శాన్ డీగోలో  ల్యాండ్ అయిన ప్రభాస్, రానా….

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ నేడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. రాజమౌళి పుణ్యమా అని బాహుబలి సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ఈయన ఇప్పుడు అన్ని కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా చలామణి అవుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనే కాదు యావత్తు సినీ పరిశ్రమలోనే అత్యధిక […]

Share:

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ నేడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. రాజమౌళి పుణ్యమా అని బాహుబలి సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ఈయన ఇప్పుడు అన్ని కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా చలామణి అవుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనే కాదు యావత్తు సినీ పరిశ్రమలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోల జాబితాలో ప్రభాస్ చేరిపోయారు. 

ఇక మొన్నటికి మొన్న ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్న ప్రభాస్ తాజాగా ప్రాజెక్టుకే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాతో ప్రేక్షకులను ఒప్పిస్తారా అంటే నిన్న సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయగా పూర్తిస్థాయిలో అమీర్పేట గ్రాఫిక్స్ లాగా ఉంది అంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.  ఇదిలా  ఉండగా ఈసారి చరిత్ర సృష్టించడానికి   తాజాగా  శాన్ డీగోలో ప్రభాస్, రానా ల్యాండ్ అయ్యారు. ప్రాజెక్టు కే మూవీ చరిత్రకు అడుగు దూరంలో నిలిచారు అని చెప్పవచ్చు. అక్కడి కామిక్ కాన్ లో ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ లాంచ్ కానున్న విషయం తెలిసిందే….

అమెరికాలోని   శాన్ డిగో కామిక్  కాన్ ఈవెంట్ లోకి ఎంటర్ ఇస్తున్న తొలి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే నిలవబోతుంది. జూలై 24 జరుగునున్న ఈవెంట్లో ప్రాజెక్ట్ కే మూవీ టైటిల్, గ్లింప్స్ లాంచ్ కానున్న విషయం తెలిసిందే. దీనికోసం మూవీ హీరో ప్రభాస్ మరియు రానా  శాన్ డీగోలో ల్యాండ్ అయ్యారు. సోమవారమే ఈ మూవీ నుంచి ఫిమేల్ లీడ్ అయిన దీపికా పదుకొనే  ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే..ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు టైటిల్, గ్లింప్స్  కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శాన్ డీగోలో  ప్రభాస్, రానా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతుంది. ఈ ఫోటోను ప్రాజెక్టు కే మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు.

 ఈ ప్రాజెక్టు కే మూవీ దుస్తుల్లోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కనిపించడం విశేషం.. సుమారు  రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కునున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  ఈ. సై – ఫిక్షన్ , యాక్షన్ కిల్లర్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే , దిశా పటాని కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ కామిక్ ఖాన్ ఈవెంట్ కు ప్రభాస్ దీపికా తో పాటు కమలహాసన్ కూడా హాజరవ్వనున్నాడు.  ఈ సినిమాలో కేవలం నటీనటుల రెమ్యూనరేషన్లు రూ .200 కోట్ల వరకు ఉన్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..? ఆ విషయం ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఈ సినిమా ను వచ్చేయడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అవ్వ పోతున్నట్లు సమాచారం..

ఇకపోతే భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ కు విజయాన్ని అందిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం ఈ సినిమాతో ప్రభాస్ తన మునుపటి పూర్వ వైభవాన్ని పొందుతారు లేదో..