మళ్లీ మళ్లీ ఆలస్యం అవుతున్న ప్రభాస్ సినిమాలు

ప్రభాస్ చేసిన సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతున్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. రోజురోజుకీ ప్రభాస్ అభిమానులు కూడా పెరుగుతున్నారు. కానీ మరోపక్క ఆలస్యం ఎందుకు అవుతుందో అంటూ అభిమానులు కాస్త కలవరం లో ఉన్నట్లే కనిపిస్తోంది.. ఆలస్యం అవుతున్న బాహుబలి ప్రభాస్ సినిమాలు:  బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ అంటే ఇంటర్నేషనల్ లో కూడా అందరికీ తెలుసు. ఈ మధ్య తను చాలా పెద్ద […]

Share:

ప్రభాస్ చేసిన సినిమాల రిలీజ్ ఆలస్యం అవుతున్నప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. రోజురోజుకీ ప్రభాస్ అభిమానులు కూడా పెరుగుతున్నారు. కానీ మరోపక్క ఆలస్యం ఎందుకు అవుతుందో అంటూ అభిమానులు కాస్త కలవరం లో ఉన్నట్లే కనిపిస్తోంది..

ఆలస్యం అవుతున్న బాహుబలి ప్రభాస్ సినిమాలు: 

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ అంటే ఇంటర్నేషనల్ లో కూడా అందరికీ తెలుసు. ఈ మధ్య తను చాలా పెద్ద సినిమాలకు సైన్ చేశాడు. బాహుబలి నుండి సలార్ సినిమాల వరకు ప్రభాస్ సినిమాలో ఆలస్యం అవుతూనే ఉన్నాయి. ప్రభాస్ సినిమాలు ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బాహుబలి: 

బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా రేంజే మారిపోయింది. ఇలాంటి పెద్ద సినిమాలలో అన్ని గ్రాండ్ గానే ఉండాలి. అలా ఉండాలంటే ప్రొడక్షన్ టైం ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, ఇండియన్ సినిమా రేంజ్ నే మార్చింది. బాహుబలి పార్ట్-1, పార్ట్-2 బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లను కొల్లగొట్టాయి. బాహుబలి సినిమాతో మన ప్రభాస్ పాన్ వరల్డ్ రేంజ్ కి వెళ్ళిపోయాడు.

సాహో: 

బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహో. ఈ సినిమా దర్శకుడు సుజిత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ కూడా చాలా సార్లు వాయిదా పడింది, యాక్షన్ సీక్వెన్స్ వల్ల ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమా అభిమానుల ఓపికను పరీక్షించింది. ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడ్డప్పటికీ మిక్స్డ్ రివ్యూ లు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కొల్లగొట్టింది.

రాధేశ్యామ్: 

రాధేశ్యామ్ సినిమాని రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కోవిడ్ పాండమిక్ వల్ల ఆలస్యమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ప్రభాస్ పూజా హెగ్డే పెయిర్ ఎలా ఉంటుందో చూడాలని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూశారు. వాళ్ల కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయినప్పటికీ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.

ఆది పురుష్: 

ఆది పురుష్ సినిమా మీద ప్రభాస్ మంచి ఆశలు పెట్టుకున్నాడు, ఇందులో ప్రభాస్ రాముడి పాత్ర పోషించాడు. ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ విషయంలో ఈ సినిమా డిలే అయింది. ఈ సినిమా ప్రభాస్ అభిమానులను కాస్త నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లనే కొల్లగొట్టింది.

సలార్: 

కేజిఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా మీద బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రీసెంట్ గా సినిమా వర్క్ కంప్లీట్ కానందున ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఇలా ప్రభాస్ సినిమాలు ఆలస్యం అవుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభాస్ సినిమా సినిమాకి తన అభిమానులను పెంచుకుంటూనే ఉన్నాడు. ప్రభాస్ ఈశ్వర్ తో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈశ్వర్ నుండి సలార్ వరకు ప్రభాస్ జర్నీ అన్ బిలీవబుల్. ముందు ముందు ప్రభాస్ సినిమాలు ఆలస్యం అవ్వకుండా ఉండాలని కోరుకుందాం.