కౌన్ బనేగా కరోడ్‌పతిలో ‘SRK నాకు రూ. 200 ఇచ్చారు’: ప్రియమణి

షారూఖ్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఒక పాట గురించి మాట్లాడుతూ నటి ప్రియమణి ఓపెన్ అయ్యింది. తాను బెంగుళూరులో ఉన్నప్పుడు రోహిత్ శెట్టి ఆఫీసు నుండి అనుకోని ఫోన్ కాల్ వచ్చిందని ప్రియమణి చెప్పింది. ప్రారంభంలో, ఆమె అది బ్రాండ్ కాల్ అనుకుంది, ఒకసారి కాల్ గురించి తెలుసుకోమని మేనేజర్ కి చెప్పడం కూడా జరిగింది. మేనేజర్ ద్వారా ఆ కాల్ గురించి తెలుసుకున్న తర్వాత, అది ఫేక్ కాల్ కాదని తెలుసుకుని ఆమె షాక్ అయ్యింది. […]

Share:

షారూఖ్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఒక పాట గురించి మాట్లాడుతూ నటి ప్రియమణి ఓపెన్ అయ్యింది. తాను బెంగుళూరులో ఉన్నప్పుడు రోహిత్ శెట్టి ఆఫీసు నుండి అనుకోని ఫోన్ కాల్ వచ్చిందని ప్రియమణి చెప్పింది. ప్రారంభంలో, ఆమె అది బ్రాండ్ కాల్ అనుకుంది, ఒకసారి కాల్ గురించి తెలుసుకోమని మేనేజర్ కి చెప్పడం కూడా జరిగింది.

మేనేజర్ ద్వారా ఆ కాల్ గురించి తెలుసుకున్న తర్వాత, అది ఫేక్ కాల్ కాదని తెలుసుకుని ఆమె షాక్ అయ్యింది. అది చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలోని ఒక పాట కోసం అని తెలుసుకున్నప్పుడు ఆమెలో ఎక్సైట్ మెంట్ పెరిగిందని చెప్పింది, ఆ కాల్ చేసింది షారుఖ్ ఖాన్ మరెవరూ కాదు. SRKని కలుసుకునే అవకాశం మరియు జీవితకాల కలను నెరవేర్చుకునే అవకాశంతో పొంగిపోయి, ఆమె హడావిడిగా మీటింగ్ కోసం ముంబైకి వెళ్లింది. రోహిత్ కార్యాలయంలో, ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు మరియు దర్శకుడు పాట వివరాలను వివరించారు. ప్రియమణి “వన్ టూ త్రీ ఫోర్” పాటలో కనిపించింది, షారూఖ్‌తో కలిసి గుల్టేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి ఇలా అన్నారు, “అతను (షారూఖ్ ఖాన్) చాలా స్వీట్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నా ఉద్దేశ్యం, అతను నిజంగా ఒక సాధారణ అద్భుతమైన వ్యక్తి. కాబట్టి, అతను ఒక సమయంలో నన్ను కలవడానికి వచ్చారు ఎందుకంటే చిన్న చిన్న మార్పులు గురించి చెప్పారు దానికి నేను కూడా ఒప్పుకున్నాను. కానీ తర్వాత , ‘వద్దు వద్దు డార్లింగ్, నువ్వు వెళ్లి కూర్చో, నేను చేస్తాను’ అన్నారు, ‘వద్దు సార్, నేను ఓకే. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కాబట్టి మీరు నన్ను ఎన్నిసార్లు డ్యాన్స్ చేయాలనుకున్నా నేను పట్టించుకోను. నేను డ్యాన్స్ చేయగలను, ఎటువంటి సమస్యలు లేవు.’ అంటూ నేను కూడా అతనితో చాలా బాగా మాట్లాడాను. నిజంగా షూటింగ్ జరిగిన ఐదు రోజులు చాలా బాగా గడిచాయి

వారు సెట్స్‌లో ఎలా సరదాగా గడిపారు అనే దాని గురించి నటి ప్రియమణి మాట్లాడుతూ, “మేము కూర్చుని కబుర్లు చెప్పుకోలేదు, కానీ మేము అతని ఐప్యాడ్‌లో కౌన్ బనేగా కరోడ్‌పతిని ప్లే చేసాము. అతను నాకు రూ. 200 ఇచ్చాడు. నా సమాధానాలు సరిగ్గా ఉన్నందున నేను రూ. 200 గెలుచుకున్నాను.

ప్రియమణి కూడా SRK కృషి మరియు అంకితభావాన్ని ప్రశంసించింది. “ మనం ఉదయం రెండు గంటలకు లేదా ఉదయం ఆరు గంటలకు పని ముగించిన తర్వాత, త్వరగా తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని నిద్రపోవాలని అనుకుంటాం కదా. కానీ ఈ వ్యక్తి, షూటింగ్ తర్వాత, ప్యాక్ అప్ తర్వాత కూడా తను ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇష్టపడతారు. 

ప్రియమణి తదుపరి షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం జవాన్‌లో కనిపించనుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార మరియు విజయ్ సేతుపతి కూడా నటించారు. 

ప్రియమణి నటించిన కొన్ని సినిమాలు: 

యమదొంగ, చెన్నై ఎక్స్ప్రెస్, చారులత, భామాకలాపం, డాక్టర్ 56.