట్లో రజినీకాంత్ కనిపించబోతున్నారు. ఇదేవిధంగా ‘జైలర్’ మూవీ కోసం కూడా రజనీకాంత్ భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలిసింది. సౌత్ ఇండియా హీరోల్లో చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో రజనీకాంత్ టాప్‌‌లో ఉన్నారని సినీ ఇండస్ట్రీ టాక్.