ఇన్స్టా లో ఫోటో షేర్ చేసిన యష్ భార్య

కె.జి.ఎఫ్ హీరో యష్ కు కన్నడ నాట మాత్రమే దేస్వ్యప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన కె.జి.ఎఫ్ 1 మరియు 2 చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అప్పటి వరకూ చిన్న హీరోగా ఉన్న యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కు కూడా మంచి పేరు వచ్చింది. ఇక కె.జి.ఎఫ్ 2 సినిమా తరవాత యష్ అభిమానులకు పెద్దగా కనిపించింది లేదు. ఆయన తదుపరి చిత్రాల గురించి కూడా […]

Share:

కె.జి.ఎఫ్ హీరో యష్ కు కన్నడ నాట మాత్రమే దేస్వ్యప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన కె.జి.ఎఫ్ 1 మరియు 2 చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అప్పటి వరకూ చిన్న హీరోగా ఉన్న యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కు కూడా మంచి పేరు వచ్చింది. ఇక కె.జి.ఎఫ్ 2 సినిమా తరవాత యష్ అభిమానులకు పెద్దగా కనిపించింది లేదు. ఆయన తదుపరి చిత్రాల గురించి కూడా పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. అయితే యష్ భార్య రాధిక పండిట్ ఇటీవల ఇన్స్టాగ్రాం ద్వారా ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో యష్, రాధిక పండిట్ తమ కూతురు తో కలిసి బీచ్ లో ఉన్నారు. వారి కూతురు ఐరా యష్ భుజాల మీద కూర్చుని ఉండగా రాధిక పండిట్, ఐరా ను ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.  బీచ్ లో సమయం గడుపుతూ తీసుకున్న ఈ ఫోటో నెటిజన్లకు భలే నచ్చేసింది. ఈ ఫోటోకు లైకుల మీద లైకులు కొట్టడమే కాకుండా బావుంది అని కామెంట్లు కూడా చేస్తున్నారు. 

కామెంట్లు అన్నీ ఆ విషయం గురించే 

కె.జి.ఎఫ్ 2 సూపర్ హిట్ తర్వాత యష్ ఏ చిత్రంలో నటిస్తున్నాడు అని అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. దాంతో ఈ ఫోటో కింద అతని అభిమానులు అందరూ యష్ 19 అప్డేట్స్ ఎప్పుడూ అంటూ కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు. “యష్ 19 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాము”, “ఈరోజు ఇంటర్నెట్ లో నా ఫేవరెట్ ఫోటో ఇది”, “మంచి జ్ఞాపకాలు రూపొందించుకుంటున్నారు” అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. రాధిక పండిట్ కూడా కన్నడ లో గుర్తింపు పొందిన యాక్టర్. అయితే గత కొంత కాలంగా ఆమె నటనకు దూరంగా ఉన్నారు. 2019 లో ఆమె చివరిగా ఆది లక్ష్మీ పూర్ణ అనే చిత్రంలో నటించారు. 

యష్ నటించిన కె.జి.ఎఫ్ 2 చిత్రం 2022 లో విడుదల ఆయినా కూడా తర్వాత ఇప్పటి వరకూ అతను ఏ చిత్రంలో నటిస్తూ ఉన్నారో లేక గ్యాప్ తీసుకుంటూ ఉన్నారో అని అభిమానులకు తెలియడం లేదు. అందుకే రాధిక పండిట్ పెట్టిన ఇన్స్టా ఫోటో కింద కూడా సినిమా అప్డేట్ గురించే కామెంట్లు ఉన్నాయి. రాధిక పండిట్ ప్రస్తుతం సినిమాల్లో నటించక పోయినా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కుటుంబ చిత్రాలను పంచుకుంటూ ఉంటారు. 

వైరల్ అవుతున్న యష్ ఫోటోలు

కె.జి.ఎఫ్ 2 తర్వాత యష్ ఏ చిత్రంలో నటిస్తున్నది ఎవరికీ తెలియదు. అయితే అతను నటిస్తున్న కొత్త చిత్రం నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శ్రీలంక లో జరుగుతూ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అవి కె.జి.ఎఫ్ షూటింగ్ లో తీసిన ఫోటోలు అని కొంతమంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఫోటోలు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా యష్ 19 చిత్రం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు.

కేజీఎఫ్ 2 త‌ర్వాత య‌ష్ నుంచి ఒక్క సినిమా అప్‌డేట్ కూడా లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతున్నారు. వాళ్లు వెకేష‌న్‌కు వెళ్లి పిక్స్ పోస్ట్ చేస్తుంటే సినిమాలు మానేసి ఎంజాయ్ చేస్తున్నావా అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వ‌ర‌లో స్వ‌యంగా య‌ష్ త‌న కొత్త సినిమా గురించి అనౌన్స్ చేస్తార‌ని క‌న్న‌డ వ‌ర్గాలు అంటున్నాయి. అదెప్పుడు అనేది తెలీక ఫ్యాన్స్ త‌ల‌బాదుకుంటున్నారు.