మైసూర్ లోని ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తొలగించాలి..

మైసూర్ లోని ఓ మ్యూజియంలో తాజాగా ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంచలన […]

Share:

మైసూర్ లోని ఓ మ్యూజియంలో తాజాగా ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్యకృష్ణ, తమన్నా మరియు సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోనూ కనీవినీ ఎరుగని సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది.  దాదాపు 1500 కోట్ల వరకు వసూల్ చేసింది. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి. మహేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. 

ఈ చిత్రంతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘బాహుబలి’ మేనియా ప్రపంచ నలుమూలలను తాకింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని లండన్ లోని ప్రసిద్ధ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ‘బాహుబలి’ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసే మ్యూజియంలో ‘బాహుబలి’ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. చిత్రబృందం కూడా చాలా గర్వంగా ఫీలయ్యింది. అలాగే ఇప్పుడు మరో చోట కూడా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు.

రీసెంట్ గా మైసూరులోని ఓ మ్యూజియంలో ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బొమ్మకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయి. అయితే, ఈ ‘బాహుబలి’ విగ్రహం అస్సలు ప్రభాస్ లుక్ లో లేకపోవడంతో నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మైనపు విగ్రహం అస్సలు ప్రభాస్ లా లేదని మండిపడుతున్నారు. ‘బాహుబలి’ గెటపు ఉన్నా, ‘బాహుబలి’ కాదంటున్నారు. మరికొంత మంది ఈ విగ్రహం అచ్చం ‘బాహుబలి’ స్పూప్ చేసిన డేవిడ్ వార్నర్ లా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తంగా ఈ మైనపు విగ్రహం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణం అయ్యింది.   

అటు ఇటు తిరిగి ఈ ‘బాహుబలి’ మైనపు విగ్రహం వ్యవహారం ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ దగ్గరికి చేరింది. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఫోటోను షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. ఎలాంటి పర్మీషన్ తీసుకోలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ బొమ్మను తొలిగించడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం” అని పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మైసూర్ మ్యూజియం వాళ్లు ఈ విగ్రహాన్ని తొలగిస్తారా? లేదంటే, నిర్మాతకు క్షమాపణ చెప్పి, అలాగే ఉండేలా చూస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.      

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కు రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ తో కల్కీ, మారుతి దర్శకత్వంలో ఒకటి, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ లాంటి సినిమాలు చేస్తున్నాడు.