మాల్దీవులలో సెలవులను ఆస్వాదిస్తున్న రజనీకాంత్

రజని అంటే స్వాగ్, రజని అంటే స్టైల్. అయితే అది సినిమాల వరకే. బయట సాదా సీదా జీవితాన్ని జరుపుతారు సూపర్స్టార్. ఆయన తాజా సినిమాలు జైలర్ మరియు లాల్ సలామ్‌తో సహా తన పనిని పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ కొన్ని రోజుల పాటు మాల్దీవ్స్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ, మాల్దీవుల బీచ్ నుండి నటుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింప్లిసిటీ, నమ్రత కి మరో పేరు రజిని. అలా ఎందుకు పేరు […]

Share:

రజని అంటే స్వాగ్, రజని అంటే స్టైల్. అయితే అది సినిమాల వరకే. బయట సాదా సీదా జీవితాన్ని జరుపుతారు సూపర్స్టార్. ఆయన తాజా సినిమాలు జైలర్ మరియు లాల్ సలామ్‌తో సహా తన పనిని పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ కొన్ని రోజుల పాటు మాల్దీవ్స్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ, మాల్దీవుల బీచ్ నుండి నటుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింప్లిసిటీ, నమ్రత కి మరో పేరు రజిని. అలా ఎందుకు పేరు తెచ్చుకున్నారో ఈ ఫోటో నిరూపిస్తోంది.

సినిమాల్లో భోగి – బయట యోగి:

సోత్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అంతర్జాతీయ మార్కెట్లో క్రేజ్ ఉన్నప్పటికీ రజనీకాంత్ చాలా సింపుల్. షూటింగ్ అయ్యాక స్టార్‌డమ్‌ను తనతో వెంట తీసుకోడు, చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు, అది అతని ఆఫ్-స్క్రీన్ వ్యక్తిత్వం. ఆయన తీసిన “బాబా” సినిమాలోనే ఆయన వ్యక్తిత్వం మనకి అర్ధం అవుతుంది. ఆయన వందవ సినిమా కూడా ఆధ్యాత్మిక గురువు రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర. ఆయన అనేక ప్రసంగాల్లో ఆధ్యాత్మికత గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో ఇదే:

ఇప్పుడు మాల్దీవులలో రజనీకాంత్ తన ఆఫ్-స్క్రీన్ లుక్‌లో బీచ్‌లో షికారు చేస్తున్న ఫోటో ఇంటర్నెట్‌లో దద్దరిల్లింది. ఒక సాధారణ క్యాజువల్ టీ-షర్ట్ ధరించి నడుము చుట్టూ ఫ్యానీ బ్యాగ్‌తో కనిపిస్తున్నారు. రజనీకాంత్ మాల్దీవుల్లోని బీచ్‌లో సామాన్యుడిలా షికారు చేస్తున్నారు. గత వారం రజనీకాంత్ మాల్దీవులకు చేరుకున్నారు. భుజానికి అడ్డంగా స్లింగ్ బ్యాగ్‌తో శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం ముందు సూపర్ స్టార్ పోజులిచ్చిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లాల్ సలామ్ పూర్తి:

రజనీకాంత్ తన రాబోయే చిత్రాలైన జైలర్ మరియు లాల్ సలామ్ చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. లాల్ సలామ్ ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన క్రికెట్ ఆధారిత  తమిళ చిత్రం. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవిత, తంబి రామయ్య, సెంథిల్ మరియు తంగదురై సహాయ పాత్రల్లో కనిపించబోతున్నారు. జూలై 16న, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు రజిని. ఈ సినిమాలో మొయిదీన్ భాయ్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం.  గత వారం, ఐశ్వర్య రజినీకాంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో, సెట్స్ నుండి ఫొటోస్, రజనీకాంత్ ప్యాక్-అప్ వార్తలను పంచుకుంది. ఆమె ఫొటోస్కు క్యాప్షన్ ఇచ్చింది, “మీతో సినిమా చేయడం ఒక అద్భుతం మీరు స్వచ్ఛమైన మేజిక్ అప్పా.. #lalsalam moideen bhai #anditsawrap for THE SUPERSTAR.”

జైలర్ విశేషాలు

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ తన రాబోయే చిత్రం జైలర్ విడుదల కోసం కూడా ఎదురుచూస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా తో పోటీ పడబోతోంది ఈ సినిమా. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, తమన్నా భాటియా, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మర్నా మీనన్ మరియు వసంత్ రవి వంటి తారాగణం ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఆగస్ట్ 10న జైలర్ థియేటర్లలో విడుదల కానుంది. జైలర్ సినిమా లో “కావాల” అనే లిరికల్ వీడియో విడుదల అయ్యి చిన్న పిల్లల్ని సైతం ఆకట్టుకుంటోంది. తమిళ తెలుగు భాషల్లో ఈ పాత ఉండటం విశేషం. రెండవ సింగిల్ హుకుమ్ తాజాగా విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్‌ ఇమేజ్ కి తగినట్టుగా ఉంది. హుకుమ్‌ని అనిరుధ్ రవిచందర్ పాడారు, అతను మొత్తం జైలర్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశాడు. ఈ పాట రజనీకాంత్ కెరీర్‌కు మంచి బ్లాక్ బస్టర్ పాత. ఈ రెండు సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుందాం.