పుష్ప 2 క్రేజీ అప్ డేట్

పుష్ప… ఇప్పుడు ఇది ఒక సినిమా పేరు కాదు, బ్రాండ్… పుష్పరాజ్ ఇది ఒక క్యారెక్టర్ కాదు, చాలా మందికి ఎమోషన్  ‘తగ్గేదే లే’ అనేది ఎంతో మందికి ఊత పదంగా మారింది.టాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో  పుష్ప 2′ కూడా ఒకటి..  అర్జున్‌, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది.    2021లో […]

Share:

పుష్ప… ఇప్పుడు ఇది ఒక సినిమా పేరు కాదు, బ్రాండ్… పుష్పరాజ్ ఇది ఒక క్యారెక్టర్ కాదు, చాలా మందికి ఎమోషన్  ‘తగ్గేదే లే’ అనేది ఎంతో మందికి ఊత పదంగా మారింది.టాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో  పుష్ప 2′ కూడా ఒకటి..  అర్జున్‌, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది.   

2021లో విడుదలైన ‘పుష్ప 1: ది రైజ్’ సినిమా బంపర్ హిట్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇతర భాషల్లోనూ అదరగొట్టింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దర్శకుడు సుకుమార్ టేకింగ్, సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ మెప్పించింది. పుష్ప మూవీ ఫీవర్ సాధారణ ప్రేక్షకులకే కాకుండా సెలెబ్రిటీలకు కూడా పట్టింది. అల్లు అర్జున్ యాక్టింగ్, మాస్ మేనరిజమ్స్ అందరికీ తెగ నచ్చేశాయి. దీంతో పుష్ప 1కు సీక్వెల్‍గా రూపొందుతున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

పుష్ప టీమ్ మేలుకోవాలి అంటూ హాష్ టాగ్… 

పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు సుకుమార్. షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నా కూడా.. మీ ఎదురు చూపులకు సమాధానం నేనే సినిమాతో ఇస్తానంటూ ఊరిస్తున్నారు తప్ప అప్డేట్ లు ఇవ్వడం లేదు .

అందుకే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. వేలాది మంది పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ మళ్లీ ట్రెండింగ్‍లోకి వచ్చింది. పుష్ప 2: ది రూల్ అప్‍డేట్స్ కావాల్సిందేనని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇతర చాలా సినిమాల అప్‍డేట్స్ వస్తూనే ఉన్నాయని, కానీ పుష్ప టీమ్ నుంచి ఏం రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను హ్యాష్‍ట్యాగ్‍లను కూడా జోడించి కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. కొందరు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్ లో 

ఈ సినిమా నుంచి చాలా రోజులగా ఎటువంటి అప్ డేట్ లేదు. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది. పుష్ప.. ది రూల్ షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో మెుదలుకానుందట. అల్లు అర్జున్‌తోపాటు కీలక నటీనటులపై వచ్చే సీన్స్ ను ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీక్వెల్ లో  ఫహద్‌ ఫాసిల్‌ మెయిన్‌ విలన్‌గా కనిపించబోతున్నాడని సమాచారం.

రెండో పార్టులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్‌-ఫహద్ ఫాసిల్‌ మధ్య వచ్చే నాలుగు యాక్షన్‌ సన్నివేశాలు, జగపతిబాబుతో వచ్చే ఒక యాక్షన్‌ సీన్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది .  ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను హాలీవుడ్‌కు చెందిన టీం పర్యవేక్షణలో షూట్ చేయబోతున్నారట. పుష్ప 2 కు రాక్ స్టార్ దేవిశీప్రసాద్ సంగీతం అందించనున్నారు. 

అల్లు అర్జున్ హీరో గా  రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక పుష్ప ది రూల్‌ కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అవుతున్నట్టు రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో సంచనాలను సృష్టించిన ఐకాన్ స్టార్.. రెండో పార్టుతో ఎలాంటి రికార్డ్సు క్రియేట్  చేస్తారో చూడాలి.