ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్

సాలార్ ఇంకా కల్కి 2898 AD రెండు ప్రధాన ప్రభాస్ సినిమా టీసర్లు ఇప్పటికే ప్రభాస్ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నాయి, పైగా ఈమధ్య ప్రభాస్న తరచుగా సోషల్ మీడియా లో ముఖ్యమైన అంశాలు పంచుకుంటూ తన తోటి హీరోల సినిమాల అప్డేట్లు ఇస్తూ అభినందనలు కూడా తెలియ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో సాధారణం కంటే ఎక్కువ చురుకుగా ఉన్నాడనే చెప్పాలి. పైగా బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ ఐన ప్రభాస్ కి కొన్ని మిల్లియన్ ఫాలోవర్లు […]

Share:

సాలార్ ఇంకా కల్కి 2898 AD రెండు ప్రధాన ప్రభాస్ సినిమా టీసర్లు ఇప్పటికే ప్రభాస్ సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నాయి, పైగా ఈమధ్య ప్రభాస్న తరచుగా సోషల్ మీడియా లో ముఖ్యమైన అంశాలు పంచుకుంటూ తన తోటి హీరోల సినిమాల అప్డేట్లు ఇస్తూ అభినందనలు కూడా తెలియ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో సాధారణం కంటే ఎక్కువ చురుకుగా ఉన్నాడనే చెప్పాలి. పైగా బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ ఐన ప్రభాస్ కి కొన్ని మిల్లియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే తమ అభిమాన నటుడు ఇంకా అప్డేట్లు ఇవ్వాలని అభిమానులు ఆశ పడుతూ కూడా ఉంటారు. ఇప్పుడు అభిమానులు నిరాశ పడేలా, ప్రభాస్ తన ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయ్యిందని, తన టీమ్ దీన్ని చూస్తున్నారని ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసాడు. 

ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్: 

తరచుగా మంచి ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీస్ అకౌంలు హాక్ అయ్యి చెత్త పోస్ట్లు రావటం సహజం అయ్యింది, సైబర్ హాస్కిన్గ్, ఫిషింగ్ లాంటివి చెయ్యి దాటిపోతున్నాయి, కొంత మంది సెలెబ్రిటీలు సైబర్ కంప్లైంట్ ఇచ్చినా కూడా తగిన ఆక్షన్ ఉండకపోయేసరికి వేరొక అకౌంట్ కొత్తగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ప్రకటన విడుదల చేస్తూ “అందరికీ నమస్కారం, నా ఫేస్‌బుక్ పేజీ కంప్రమైస్ అయ్యింది. టీమ్ దీనిని చూస్తున్నారు.” అని రాసాడు మరి ప్రభాస్ విషయంలో హాక్ చేసిన అకౌంట్ రికవర్ అవ్వబోతోందా లేదా ప్రభాస్ కూడా మరో అకౌంట్ క్రియేట్ చేసుకోబోతాడో చూడాలి. 

సోషల్ మీడియా ద్వారా అప్డేట్లు: 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన గురించి మాట్లాడుతూ ఉంటారు సెలెబ్రిటీలు, ఈమధ్య తమిళ్ సూపర్ స్టార్లు రజినీకాంత్, విజయ్ అలాగే మన పవన్ కళ్యాణ్ లాంటి టాప్ సెలెబ్రిటీలు ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న కొన్ని గంటల్లోనే కొన్ని మిల్లియన్ మంది ఫాలో అయ్యి సంచలనం సృష్టించారు. ఈరోజుల్లో తమ అభిమాన నటులు సోషల్ మీడియా లో ఉన్నారు అంటే ఆ క్రేజ్ ఏ వేరు. అదేవిధంగా ప్రభాస్ తన రాబోయే చిత్రాలను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఉపయోగిస్తున్నాడు. తను బ్యాక్-టు-బ్యాక్ విడుదల గురించి పంచుకుంటున్నాడు. 

బాహుబలి చేసే సమయంలో ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలోపెట్టుకుని చిత్రబృందం అతని ఫేస్‌బుక్ అకౌంట్ ను సృష్టించినట్లు కథనాలు ఉన్నాయి. అలాగే, “రాధే శ్యామ్” బృందం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను సృష్టించిందని ప్రభాస్ ఏ వెల్లడించాడు. అసలే తక్కువగా మాట్లాడే ప్రభాస్ సోషల్ మీడియా లో మాత్రం ఏమి మాట్లాడుతాడు, అందుకే ఈ టీములు అతని క్రేజ్ ని బట్టి తన అప్డేట్లు షేర్ చెయ్యటానికి సృష్టించి ఉండచ్చు. ప్రభాస్ సోషల్ మీడియా పేజీలు టాగ్ చేస్తూ మిగతా హీరోలు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కూడా జరుగుతోంది. అయితే ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అకౌంట్ల కంటే ఇన్‌స్టాగ్రామ్‌కే తన ప్రాధాన్యత అని చెప్పాడు, ఇన్‌స్టాగ్రామ్ బెటర్ అని నమ్ముతాడు ప్రభాస్. నటుడు అసలే రిజర్వ్‌డ్, ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ కంటే ఇన్‌స్టాగ్రామ్‌ లోనే ఆక్టివ్ గా ఉంటున్నాడు కాబట్టి, మరో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడా.. అతని టీమ్ పాత అకౌంట్ రికవర్ చేస్తారో చూద్దాం.. అయితే మీరు మాత్రం ప్రభాస్ ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే ప్రయత్నం చెయ్యండి.