ప్రాజెక్ట్-కె సినిమా విడుదల తేదీ ప్రకటన – ఫ్యాన్స్‌కి ఇక పండగే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎన్నో క్రేజీ మూవీలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆది పురుష్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. ప్రాజెక్ట్-కె సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎన్నో క్రేజీ మూవీలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆది పురుష్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. […]

Share:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎన్నో క్రేజీ మూవీలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆది పురుష్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. ప్రాజెక్ట్-కె సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎన్నో క్రేజీ మూవీలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆది పురుష్ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘సలార్’ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రభాస్ ఫ్యాన్స్‌ పండగ చేసుకొనేలా ముస్తాబవుతోంది. అలాగే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహా నటి’  సినిమాల దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ కె భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఈ మూవీ కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికి రెండేళ్ళు అవుతోంది. అయినప్పటికీ, ఈ మూవీ కథ ఏమిటి? కథనం ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ నాగ్ అశ్విన్ సన్నద్ధతను చూస్తుంటే ఈ సినిమా భారీ రేంజ్​లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.  

ఈ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం ప్రభాస్ అభిమానులకు శుభవార్త అందించింది. మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రాజెక్ట్-కె స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసి, దానితోపాటే విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్టు తెలిపారు. 

ఈ సినిమా పోస్టర్‌ ఎలా ఉందంటే ఓ పెద్ద చేయి నేలపై ఉన్నట్టు, ముగ్గురు మనుషులు దాన్ని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది. ఇంకా చుట్టూ పెద్ద పెద్ద మిషన్లు, కూలుతున్న అపార్ట్‌మెంట్లు.. ఇలా ఈ పోస్టర్ జనాల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. పోస్టర్ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ఇది భవిష్యత్తుకు సంబంధించిన సెటప్‌లా కనిపిస్తోంది. అంటే దాదాపుగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ కావచ్చనే హింట్ ఇస్తున్నట్టుగా అనిపించింది. 

ఇప్పటి వరకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నాడనే దానిలో సందేహం లేదు. ‘రీఇన్‌వెంటింగ్‌ ద వీల్‌’ పేరుతో విడుదల చేసిన వీడియోకు విశేష స్పందన లభించింది. ఈ పోస్టర్ విడుదల, రిలీజ్ డేట్ అనౌన్స్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక నాగ్​ అశ్విన్ ఇంతకు ముందు తీసిన సావిత్రి సినిమా కూడా అంచనాలకు మించి ఆడడంతో ఈ సినిమా కూడా పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు చాలా మంది వివిధ ఇండస్ట్రీ ప్రముఖులు వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో ఉన్న స్టార్ క్యాస్ట్ జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ తెలిపారు. 

ఈ సినిమా హిట్ అయితే ప్రభాస్‌కి కొంత ఊరట లభిస్తుందనే చెప్పుకోవాలి. అసలే కొన్ని రోజుల నుంచి తమ హీరో నుంచి సరైన హిట్ లేదని బాధపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్​ పండుగ చేసుకుంటారు. అనౌన్స్​మెంట్​తో ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇక ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో… చూడాలి.