ప్రియాంక చోప్రా తన కూతురితో మొదటి ఈస్టర్ జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన అందం, అభినయంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌ని, హాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తోంది. ఈ అమ్మడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రొఫెషనల్ కొరియర్ లో కూడా హాలీవుడ్ వ్యక్తినే భాగస్వామిగా చేసుకుంది ప్రియాంక అమెరికన్ సింగర్, నటుడు నిక్‌ జోన్స్‌ని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియాంక చోప్రా తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన నిక్‌ జోన్స్‌ ను పెళ్లి చేసుకున్న […]

Share:

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన అందం, అభినయంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్‌ని, హాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తోంది. ఈ అమ్మడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రొఫెషనల్ కొరియర్ లో కూడా హాలీవుడ్ వ్యక్తినే భాగస్వామిగా చేసుకుంది ప్రియాంక అమెరికన్ సింగర్, నటుడు నిక్‌ జోన్స్‌ని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియాంక చోప్రా తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన నిక్‌ జోన్స్‌ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన భర్త నిక్‌ జోన్స్‌తో కలిసి అమెరికాలో నివసిస్తోంది. నిక్‌ జోన్స్‌‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా వయసు రీత్యా గర్భం దాల్చడం దాదాపు ఆసాధ్యమని డాక్టర్లు చెప్పడంతో సరోగసీ ద్వారా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఇటీవల ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టీ మేరీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలు గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. మొదటిసారిగా తన కూతుర్ని పరిచయం చేసింది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక తన సినిమాలు వ్యక్తిగత విషయాలను తరచు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. కాగా తన కూతురుతో కలిసి మొదటి ఈస్టర్‌ను జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియాంక చోప్రా. 

ప్రియాంక చోప్రా “మాల్టీ మేరీస్ ఫస్ట్ ఈస్టర్” అనే టాగ్ కనిపించే విధంగా ఒక టీ షర్ట్ వేసి తన కూతురితో కలిసి దిగిన ఫోటోలు పంచుకుంది. ముద్దులొలిగే ఆ చిన్నారి చేతిలో చాక్లెట్ కూడా ఉంది. ఇక ఆ తరువాత తల్లీకూతుళ్ళు పీచ్ కలర్ డ్రెస్ వేసుకొని ఓ సెల్ఫీకి ఫోజ్ ఇచ్చారు. తన కూతురితో ఆడుకుంటున్న మరికొన్ని ఫోటోలను ప్రియాంక చోప్రా ఇందులో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా ఈ ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ ఈస్టర్, హ్యాపీ సండే అని షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు బ్యూటీ ప్రియాంక చోప్రా అంటూ క్యూటీ మల్టీ, హ్యాపీ ఈస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రియాంక సినిమాలతోనే కాదు సామాజిక కార్యక్రమాలలోనూ ఎంతో మంది ప్రశంసలను అందిపుచ్చుకుంది. కౌమార దశలోని ఆడపిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యంపై సలహాలు ఇచ్చే బాధ్యతను భుజం పైకి ఎత్తుకుంది. అభిమానుల్ని సంపాదించుకోవడంలోనూ ప్రియాంకదే రికార్డు. ప్రియాంకకి ఇన్స్టాలో కోట్లాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రియాంకలో ఓ రచయిత్రి ఉందని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. హిందుస్తాన్ టైమ్స్ పత్రికలో ప్రియాంక కొన్ని వ్యాసాలు రాసింది. వాటితో తనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ వ్యాసాలన్నీ అన్ ఫినిష్డ్ అనే పేరుతో 2019లో రాసింది. ది న్యూయార్క్ టైమ్స్, బెస్ట్ సెల్లర్స్ లిస్టులో ఈ పుస్తకం మంచి స్థానం సంపాదించుకుంది. ప్రియాంక తన పేరుతో ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు విద్య, ఆరోగ్యం, ఆహారం అందించడానికి ఈ ఫౌండేషన్ చేయూతనిస్తుంది. తన ఆదాయంలో పది శాతం ఈ సంస్థకు కేటాయిస్తోంది.  2010లో యూనిసెఫ్ తమ అంబాసిడర్‌గా ప్రియాంకను నియమించింది.