ప్రభాస్-మారుతిల కొత్త మూవీ పేరు తెలుసా?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్న క్రైం థ్రిల్లర్ కామెడీలో నటిస్తున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు అగ్రిమెంట్ చేస్తున్న ప్రభాస్ ఈ చిన్న మూవీలో నటించడం పెద్ద విషయమే.  కాగా ఈ మూవీని డైరెక్టర్ మారుతీ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నటించే హీరోయిన్ల విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. బిగ్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఇలా మారుతితో కలిసి చిన్న […]

Share:

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్న క్రైం థ్రిల్లర్ కామెడీలో నటిస్తున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు అగ్రిమెంట్ చేస్తున్న ప్రభాస్ ఈ చిన్న మూవీలో నటించడం పెద్ద విషయమే.  కాగా ఈ మూవీని డైరెక్టర్ మారుతీ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నటించే హీరోయిన్ల విషయంలో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. బిగ్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఇలా మారుతితో కలిసి చిన్న మూవీ చేస్తున్నాడని అనేసరికి ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. 

ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్

నిరాశ, నిస్పృహల్లో ఉన్న ఫ్యాన్స్ కు డైరెక్టర్ మారుతి ఫుల్ మీల్స్ వంటి భోజనం పెట్టాడు. అప్పట్లో ఈ మూవీలో ప్రభాస్ లుక్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటో చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ పండుగ చేసుకున్నారు. ప్రభాస్ ను చాలా హ్యాండ్ సమ్ గా చూపిస్తున్నాడని మారుతిని మెచ్చుకున్నారు. ఇక అంతే కాకుండా మారుతీ మూవీలంటే మినిమం గ్యారెంటీ కామెడీ ఎలాగూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన ఈ జానర్లో తీసిన మూవీలన్నీ ప్రేక్షకులను నిరుత్సాహపరచలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ధైర్యంతో ఉన్నారు. 

మూవీ పేరిదేనట.. 

ఈ హర్రర్ కామెడీ మూవీకి ఎటువంటి పేరు పెడతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో హీరోయిన్ల రోల్ కు సంబంధించి కూడా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరి కంటే ఎక్కువ మంది హీరోయిన్లు ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ టైటిల్ మీద కూడా ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. ఈ మూవీకి యూనిట్ ‘వింటేజ్ కింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిందనే వార్త ఫిలిం సర్కిళ్లల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ మూవీకి రాజా డీలక్స్ అనే పేరును కన్ఫామ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వింటేజ్ కింగ్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. 

చాలా రోజుల తర్వాత డార్లింగ్ ఆ లుక్ లో..

యంగ్ రెబల్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ కూడా అతడి సొంతం. రీసెంట్ రోజుల్లో ఆయన పాన్ ఇండియా మూవీస్ కొన్ని అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా కానీ కలెక్షన్ల వర్షం కురిసింది. అంతే కాకుండా ఆయన ఓ టాక్ షోకు వచ్చినపుడు సదరు ఓటీటీ ఫ్యాన్స్ తాకిడిని తట్టుకోలేక కొలాప్స్ అయిన విషయం తెలిసిందే. ఓటీటీ వారు తర్వాత సమస్యను సరిదిద్దారనుకోండి అది వేరే విషయం. ఇక మరో అప్డేట్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ చేత విజిల్ వేయించేలా చేస్తుంది. ఈ మూవీలో చాలా రోజుల తర్వాత డార్లింగ్ పంచె కట్టుతో కనిపిస్తారనేది ఆ వార్త సారాంశం. ఈ వార్త విని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇలా వరుస లీకులు ఈ సినిమా రేంజ్ ను ఎంతో పెంచుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు సంబంధించి మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ రాకపోయినా కానీ వార్తలతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. 

అంతే కాకుండా ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇద్దరి కంటే ఎక్కువ మంది హీరోయిన్లు ఆడిపాడనున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో ఎటువంటి క్లారిటీ లేకపోయినా కానీ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్ నటించిన వింటేజ్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ విఫలమైనా కానీ ఈ మూవీలో మరోసారి ప్రభాస్ ను లవర్ బోయ్ గా చూడబోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.