భారీ బడ్జెట్ సినిమాల తర్వాత ప్రభాస్ చిన్న చిత్రమిదే

బాహుబలి చిత్రాల తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అతడు టాలీవుడ్ హీరో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశాడు. అప్పటి నుంచి అతడు కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అతడి వద్దకు వెళ్లే దర్శక నిర్మాతలు కూడా పాన్ ఇండియా కథలనే తీసుకువెళ్తున్నారు. చిత్రాల రిజల్ట్ ఎలా వస్తున్నా కానీ దర్శక నిర్మాతలు మాత్రం […]

Share:

బాహుబలి చిత్రాల తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అతడు టాలీవుడ్ హీరో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశాడు. అప్పటి నుంచి అతడు కేవలం పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అతడి వద్దకు వెళ్లే దర్శక నిర్మాతలు కూడా పాన్ ఇండియా కథలనే తీసుకువెళ్తున్నారు. చిత్రాల రిజల్ట్ ఎలా వస్తున్నా కానీ దర్శక నిర్మాతలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో ఆయన నుంచి పాన్ ఇండియా మూవీస్ మాత్రమే తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు. అతడి నుంచి సాలిడ్ హిట్ లేదని ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడినా కానీ డార్లింగ్ నుంచి వరుసగా సినిమాలు రావడంతో వారు ఖుష్ అవుతున్నారు. 

మొదటి సారి స్మాల్ బడ్జెట్ మూవీ

బాహుబలి తర్వాత ప్రభాస్ మొదటి సారిగా పాన్ ఇండియా మూవీలో కాకుండా ఓ స్మాల్ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఒక ఇతిహాసంతో ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ రిజల్ట్ కాస్త నిరాశపర్చినా కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం సంచలనాలు క్రియేట్ చేసింది. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

మరోసారి డెవోషనల్ టచ్

ప్రభాస్ రాముడిగా అలరిస్తూ వచ్చిన ఆదిపురుష్ మూవీ అంచనాలను అందుకోలేకపోయినా కానీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్స్ మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా నష్టాలు రాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప అనే ఇతిహాసంలో ఓ కీలకపాత్ర పోషిస్తారని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరో మారు డార్లింగ్ ను దేవుడిలా చూడొచ్చని ఆశపడుతున్నారు. ప్రభాస్ పోషించే పాత్ర వెండితెరపై ఫుల్ పవర్ ఫుల్ గా ఉండనుందని టాక్. దీంతో అతడు శివుడి పాత్రను పోషించే అవకాశం ఉందని అంతట ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఎవరో బయటి వారు చెబితే అంతలా విశ్వసనీయత ఉండేది కాదు కానీ ప్రభాస్ నటిస్తున్నాడని స్వయంగా చిత్ర హీరో మంచు విష్ణు ట్విటర్ వేదికగా వెల్లడించాడు. దీంతో అభిమానులకు ఈ విషయం మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక అందరు ఫ్యాన్స్ ఈ విషయం మీద సంబరాలు చేసుకుంటున్నారు. 

మరో మారు బాలీవుడ్ దర్శకుడే

ఆదిపురుష్ ను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. అంతే కాకుండా భక్త కన్నప్ప మూవీని కూడా బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రసిద్ధి గాంచిన రామాయణం సీరియల్ ను ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఈ సీరియల్ ఎంతో హిట్ అయింది. దీంతో ఇక ఈ మూవీపై అంతా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీని చిత్ర హీరో మంచు విష్ణునే స్వయంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ నటిస్తోంది. ఇక ఇందులో అనేక మంది టాలెంటెడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మంచు విష్ణు గత సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇంత పెద్ద సినిమాను తీస్తున్నాడు. పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు కానీ ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అంతా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నో హిట్స్ అందించిన మణిశర్మ ఈ మూవీకి స్వరాలు సమకూర్చడంతో అంతా మ్యూజిక్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు.