మళ్ళీ వివాదంలో విజయ్ దేవరకొండ

రజినీకాంత్ అంటే సౌత్ ఇండియాలో  తెలియనివాళ్లు లేరు. విజయ్ దేవరకొండ ఈ మధ్యనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ఎదుగుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య విజయ్ దేవరకొండ రజినీకాంత్ నీ అన్న మాటలు ఫాన్స్ ఎవ్వరికి నచ్చలేదు. మన అర్జున్ రెడ్డి మొన్న జరిగిన “ఖుషి” ప్రమోషనల్ ఈవెంట్లో మన  స్టార్ హీరోలు అందరు ఈ ప్లాప్ సినిమాలని ఎలా తట్టుకుంటారో, తట్టుకుని మళ్ళీ ఎలా నిలబడతారో అందులో ముఖ్యంగా తమిళ్లో సూపర్ స్టార్  రజినీకాంత్, […]

Share:

రజినీకాంత్ అంటే సౌత్ ఇండియాలో  తెలియనివాళ్లు లేరు. విజయ్ దేవరకొండ ఈ మధ్యనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ఎదుగుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య విజయ్ దేవరకొండ రజినీకాంత్ నీ అన్న మాటలు ఫాన్స్ ఎవ్వరికి నచ్చలేదు. మన అర్జున్ రెడ్డి మొన్న జరిగిన “ఖుషి” ప్రమోషనల్ ఈవెంట్లో మన  స్టార్ హీరోలు అందరు ఈ ప్లాప్ సినిమాలని ఎలా తట్టుకుంటారో, తట్టుకుని మళ్ళీ ఎలా నిలబడతారో అందులో ముఖ్యంగా తమిళ్లో సూపర్ స్టార్  రజినీకాంత్, తెలుగులో మెగాస్టార్ట్  చిరంజీవి గురించి మాట్లాడారు. స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఇలా అన్నారు “మన స్టార్స్ హీరోలు అందరు ప్లాప్ సినిమాలని చాల ఈజీగా తీసుకుంటారు. అంతెందుకు రంజినికాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కి వరుసగా 6 ప్లాప్ లు వచ్చినా తట్టుకొని ఒక్క “జైలర్” లాంటి బ్లాక్బస్టర్ సినిమా తీస్తే 500 కోట్ల కలెక్షన్లు సింపుల్గా రావాల్సిందే. మెగా స్టార్ చిరంజీవి గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీనే మార్చేశారు. ఆయన వచ్చాకే డాన్స్, యాక్టింగ్ అంటే ఏంటో తెలిసాయి. ఆయానంతటి మనిషికి కూడా ప్లాప్లు తప్పలేదు, కానీ ఎన్ని ప్లాప్లు వచ్చినా సరైన డైరెక్టర్తో కలిసి ఒక్క సినిమా తెస్తే వచ్చే సంక్రాంతికి ఇంకో బ్లాక్బస్టర్ సినిమాని ఇస్తారు. ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్.”

విజయ్ వాళ్ళని పొగిడినా కూడా  “6 ఫ్లాప్స్” అన్న మాట రజినీకాంత్ అభిమానులకి నచ్చలేదు, అసలు వాళ్ల ప్లాప్ సినిమాల కోసం మాట్లాడాల్సిన అవసరమేంటి అంటున్నారు, ఈ మాటలని చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటున్నారు. అందులో ఒకరు  ఇలా ట్విట్ చేసారు “6 ప్లాప్ సినిమా లు ఎక్కడ ఉన్నాయి దర్బార్, పెద్దన్న యావరేజ్ సినిమాలు”,  ఇంకొకరు “ఇంక చెప్పింది చాలు, మీరు ప్రతీ దాని మీద మీ ఒపీనియన్ చెప్పాల్సిన అవరం లేదు, మీరు చెప్పింది రజినీకాంత్ని పొగుడుతున్నట్లు మాత్రం లేదు” ఇలా నెటిజన్లు విజయ్ దేవరకొండ మీద రియాక్ట్ అవుతున్నారు. 

ప్రతీ సినిమా ఈవెంట్ లోనూ విజయ్ దేవరకొండ ఇలా ఏదో ఒకటి మాట్లాడడం ఆ మాటలకు వివాదాలు వస్తూ ఉండడంతో అతను కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతున్నాడు అని కూడా నెటిజన్లు అంటున్నారు. గత సినిమా లైగర్ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ చిత్రం సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రం ట్రైలర్ సఖి చిత్రాన్ని గుర్తు చేస్తుంది అని పలువురు నేటిజన్లు కామెంట్స్ చేసారు. ఇలాంటి సమయంలో విజయ్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపెలా ఉన్నాయి. సమంత ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోయినా కూడా చాలా కష్టపడి ట్రీట్మెంట్ కొనసాగిస్తూనే ఖుషీ చిత్రంలో నటించింది అని విజయ్ తెలిపాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో రౌడీ బాయ్ గా ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ తన మాటలతో ఏదో ఒక వివాదానికి కారణం అవుతున్నాడు. ఇప్పటికే రజనీ కాంత్ అభిమానులు విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా విజయ్ వారి గురించి ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.