వామ్మో పూరీ అంత డిమాండ్ చేస్తున్నాడా

పూరీ జగన్నాథ్ ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. మనోడికి హిట్ పడ్డా కానీ ప్లాప్ పడ్డా కానీ క్రేజ్ మాత్రం తగ్గదు. దానికి నిదర్శనమే ఈ విషయం. సాధారణంగా సినీ ఇండస్ర్టీ మొత్తం జయాపజయాల మీద డిసైడ్ అవుతూ ఉంటుంది. విజయం దక్కిన వారు స్టార్లుగా వెలిగిపోతుంటే అపజయం వచ్చిన వారు ఫేడ్ అవుట్ అయిపోతు ఉంటారు. ఎంతో మంది స్టార్ల విషయంలో ఇలాగే జరిగింది. కానీ ఇది ఏస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విషయంలో […]

Share:

పూరీ జగన్నాథ్ ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. మనోడికి హిట్ పడ్డా కానీ ప్లాప్ పడ్డా కానీ క్రేజ్ మాత్రం తగ్గదు. దానికి నిదర్శనమే ఈ విషయం. సాధారణంగా సినీ ఇండస్ర్టీ మొత్తం జయాపజయాల మీద డిసైడ్ అవుతూ ఉంటుంది. విజయం దక్కిన వారు స్టార్లుగా వెలిగిపోతుంటే అపజయం వచ్చిన వారు ఫేడ్ అవుట్ అయిపోతు ఉంటారు. ఎంతో మంది స్టార్ల విషయంలో ఇలాగే జరిగింది. కానీ ఇది ఏస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విషయంలో మాత్రం వేరేలా జరుగుతోంది. ఎవరైనా సరే చివరి సినిమా ప్లాప్ ఇచ్చిన తర్వాత మరో సినిమా చేస్తున్నాడంటే డిస్ట్రిబ్యూటర్లు ఆ మూవీ మీద పెద్దగా ఆసక్తి చూపెట్టరు. ఈ నిబంధనకు సూపర్ స్టార్లు, మెగా స్టార్లు కూడా అతీతం కాదు. కానీ ఏ స్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం ఈ రూల్స్ నాకు వర్తించవని అంటున్నాడు. మనోడి చివరి మూవీ లైగర్ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇటు సౌత్ బెల్ట్ ప్రేక్షకులను అటు నార్త్ బెల్ట్ ప్రేక్షకులను కానీ ఎవర్నీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ మూవీని కొన్ని డిస్ట్రిబ్యూటర్ల, బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. కానీ మనోడు నెక్ట్స్ చేస్తున్న సినిమాకు మాత్రం విపరీతమైన క్రేజ్ నెలకొంది. సాధారణంగా ప్లాప్ మూవీ తర్వాత వచ్చే మూవీకి డిమాండ్ ఉండదు కానీ పూరీ విషయంలో మాత్రం తన తదుపరి మూవీకి భారీ క్రేజ్ ఏర్పడింది. 

కారణం అదేనా… 

విజయ్ దేవరకొండతో తీసిన పాన్ ఇండియా మూవీ లైగర్ ప్లాప్ అయిన తర్వాత పూరీ జగన్నాథ్ తన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ను అనౌన్స్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో అప్పటి ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ నే మళ్లీ హీరోగా కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీ కూడా ఎక్కడ లేని బజ్ ఏర్పాటు చేసుకుంది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొందట. అయితే దానిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న నిర్మాత చార్మి వారి నుంచి ఫ్యాన్సీ రేట్లను డిమాండ్ చేసినట్లు సమాచారం అందుతోంది. డబుల్ ఇస్మార్ట్ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఈ మూవీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి దాదాపు రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్. ఇక మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రామ్ లోని మరో యాంగిల్ ను ఈ మూవీ పరిచయం చేసింది. దీంతోనే ఈ మూవీ సీక్వెల్ రైట్స్ ను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు తెగ ఆరాటపడుతున్నారట. 

ఆ బాలీవుడ్ నటుడు

ఇది పర్ఫెక్ట్ పక్కా యాక్షన్ ఫిల్మ్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పార్ట్ -1ను ప్లాన్ చేసిన దానికంటే దర్శకుడు దీనిని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక యాక్షన్ సీన్స్ కూడా నెక్ట్స్ లెవల్ లో ఉండబోతున్నాయని సమాచారం. అందుకోసమే ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కు అంత భారీ మొత్తంలో వెచ్చించేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు వెనుకడుగు వేయడం లేదని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతోనే బాలీవుడ్ బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంతలా ఈ మూవీని కొనేందుకు ముందుకు వస్తున్నారట. వాస్తవం చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ మూవీ సమయంలో డబ్బింగ్ రైట్స్ కు కేవలం రూ. 7 కోట్లు మాత్రమే వచ్చాయి. కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో మాత్రం ఈ లెక్క డబుల్ లేదా త్రిబుల్ అయ్యేలా కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. 

వారికి అలా… 

నాని నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ దసరా. ఈ మూవీ తెలుగు నాట వంద కోట్ల క్లబ్ లో చేరి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కానీ బాలీవుడ్ లో మాత్రం పెద్దగా ఆడలేదు. ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ దాస్ కా ధమ్కీ కూడా తెలుగులో ఫుల్ హిట్ అయింది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ బాలీవుడ్ లో మాత్రం దారుణంగా ఫెయిలయింది. అన్ని రకాల యాక్షన్ సినిమాలు పక్కాగా ఆడతాయని మనం చెప్పలేం. ప్రేక్షకులకు కనెక్ట్ అయిన మూవీనే ఆడుతుంది. వేరే మూవీల్లో ఎంత పెద్ద స్టార్లు ఉన్నా ఎంత క్రూ ఉన్నా కానీ అవి అంతగా జనాలను ఆకట్టుకోలేవు. ఈ రెండు చిత్రాల దెబ్బకు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తామని చెప్పిన కొన్ని సినిమాలను అసలు హిందీలో రిలీజ్ చేసేందుకే నిర్మాతలు సాహసం చేయలేదు. అటువంటిది పూరీ జగన్నాథ్ మూవీకి హిందీ నాట ఇంత క్రేజ్ ఏర్పడడం విశేషం.