ఆదిపురుష్ కలెక్షన్స్ తగ్గినా.. ప్రాజెక్ట్ కె రెమ్యూనరేషన్ లో తగ్గని ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్.. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే విపరీతమైన నెగెటివిటీని సొంతం చేసుకుంది. రిలీజ్ తరువాత కూడా అదే కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ సినిమా మొదటిసారి టీజర్ విడుదల చేసినప్పుడే ఈ సినిమా ఏదో తేడాగా ఉందని టాక్ ఊపందుకుంది. తీరా సినిమా విడుదలయ్యాక అసలు ఓం రౌత్ వాల్మీకి రామాయణం తీసాను అంటూ చెప్పి తనదైన పైత్యంతో […]

Share:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్.. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే విపరీతమైన నెగెటివిటీని సొంతం చేసుకుంది. రిలీజ్ తరువాత కూడా అదే కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ సినిమా మొదటిసారి టీజర్ విడుదల చేసినప్పుడే ఈ సినిమా ఏదో తేడాగా ఉందని టాక్ ఊపందుకుంది. తీరా సినిమా విడుదలయ్యాక అసలు ఓం రౌత్ వాల్మీకి రామాయణం తీసాను అంటూ చెప్పి తనదైన పైత్యంతో రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి, ఈ సినిమా తీయడంపై రామ భక్తులతో పాటు కామన్ ఆడియన్స్  కూడా తీరుపై మండిపడుతున్నారు.. జూన్ 16వ తేదీన విడుదలైన ఈ సినిమా నిన్నటితో పది రోజుల రన్ పూర్తిచేసుకుంది. అయితే ఇప్పటివరకు అన్ని ఏరియాలలో కలిపి ఈ చిత్రం 450 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబంధం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. మొదటి మూడు రోజుల్లోనే 350 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ఆ తరువాత ఏడు రోజులకు కలిపి కేవలం ఇన్ని కలెక్షన్స్ అనే వసూలు చేయడం ఈ సినిమా గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థం అవుతుంది. అయితే ఇన్ని కోట్లు సాధించినా కూడా ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించలేక పోయిందనే చెప్పాలి. ఈ సినిమా మొత్తానికే కలెక్షన్స్ పడిపోవడంతో తిరిగి కోలుకోలేకపోతుంది.  తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ కెరియర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి తెలుసు ఆయన రేంజ్ ఏంటో.. ప్రభాస్ ఎప్పుడు టాప్ లోనే ఉంటాడు. ఆదిపురుష్ సినిమా కలెక్షన్లు తగ్గినా కూడా తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ కె కి ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ప్రాజెక్ట్ కె కి ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత.. ఆ విశేషాలు గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రభాస్ నెక్స్ట్ చిత్రం కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్నారు.  ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. ఇంకా అమితాబచ్చన్, దిశా పటాని లాంటి అగ్రతారాలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా సీతారామన్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు సమాచారం. కాగా ఇంతటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్ పైనే ఇప్పుడు చర్చ నెలకొంది. ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యూనరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉండడంతో ఈ చిత్ర బడ్జెట్ రూ. 600 కోట్లకు పైగానే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్ట్ కె నిలవనుంది. ప్రాజెక్ట్ కె కోసం ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్ , కమల్ హాసన్, దిశా పటాని ఎంత తీసుకుంటున్నారు అనే దానిపై అభిమానుల్లో చర్చ జోరుగా సాగుతోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ఈ చిత్రంలో కేవలం గెస్ట్ రోల్ కే 20 కోట్లు తీసుకుంటున్నారని  వినికిడి. దీపికా పదుకొనే ఈ సినిమాకి రూ.10 కోట్లు వసూలు చేస్తుండగా, అమితాబచ్చన్, దిశా పటానితో కలిపి ఇతరులకు మరో 20 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు. దీంతో కేవలం ప్రాజెక్ట్ కె రెమ్యూనరేషన్ కోసమే సుమారు 200 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకు ఎక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. తెలుగు, హిందీ తో పాటు దక్షిణాది భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆదిపురుష్ సినిమా కలెక్షన్లు తగ్గినా కూడా ప్రభాస్ ప్రాజెక్ట్ కె 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలియడంతో ప్రభాస్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.