స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి..?

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోతుందా? వరుడు ఆ స్టార్ క్రికెటరేనా? ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసమే తాను చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుందని సమాచారం. సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటే ఓ గుర్తింపు పొందిన పూజా హెగ్డే.. ప్రస్తుతం ఓ వార్తతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. కోలీవుడ్ లో అరంగేట్రం చేసిన పూజా.. సూపర్ హీరోయిన్ గా ఎదుగుతోంది. […]

Share:

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోతుందా? వరుడు ఆ స్టార్ క్రికెటరేనా? ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసమే తాను చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుందని సమాచారం.

సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటే ఓ గుర్తింపు పొందిన పూజా హెగ్డే.. ప్రస్తుతం ఓ వార్తతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. కోలీవుడ్ లో అరంగేట్రం చేసిన పూజా.. సూపర్ హీరోయిన్ గా ఎదుగుతోంది. పూజా చాలా సినిమాల్లో సూపర్ స్టార్ హీరోయిన్‌గా కనిపించింది. అత్యధిక హిట్‌లతో దూసుకపోతోంది. పూజ 2012 తమిళ చిత్రం ముఖమూడితో అరంగేట్రం చేసింది.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది బుట్టబొమ్మ పూజాహెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ వెంటనే బాలీవుడ్‌కి వెళ్లింది. కానీ అక్కడ భారీ డిజాస్టర్‌ ఆమె ఖాతాలో చేరింది. ఆ తర్వాత తిరిగి టాలీవుడ్‌ బాట పట్టింది. వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుని.. టాలీవుడ్‌లోనే కాక సౌత్‌లోనే నంబర్‌ 1 హీరోయిన్‌గా నిలిచింది. కొన్నాళ్ల పాటు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డేకు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. పూజ చివరిసారిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్, కిసీ కా జాన్‌లో కనిపించింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పూజా, సల్మాన్‌లు డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వ్యాపించాయి. వీరిద్దరూ కలిసి చాలా వేదికలకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే ఆ తర్వాత పూజా ఈ పుకార్లను కొట్టిపారేసి ఘాటుగానే సమాధానమిచ్చింది.

కానీ, ఈ బ్యూటీ చుట్టూ ప్రస్తుతం మరో కొత్త డేటింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. ముంబైకి చెందిన ఓ క్రికెటర్‌తో పూజా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు కొత్త రూమర్ వచ్చింది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొంత కాలంగా ప్రముఖ క్రికెటర్ తో చాలా క్లోజ్ గా ఉంటుందట. అతను ముంబైకి చెందిన క్రికెటర్‌తో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.   ఇటీవలే ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పూజా జాయిన్ అయినట్లు సమాచారం.అంతేకాదు సోషల్ మీడియాలో ఆ క్రికెటర్ పెట్టె ప్రతీ పోస్ట్ కి రిప్లై కూడా ఇస్తుందట ఈ బ్యూటీ. దీంతో వీరిద్దరి మధ్య ఎదో జరుగుతోందని బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 పూజా హెగ్డే ఓ క్రికెటర్‌ని పెళ్లి చేసుకోవచ్చని సినీజోష్ నివేదించింది. అయితే ఇందులో నిజమెంతో పూజా హెగ్డే త్వరలోనే క్లారిటీ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

అదే సమయంలో పూజాకి సినిమా ఇండస్ట్రీలో అంతగా టైమ్ లేదనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెలుగులో మహేష్ బాబు నటించిన గుంటూర్ కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడం సినీ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్, స్క్రిప్ట్‌లో భారీ మార్పులు జరగడంతో పూజా వైదొలిగినట్లు సమాచారం. అదే సమయంలో తెలుగులో పూజా నటించిన రాధే శ్యామ్, ఆచార్య వంటి చిత్రాలు భారీ పరాజయాన్ని చవిచూశాయి. తమిళంలో విజయ్ నటించిన మృగం చిత్రం కూడా పరాజయం పాలైంది.

అదే సమయంలో, బాలీవుడ్‌పై దృష్టి పెట్టడానికి పూజా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని వదిలిపెట్టినట్లు కూడా సమాచారం. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో పూజా హీరోయిన్ గా వేరే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయలేదు.