Raghava Lawrence: నిద్రలేని రోజులు ఎన్నో అంటున్న లారెన్స్

రాఘవ లారెన్స్(raghava Lawrence) అనగానే తన డాన్స్ ఏ కాకుండా, హారర్ చిత్రాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా కాంచన (kanchana) అతను సినిమా జీవితాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతం జిగర్ధన-2 సినిమా ప్రమోషన్ కి వచ్చిన రాఘవ లారెన్స్(Lawrence), తనకి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయని, భయంకరమైన పీడకలల కారణంగా నిద్ర పట్టక చాలా రోజులు గడిపానని చెప్పుకొచ్చాడు.  నిద్రలేని రోజులు ఎన్నో:  వరుస సినిమాలతో బిజీగా ఉన్న లారెన్స్(Lawrence) ప్రమోషన్ కోసం హైదరాబాద్ […]

Share:

రాఘవ లారెన్స్(raghava Lawrence) అనగానే తన డాన్స్ ఏ కాకుండా, హారర్ చిత్రాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా కాంచన (kanchana) అతను సినిమా జీవితాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతం జిగర్ధన-2 సినిమా ప్రమోషన్ కి వచ్చిన రాఘవ లారెన్స్(Lawrence), తనకి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయని, భయంకరమైన పీడకలల కారణంగా నిద్ర పట్టక చాలా రోజులు గడిపానని చెప్పుకొచ్చాడు. 

నిద్రలేని రోజులు ఎన్నో: 

వరుస సినిమాలతో బిజీగా ఉన్న లారెన్స్(Lawrence) ప్రమోషన్ కోసం హైదరాబాద్ రాగా, ఇటీవల తను చాలా నిద్రలేని రోజులు గడిపానని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా హారర్ సినిమాలు తీసే వారికి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అనేది తప్పకుండా ఉండాలి అని, నిజానికి హారర్ సినిమా తీయడం నిజానికి ఆషామాషీ కాదని, తనని తాను అద్దంలో చూసుకుని కాంచన(kanchana) గా మారాలి అని చాలా సార్లు తనతో తానే మాట్లాడుకుంటున్నప్పుడు, తన తల్లి తనని ఎప్పుడు ఆటపట్టించేవారని, తనని చూసి చిన్న పిల్లలు కూడా జడుసుకున్న రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు లారెన్స్(Lawrence). అయితే తప్పకుండా కాంచన (kanchana)-4తో మళ్లీ ప్రేక్షకులకు ముందుకు వస్తానని మాట ఇచ్చాడు లారెన్స్(Lawrence). 

చంద్రముఖి 2: 

ఇటీవల రిలీజ్ అయిన చంద్రముఖి పార్ట్ 2 ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేనట్లే కనిపిస్తోంది. అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. చంద్రముఖి సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైనప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల వాయిదా పడి, సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. అయితే బాలీవుడ్ తార కంగనా చంద్రముఖి 2 లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది. చంద్రముఖి 1 సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ లో ఇమిడిపోయేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు చేసిందని చెప్పుకొచ్చింది. 

చంద్రముఖి సినిమా (cinema) సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. ఒకప్పుడు చంద్రముఖి సినిమా చూసేందుకు సినీ ప్రేక్షకులు బారులు తీరారు. చంద్రముఖి క్యారెక్టర్ లో నటించిన జ్యోతిక, రాజు గారి పాత్రలో నటించిన రజనీకాంత్ వంటి సినీ తారలు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. అటువంటి చిత్రానికి ఇప్పుడు సీక్వెల్లో రాజు పాత్ర లో లారెన్స్(Lawrence) లుక్, రాణి పాత్రలో కంగనా చాలా బాగా నటించారని చెప్పుకోవచ్చు. 

బాలీవుడ్ నటి కంగనా, చంద్రముఖి (Chandramukhi) 2 లో చంద్రముఖిగా ప్రేక్షకుల అభిమానులను కనువిందు చేసింది. నిజానికి కొన్ని చిత్ర పాత్రలు ప్రత్యేకించి చాలామంది మదిలో నిలిచిపోతాయి. అదే విధంగా కంగానాకు జ్యోతిక క్యారెక్టర్ చంద్రముఖి(Chandramukhi) పాత్ర కోసం మాట్లాడినప్పుడు, తాను కొద్దిసేపు ఆలోచించానని చెప్పుకొచ్చింది నటి. అయితే డైరెక్టర్ పి వాసు కారణంగా తను జ్యోతిక ప్లేస్ లో చంద్రముఖి క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డైరెక్టర్ ద్వారా తన క్యారెక్టర్ లో నటించేందుకు చాలా బాగా సహాయపడిందని, తన ప్లేస్ లో ఇంకెవరైనా సరే అదే ఫీల్ అవుతారని మాట్లాడింది కంగనా. 

సినిమా (cinema) రిలీజ్ కి ముందు ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా, తాను చంద్రముఖి సినిమాను రెండుసార్లు చూశానని, ప్రత్యేకించి అందులో క్యారెక్టర్స్ లో ఇమిడేందుకు తనకి సహాయం చేసింది ఆ సినిమా అంటూ చెప్పింది. అదే విధంగా ఇప్పుడు చంద్రముఖి(Chandramukhi) సీక్వెల్ చంద్రముఖి 2 కూడా అదిరిపోయే హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ పరంగా అదిరిపోతుందని హామీ కూడా ఇచ్చింది. అనుకున్నట్లుగానే కామెడీ, యాక్షన్ పరంగా అలరించినప్పటికీ, మునుపు చంద్రముఖిలో జ్యోతిక, సూపర్ స్టార్ రజినీకాంత్ నటనను అందుకోలేకపోయారని అభిమానులు అభిప్రాయపడ్డారు.