జవాన్ లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన ప్రియమణి

ప్రియమణి ప్రస్తుతం జవాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. జవాన్ సినిమాలో తను లక్ష్మీ అనే పాత్రను పోషించారు. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. జవాన్ సినిమా గురించి ముచ్చటించిన ప్రియమణి జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ గ్యాంగ్ లో ఉండే లక్ష్మీ అనే పాత్రలో ప్రియమణి నటించారు. తన నటనతో ఈ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లారు. కేవలం అట్లీ వల్లనే ఈ సినిమా నటించానని ప్రియమణి తెలిపారు. జూమ్ మీటింగ్లో ఈ […]

Share:

ప్రియమణి ప్రస్తుతం జవాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. జవాన్ సినిమాలో తను లక్ష్మీ అనే పాత్రను పోషించారు. ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

జవాన్ సినిమా గురించి ముచ్చటించిన ప్రియమణి

జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ గ్యాంగ్ లో ఉండే లక్ష్మీ అనే పాత్రలో ప్రియమణి నటించారు. తన నటనతో ఈ సినిమాను మరో రేంజ్ కి తీసుకెళ్లారు. కేవలం అట్లీ వల్లనే ఈ సినిమా నటించానని ప్రియమణి తెలిపారు. జూమ్ మీటింగ్లో ఈ సినిమా గురించి రెండు గంటలు డిస్కస్ చేశాక తాను ఈ సినిమాకు ఓకే చెప్పానని చెప్పారు. తను చెప్పిన విధానం నాకు నచ్చి ఈ సినిమాను ఓకే చేశానని ప్రియమణి చెప్పారు.

జవాన్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఇంత విజయం సాధిస్తుందని నేను అనుకోలేదు. కానీ ఇందులో భాగమైనందుకు ఆనందంగా ఉందని ప్రియమణి తెలిపారు. జవాన్ సినిమాలో దీపికా పదుకొనే, నయనతార, సాన్యా మల్హోత్రా,రిదీ దోగ్రా కూడా నటించారు. ఈ సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉందని రిదీ దోగ్రా ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని తెలియజేశారు. రిదీ షారుక్ ఖాన్ తన ఫేవరెట్ యాక్టర్ అని తెలియజేసింది.

బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతున్న జవాన్

అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం జవాన్. ఈ సినిమాలో నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 1000 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదని ప్రియమణి తెలిపారు. జవాన్ సినిమాకు మిక్స్డ్ టాక్స్ వచ్చినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడుగా కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఈ సినిమాకు 900 కోట్లు వచ్చాయంటేనే ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థమవుతుంది. ఈ సినిమాలో నయనతార కూడా నటించారు.

ప్రియమణి సినీ కెరీర్

కెరీర్ ప్రారంభంలో ప్రియమణికి అంతగా కలిసి రాలేదు. ఎవరే అతగాడు అనే సినిమాతో ప్రియమణి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తర్వాత చాలా కాలం వరకు ఆమెకు సరైన సినిమా అవకాశాలే రాలేదు. కాస్త గ్యాప్ తీసుకున్నాక పెళ్లైన కొత్తలో అనే సినిమాతో ప్రియమణి కి రావల్సిన బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో జగపతిబాబు హీరో. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత టాలీవుడ్ లో ప్రియమణి హవా మొదలైంది. ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రియమణికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత కూడా నాగార్జునతో రగడ, రవితేజతో శంభో శివ శంభో లాంటి సినిమాల్లో నటించింది. తర్వాత కూడా ప్రియమణి చాలా సినిమాలలో నటించింది. జగపతిబాబుతో ప్రవరాఖ్యుడు సినిమాలో నటించింది. సుమంత్ తో రాజ్ అనే సినిమాలో నటించింది. కెరీర్ సజావుగా సాగుతున్న టైంలోనే పెళ్లి చేసుకొని సినీ కెరీర్  కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. ప్రియమణి రాబోయే రోజుల్లో మంచి మంచి చిత్రాల్లో నటించాలని కోరుకుందాం.