Salaar: సలార్ నుంచి అదిరిన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్..

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న సలార్(Salaar) సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) బర్త్‌డే కావడంతో సలార్ టీమ్ ఒక కొత్త పోస్టర్‌(Poster)ను రిలీజ్ చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)కి బాహుబలి-2 తర్వాత సరైన హిట్ పడలేదు. తర్వాత వచ్చిన సినిమాలన్నీ ప్రభాస్‌కి నిరాశే మిగిల్చాయి. దీంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకే […]

Share:

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న సలార్(Salaar) సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) బర్త్‌డే కావడంతో సలార్ టీమ్ ఒక కొత్త పోస్టర్‌(Poster)ను రిలీజ్ చేసింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)కి బాహుబలి-2 తర్వాత సరైన హిట్ పడలేదు. తర్వాత వచ్చిన సినిమాలన్నీ ప్రభాస్‌కి నిరాశే మిగిల్చాయి. దీంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న సలార్(Salaar) గురించి అంతలా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇందులో విలన్‌గా నటిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు కావడంతో ఈరోజు కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

ఈ పోస్టర్‌లో పృథ్వీరాజ్(Prithviraj) చాలా గంభీరంగా, పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. నుదుటిన తిలకం, మెడలో ఒక టవల్ వేసుకుని నడుస్తున్న లుక్ ఇది. అయితే పృథ్వీరాజ్ వెనకాల తన బలగం కూడా అంతే భయంకరంగా ఉన్నారు. ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘వరదరాజ మన్నార్’.. ది కింగ్ పృథ్వీరాజ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ పెట్టింది హొంబలె ఫిల్మ్స్(Hombale Films). ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ పృథ్వీరాజ్‌కి విషెస్ చెబుతున్నారు. థియేటర్లో ప్రభాస్- పృథ్వీరాజ్ మధ్య యాక్షన్ సీన్లు చూసేందుకు వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ ఫిజికల్‌గా కూడా కండల వీరులు కావడంతో వీరి మధ్య ఫైట్స్ అద్భుతంగా ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సలార్ పార్ట్ 1లో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందని ఇప్పటికే చాలా లీకులు వచ్చాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఫుల్ మాస్‌ అవతార్‌లో కనిపిస్తాడట. ఇక బీజీఎమ్  అయితే థియేటర్లో ఆడియన్స్‌ను విజిల్స్ వేసేలా చేస్తుందని సమాచారం. అంతేకాకుండా ప్రభాస్ కెరీర్‌లోనే ఈ ఇంటర్వెల్ బ్లాక్ బెస్ట్ అవుతుందని అంటున్నారు. అయితే ప్రభాస్(Prabhas) చేసిన అన్ని సినిమాల్లోనూ ఇంటర్వెల్ బ్లాక్‌లు అదిరిపోయాయి. ముఖ్యంగా ఛత్రపతి, రెబల్, మిర్చి, బాహుబలి, బాహుబలి-2 చిత్రాల్లో ఇంటర్వెల్ బ్లాక్‌లు అయితే గూస్ బంర్స్ తెప్పిస్తాయి. వీటికి మించి సలార్(Salaar) ఇంటర్వెల్ సీన్ ఉంటుందని వార్తలు రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

హోంబ‌లే ఫిలింస్(Hombale Films) బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్(Vijay Kiragandur) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాస‌న్(Shruti Haasan) హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. అలానే జ‌గ‌ప‌తి బాబు(Jagapati Babu), హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) విల‌న్‌గా కనిపించబోతున్నారు. దీంతో మాలీవుడ్‌లో కూడా సలార్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. పృథ్వీరాజ్‌కి అక్కడ సూపర్ స్టార్ కావడంతో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పాన్ ఇండియా లెవల్లో సలార్ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ సినిమాకు కనీవినీ ఎరుగని రేంజ్‌లె బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం దాదాపుగా 180 కోట్లకి పైగా మేకర్స్ కోట్ చేశారట.  ఇక ఈ  సినిమా నైజాం రైట్స్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) గట్టిప్రయత్నమే చేసిందని తెలుస్తోంది. డీల్ విలువ మాత్రం 75 కోట్ల మధ్య వుందని టాక్. 

ఇక ప్రభాస్ నటిస్తోన్న మరో ప్యాన్ ఇండియా సినిమా రాజా డీలక్స్(Raja Deluxe).  మారుతి(Maruthi) దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60 శాతం షూట్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరుగునుందట.. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హార్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 23న రిలీజ్ చేయనున్నారట. దీనికి సంబంధించి త్వరలో ఓ ప్రకటన విడుదలకానుంది.