ప్రభాస్‌ యోగి మూవీ రీ రిలీజ్‌లో ఫ్యాన్స్‌ రచ్చ..

 తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాత సినిమాల రీరిలీజ్‌ల హవా నడుస్తుంది. తమ అభిమాన హిరో పాత సినిమా రీరిలీజ్‌ అవుతుందంటే ఫ్యాన్స్‌ థియేటర్‌‌కి పరుగెత్తుకుంటూ వస్తున్నారు. రీరిలీజ్‌కు కూడా కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. థియేటర్‌‌ వద్ద ఫ్యాన్స్‌ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. బయట డ్రమ్స్‌ వాయిస్తూ డ్యాన్సులు.. థియేటర్‌‌ లోపల టపాసులు కాలుస్తూ చిందులు వేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు అందరి హీరోల సినిమాలు రీరిలీజ్‌ అవుతున్నాయి. ఇప్పటివకే పవన్ కళ్యాణ్, మహేశ్‌బాబు, అల్లు […]

Share:

 తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాత సినిమాల రీరిలీజ్‌ల హవా నడుస్తుంది. తమ అభిమాన హిరో పాత సినిమా రీరిలీజ్‌ అవుతుందంటే ఫ్యాన్స్‌ థియేటర్‌‌కి పరుగెత్తుకుంటూ వస్తున్నారు. రీరిలీజ్‌కు కూడా కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. థియేటర్‌‌ వద్ద ఫ్యాన్స్‌ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. బయట డ్రమ్స్‌ వాయిస్తూ డ్యాన్సులు.. థియేటర్‌‌ లోపల టపాసులు కాలుస్తూ చిందులు వేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు అందరి హీరోల సినిమాలు రీరిలీజ్‌ అవుతున్నాయి. ఇప్పటివకే పవన్ కళ్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌, రామ్‌ చరణ్, బాలకృష్ణ, ప్రభాస్‌ తదితర హీరోల సినిమాలు రీరిలీజ్‌ అయ్యాయి.. ఇంకా అవుతూనే ఉన్నాయి. నాగార్జున మన్మథుడు మూవీ కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతుంది. ఫ్యాన్స్‌కు మళ్లీ పాత రోజులు గుర్తు చేయాలని సినిమాలను రీరిలీజ్‌ చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది..కానీ, ఫ్యాన్స్‌ చేసే రచ్చతో థియేటర్ల యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

స్క్రీన్‌ దగ్గరకు వెళ్లి డ్యాన్స్ లు చేయడం, టపాసులు పేల్చడం, కాగితాలు చల్లడం లాంటివి చేస్తున్నారు.సినిమా మధ్యలో కరెంట్‌ పోయిందా… ఇక  అంతే సంగతులు. థియేటర్‌‌ను పీకి పందిరి వేస్తారు. స్ర్కీన్లను చించివేస్తారు. కుర్చీలు విరగ్గొడుతారు. అద్దాలు పగలగొట్టి, నానా రచ్చ చేస్తారు. రీరిలీజ్‌ సినిమాలతో థియేటర్ల ఓనర్లకు వచ్చే ఆదాయం ఏమో గానీ, అభిమానులు చేసే లాస్‌ ఎక్కువగా ఉందంటున్నారు. 

రీరిలీజ్‌ల పరంపరలోనే రెండ్రోజుల క్రితం మరో సినిమా విడుదల అయింది. పాన్‌ ఇండియా స్టార్‌‌ ప్రభాస్‌ నటించిన యోగి మూవీ తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో విడుదల అయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ నానా రచ్చ చేశారు. 2007లో విడుదలైన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌‌ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా రిలీజ్‌ చేయడంతో ప్రభాస్‌ అభిమానులు ఏపీలోని రెండు చోట్ల బీభత్సం సృష్టించారు. 

స్ర్కీన్లు చించివేశారు..

ఏపీలో నంద్యాలలోని రాజ్‌ థియేటర్‌‌తో పాటు కాకినాడలోని శ్రీప్రియ థియేటర్‌‌లో అభిమానులు స్ర్కీన్లను చించివేశారు. సినిమాలో పాటలకు డ్యాన్స్‌ చేస్తూ అత్యుత్సాహంతో అభిమానులు స్ర్కీన్‌ మీద పడ్డారు. దీంతో రెండో చోట్ల భారీ డ్యామేజ్‌ జరిగింది. కాకినాడ శ్రీప్రియ థియేటర్‌‌ను ఇటీవలే రెనోవేట్‌ చేశారు. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానుల వల్ల ఇకపై ఆ థియేటర్‌‌లో రీ రిలీజ్‌ సినిమాలను ప్రదర్శించబోమని యాజమాన్యం స్పష్టం చేసింది. అటు నంద్యాల రాజ్‌ థియేటర్‌‌ యాజమాన్యం కూడా తాజా ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిమానులు సినిమా చూడటానికి వచ్చి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేయడం మానుకోవాలని సూచించారు. 

సుదర్శన్‌ థియేటర్‌‌లో…

అలాగే, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్ లోని సుదర్శన్‌ థియేటర్‌‌లో ప్రభాస్‌ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.ఈ మూవీని చూసేందుకు వచ్చిన అభిమానుల్లోని రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. సుదర్శన్‌  35 ఎంఎం థియేటర్‌‌ స్ర్కీన్‌తో పాటు అద్దాలు ధ్వంసం చేశారు. క్యాంటిన్‌ సమీపంలో ఉన్న కూల్‌ డ్రింక్స్‌ బాటిళ్లను పగలగొట్టారు. గొడవ చేసిన అభిమానులను పట్టుకునేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించగా, అక్కడి నుంచి పారిపోయారు.ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నయనతార హిరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించారు. శారద, కోట  శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌, చలపతిరావు, ప్రదీప్‌ రావత్‌, అలీ, సునీల్‌, చంద్రమోహన్‌ తదితరులు నటించారు.

గతంలోనూ పలువురి హీరోల సినిమాలు రీరిలీజ్‌ సందర్భంగా అభినమానులు థియేటర్లను ధ్వంసం చేయడం, థియేటర్‌‌లో మంటలు వెలిగించడం, సీట్లతో పాటు స్క్రీన్లను చించివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి మూవీ రీ రిలీజ్‌ టైమ్లో విజయవాడ అప్సర థియేటర్‌‌లో నిప్పు పెట్టడం కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.