సినిమాల విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్న పూజ 

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నట్లు సమాచారం అయితే కంఫర్మ్ అయినట్లే. అంతేకాకుండా షూటింగ్ డిలే అవడం రీ షూట్ ఎక్కువ జరగడం వల్ల, అంతే కాకుండా ముఖ్యంగా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ రావడం వల్ల, ఆమె ఈ గుంటూరు కారం సినిమా నుంచి బయటికి వచ్చేసినట్లు సమాచారం. ఇప్పుడు తను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు పుకార్లు షికార్లుగా […]

Share:

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా ‘గుంటూరు కారం’ నుంచి పూజ తప్పుకున్నట్లు సమాచారం అయితే కంఫర్మ్ అయినట్లే. అంతేకాకుండా షూటింగ్ డిలే అవడం రీ షూట్ ఎక్కువ జరగడం వల్ల, అంతే కాకుండా ముఖ్యంగా స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ రావడం వల్ల, ఆమె ఈ గుంటూరు కారం సినిమా నుంచి బయటికి వచ్చేసినట్లు సమాచారం. ఇప్పుడు తను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా తప్పుకున్నట్లు పుకార్లు షికార్లుగా మారాయి.

దూరం అవుతున్న సినిమాలు:

గుంటూరు కారం సినిమా లో పూజ ఫిమేల్ రోల్లో శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పూజ హెగ్డే మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి తీయబోతున్న సినిమా షూటింగ్ అనేది ఈ సంవత్సరంలోనే మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. పూజ హెగ్డే ప్రస్తుతం తను నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోవడంతో, మరోపక్క ‘గుంటూరు కారం’ నుంచి బయటకి రావడం,ఇప్పుడు వుస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకున్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కారణంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రం నుంచి బయటికి వెళ్లినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సంఘటనలు కారణంగా, పూజ కాస్త నిరాశగా ఉందని తెలుస్తోంది. అందుకే పూజ ప్రస్తుతం సినిమాలు సెలెక్ట్ చేసుకోవడంలో ఆచితూచి అడుగు వేస్తున్నట్లు సమాచారం.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్: 

ఇటీవల వరకు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. 

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వాయిదా పడింది అనే విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడనప్పటికీ, పవన్ కళ్యాణ్ తన రాజకీయ కట్టుబాట్లతో బిజీగా ఉన్నారని పుకార్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్ నిజమే ఏమో అని నిర్ధారణ కూడా కలిగిస్తున్నాయి. తెలుగు మీడియా ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన వారాహి విజయ యాత్రలో నిమగ్నమై ఉన్నాడు. అంతేకాకుండా AP అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున నటుడు రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పోస్ట్ పోన్ అయినందున, రవితేజ కొత్త చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్ట్ 2018లో అజయ్ దేవ్‌గిన్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన రైడ్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం 1980లలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు జరిపిన ఆదాయపు పన్ను దాడుల నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రవితేజ ప్రస్తుతం ఈగల్, చాంగురే బంగారు రాజా సినిమాలలో కూడా బిజీ అయ్యారు. 

సినిమా విశేషాలు: 

శ్రీలీల, పూజా హెగ్డే, పంకజ్ త్రిపాఠి, పవన్ కళ్యాణ్, అశుతోష్ రానా, మరియు గౌతమి వంటి పెద్ద పెద్ద సినీ తారలు నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో చాలా అంచనా పెరిగింది. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్‌లు తమ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో మద్దతునిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో పూజ హెగ్డే పేరు వినిపించినప్పటికీ, ఆమె రెమ్యూనరేషన్ కారణంగా ఇప్పుడు పూజ  తప్పుకుంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.