కరోనా బారిన పడిన పూజ భట్ తన ఫ్యాన్స్‌ను మాస్క్ వేసుకోవాలని కోరారు..

పూజ భట్ యువతను ఉద్దేశిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ పాపులర్ నటి, డైరెక్టర్ పూజ భట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ వేదికగా.. సుమారు మూడు సంవత్సరాల క్రితం నేను మొదటిసారి కరోనా బారిన పడ్డాను ఇప్పటికైనా ప్రజలు మాస్క్ ధరించాలని కరోనా ముప్పు పొంచి ఉందని ఆమె అభిమానులను కోరారు. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా […]

Share:

పూజ భట్ యువతను ఉద్దేశిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ పాపులర్ నటి, డైరెక్టర్ పూజ భట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ట్విట్టర్ వేదికగా.. సుమారు మూడు సంవత్సరాల క్రితం నేను మొదటిసారి కరోనా బారిన పడ్డాను ఇప్పటికైనా ప్రజలు మాస్క్ ధరించాలని కరోనా ముప్పు పొంచి ఉందని ఆమె అభిమానులను కోరారు. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అని ప్రజలు ఆలోచనలో ఉండి కరోనా గురించి ఏమరపాటున ఉండవద్దని కరోనా ఇంకా అంతం కాలేదని ఆమె గుర్తు చేశారు.

పూజ భట్ వీడియో వైరల్..

ముఖ్యంగా పూజ భట్ యువతను ఉద్దేశిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లల్ని ఉద్దేశిస్తూ.. ఇప్పటి యువత కూడా మాస్క్ పెట్టుకోకుండా ఇలాంటి చర్యలు చేయవద్దని చెబుతుంది. 

పూజా భట్ గురించి మరికొన్ని విషయాలు.. 

బాలీవుడ్ పాపులర్ నటి పూజా భట్ తాగుడుకు బానిసయ్యానని.. దాని నుంచి బయటపడేందుకు పోరాటం చేసానని తెలిపింది.  ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.  తన తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో ఆమె నటించిన “దిల్‌ హై కీ మాన్‌తా నహీ” సినిమా జూలై 12తో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఆ సినిమాలో పూజా భట్ మద్యానికి బానిసైన తండ్రిని కాపాడుకునే కూతురి పాత్రను పోషించింది.

మహేశ్‌భట్‌ డైరెక్షన్‌లోనే డాడీ అనే సినిమా వచ్చింది. అందులో పరిస్థితుల ప్రభావం కారణంగా తన తండ్రి మద్యానికి బానిస అవుతాడని, ఆ వ్యసనం నుంచి ఆయనను బయటకు తీసుకొచ్చే కూతురి పాత్రలో తను నటించానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ మాదిరిగానే నిజ జీవితంలోనూ మద్యానికి బానిసైనట్లు తెలిపింది.  మద్యం సేవించే తండ్రిని దాని నుంచి ఆ వ్యసనం నుంచి బయట పడేసే కూతురి పాత్రలో  ఆ చిత్రంతో నటించానని.. కానీ నిజ జీవితంలో తనే విపరీతంగా మద్యం సేవించేదాన్నని తెలిపింది. 

 నాలుగు సంవత్సరాల క్రితమే ఆ అలవాటు మానుకున్నానని.. పూర్తిగా మద్యం నుంచి బయటపడాలకున్నట్లుగా.. ఆ సమయంలో తన ఆలోచనల నుండి బయటపడడం చాలా కష్టంగా ఉందని.. మద్యం మానేయడానికి తను నిజంగా ఓ పోరాటం చేశానని వివరించింది. చాలా మంది ఆడవాళ్లు ఈ విషయం బయటకు చెప్పడానికి భయపడతారని.. కానీ ప్రతి ఒక్కరిలో ఈ సమస్య ఉంటుందని ఫూజా భట్ తెలిపింది. మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ హై కీ మాన్‌తా నహీ’ మూవీలో పూజా భట్‌ లీడ్‌ రోల్‌ పోషించగా.. అమీర్ ఖాన్ హీరోగా నటించారు. ఇక తండ్రి పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు.