శ్రీలీల‌ జోరు మామూలుగా లేదుగా…

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీలీల‌. ఈ బ్యూటీ ప్రస్తుతం డజన్ సినిమాలకు పైగా చేస్తున్నట్లు టాక్. హీరో ఎవరైనా సరే హీరోయిన్ మాత్రం శ్రీలీలే ఉంటోంది. ఈ మధ్య ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో రామ్ శ్రీలీల గురించి చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ ఫన్నీగానే ఉన్నా కానీ వాటిలో మాత్రం నిజం ఉందని పలువురు నెటిజన్లు అంటున్నారు. శ్రీ లీల సెలవు తీసుకోవాలంటే తెలుగు సినీ ఇండస్ట్రీ […]

Share:

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీలీల‌. ఈ బ్యూటీ ప్రస్తుతం డజన్ సినిమాలకు పైగా చేస్తున్నట్లు టాక్. హీరో ఎవరైనా సరే హీరోయిన్ మాత్రం శ్రీలీలే ఉంటోంది. ఈ మధ్య ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో రామ్ శ్రీలీల గురించి చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ ఫన్నీగానే ఉన్నా కానీ వాటిలో మాత్రం నిజం ఉందని పలువురు నెటిజన్లు అంటున్నారు. శ్రీ లీల సెలవు తీసుకోవాలంటే తెలుగు సినీ ఇండస్ట్రీ ధర్నా చేయాలి లేదా కరోనా వంటి విపత్తు వచ్చి మొత్తం షూటింగ్స్ ఆగిపోవాలి లేకపోతే శ్రీ లీల సెలవు తీసుకోవడం జరగదని రామ్ తెలిపాడు. ఆ కామంట్స్ నిజమనే చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఆ సినిమా అనే తేడా లేకుండా శ్రీ లీల ప్రస్తుతం జోరు చూపిస్తోంది. ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోలతో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో జతకట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీతారామం వంటి క్లాసిక్ మూవీని తెరకెక్కించిన హను రాఘవపూడి ప్రభాస్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా ఈ బ్యూటీ కనిపించనుందని టాక్. 

లీల డిమాండ్ మాటలకందనిది.. 

ఏ హీరోలకు లేని డిమాండ్ ప్రస్తుతం శ్రీ లీలకు ఉంది. సూపర్ స్టార్ సినిమా అయినా పవర్ స్టార్ సినిమా అయినా అందులో హీరోయిన్ గా శ్రీ లీలే నటిస్తుండడం గమానార్హం. ఏ సెట్ కు పోయినా అక్కడ శ్రీ లీలే హీరోయిన్ గా దర్శనం ఇస్తోందని పలువురు చెబుతున్నారు. సీతారామం వంటి బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హను రాఘవపూడితో సినిమాను శ్రీ లీల వదులుకోదని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా హీరోగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు కాబట్టి శ్రీ లీల ఈ అవకాశాన్ని అంత తొందరగా జారవిడ్చుకోదని టాక్. 

ఇది కూడా లవ్ స్టోరీయేనట… 

హను రాఘవపూడి సినిమా అనగానే అందరికీ సీతారామం గుర్తుకు వస్తోంది. అలాంటి డిఫరెంట్ క్లాసిక్ లవ్ స్టోరీని ఈ డైరెక్టర్ అందించాడు. వస్తున్న రిపోర్టుల ప్రకారం.. ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా లవ్ స్టోరీయే అని తెలుస్తోంది. అందుకోసమే శ్రీ లీల కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. గత సినిమాలో యుద్ధంలో లవ్ స్టోరీని చూపించి సక్సెస్ అయిన దర్శకుడు ఈ సారి కూడా అదే కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి రెండో ప్రపంచయుద్ధం మధ్య తన ప్రేమకథను సెట్ చేయడానికి చిత్ర నిర్మాత ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం నగర్ సమాచారం. ఇదే నిజం అయితే రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ ను మరో సారి లవర్ బాయ్ గా చూసే అవకాశం కలుగుతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి నిర్మించనుందని సమాచారం. 

కేవలం పెద్ద హీరోలు మాత్రమే కాదు….

ప్రస్తుతం శ్రీ లీల ఎంత బిజీగా ఉందంటే అమ్మడుతో కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాకుండా అప్ కమింగ్ హీరోలు కూడా సినిమాలు చేస్తున్నారు. సీనియర్ హీరోగా చెప్పుకునే బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి మూలో కూడా శ్రీ లీల ఓ మెయిన్ రోల్ లో చేస్తుందంటేనే మనం చెప్పొచ్చు శ్రీ లీల క్రేజ్ ఎంత ఘోరంగా ఉందో. మహేశ్ బాబు, రామ్ పోతినేని వంటి స్టార్లు మాత్రమే కాకుండా నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి వారు కూడా శ్రీ లీలతో సినిమాలు చేస్తున్నారు. శ్రీ లీల పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సినిమా అంతగా ఆడకపోయినా కానీ టాలీవుడ్ మేకర్స్ మాత్రం శ్రీ లీలకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే శ్రీ లీలకు సెలవే లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంచుతున్నారు. ఈ రోజుల్లో ఇంత మంది హీరోయిన్లున్నా శ్రీ లీలలా బిజీగా ఉండే మరో హీరోయిన్ లేదని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ ఇస్మార్ట్ హీరో రామ్ తో నటించిన స్కంద మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అవనుంది. ఈ మూవీకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.