బ్యాక్ టు బ్యాక్ సినిమాలో పూజా హెగ్డే బిజీ బిజీ

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే జోరు చూపిస్తోంది. రీసెంట్ గా అమ్మడు డైరీ మొత్తం ఫుల్ అయింది. కొత్త మూవీలు ఒప్పుకునేందుకు ఈ చిన్నదానికి తీరిక కూడా లేదట. వరుస ప్లాపులు పలకరించినా కానీ ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇందుకు తార్కాణంగా ఈ సంఘటనలే ఉదాహరణ.  గుంటూరు కారంతో వార్తల్లోకి..  టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న రీసెంట్ మూవీ గుంటూరు కారం ఈ మూవీలో […]

Share:

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే జోరు చూపిస్తోంది. రీసెంట్ గా అమ్మడు డైరీ మొత్తం ఫుల్ అయింది. కొత్త మూవీలు ఒప్పుకునేందుకు ఈ చిన్నదానికి తీరిక కూడా లేదట. వరుస ప్లాపులు పలకరించినా కానీ ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఇందుకు తార్కాణంగా ఈ సంఘటనలే ఉదాహరణ. 

గుంటూరు కారంతో వార్తల్లోకి.. 

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న రీసెంట్ మూవీ గుంటూరు కారం ఈ మూవీలో మొదట మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు మేకర్స్ కు పూజకు ఏం డిఫరెన్సెస్ వచ్చాయో ఏమో ఈ మూవీ నుంచి అమ్మడు అర్ధాంతరంగా తప్పుకుంది. ఇక మేకర్స్ చేసేదేం లేక సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ చేశారు. అంతే కాకుండా మరో బ్యూటీ మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. 

టాలీవుడ్ ను ఊపేసిన పొడుగు కాళ్ల సుందరి.. 

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే ఉంటుంది. అల వైకుంఠపురం మూవీలో అమ్మడు చేసిన రచ్చ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఇక ఈ మూవీతో వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా టాప్ లీగ్ లోకి దూసుకుపోయింది. టాప్ హీరోయిన్లతో పోటీపడుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చెయిర్ కు మరింత చేరువైంది. ఇక ఆ తరుణంలోనే రిలీజైన అరవింద సమేత వీరరాఘవ సినిమా కూడా హిట్ కావడంతో ఈ చిన్నదానికి టాలీవుడ్ అగ్రతాంబూలం ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ మూవీ హిట్ తో పూజ కెరియర్ గ్రాఫ్ అలా అమాంతం పెరిగిపోయింది. బడా హీరోలంతా పూజా హెగ్డే జపం చేయడం మొదలుపెట్టారు. ఈ అమ్మడు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అని అన్నట్లుగా చాలా సినిమాలను లైన్లో పెట్టింది. 

వాటి ఫలితంలో తలకిందులు… 

ఇదే జోరులో అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాధే శ్యామ్ మూవీ, కోలీవుడ్ దళపతి విజయ్ తో బీస్ట్ మూవీ చేసింది. ఈ రెండు మూవీలు కూడా కొద్ది గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. ఈ మూవీలతో అమ్మడు కెరియర్ ఎక్కడికో రాకెట్ లా దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ రెండు మూవీలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్స్ రాబట్టలేకపోయాయి. ఇక దీంతో పూజ కాస్త సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి అమ్మడు సినిమాలు పెద్దగా రిలీజ్ కావడం లేదు. పూజ పని అయిపోయిందని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటోంది. తన హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారులో హీట్ పెంచుతోంది. వెకేషన్ ఫొటోలు, బీచ్ లో ఫొటోలు, హాట్ ఫొటోలు ఇలా ఒక్కటేమిటి అభిమానులకు ఫుల్ మీల్స్ పెడుతూ తనను మర్చిపోకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 

మళ్లీ ఫామ్ లోకి చిన్నది.. 

కాసింత సైలెంట్ అయిన పూజ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు టాలీవుడ్ కి చెందిన ఓ బడా నిర్మాణ సంస్థతో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ  మూడు మూవీలు కూడా పెద్ద, పెద్ద స్టార్లతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే ఇన్నాళ్లు ఫామ్ కోల్పోయి సైలెంట్  అయిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఫామ్ లోకి వచ్చినట్లే. ఇది విన్న అమ్మడు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కామన్ ఆడియన్స్ మాత్రం టైం మళ్లీ పూజ వైపు మారినట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు.