దుమ్ము దులిపిన పిఎస్2 కలెక్షన్స్

పిఎస్ 1 మాదిరిగానే పిఎస్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. సినిమా ప్రారంభం రోజే భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. రెండో భాగం అన్ని టీవి ఛానల్లో మొదటి రోజే 38 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సొంత రాష్ట్రమైన తమిళనాడులో 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు సమాచారం.  మొదటి రోజే అన్ని ఫ్రాంచేజిలలో 40 కోట్లు వసూలు చేయగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు నుండి నాలుగు కోట్ల […]

Share:

పిఎస్ 1 మాదిరిగానే పిఎస్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. సినిమా ప్రారంభం రోజే భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. రెండో భాగం అన్ని టీవి ఛానల్లో మొదటి రోజే 38 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సొంత రాష్ట్రమైన తమిళనాడులో 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు సమాచారం. 

మొదటి రోజే అన్ని ఫ్రాంచేజిలలో 40 కోట్లు వసూలు చేయగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు నుండి నాలుగు కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో ఐదు కోట్లు వసూలు చేసింది. పిఎస్1 భారతదేశంలో దాదాపుగా 327 కోట్లు వసూలు చేయగా విదేశాల్లో 169 కోట్ల వసూలు చేసినట్టు సమాచారం. రెండో సినిమా కూడా అదే స్థాయిలో వసూలు చేస్తుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండో భాగంలో ఐశ్వర్యా బచ్చన్, మాగ్నం ఒపస్, విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత, ధూళిపాళ జయరాం, ప్రకాష్ రాజ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. 

ఈ చిత్రంలో 1955 నాటి కల్కి కృష్ణమూర్తి నవలలో వివరించిన చోళ సామ్రాజ్యం ప్రారంభ దశను తెలుపుతుంది. ఈ చిత్రంలో నటించిన విక్రమ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశంలోని ఏదైనా చిత్రం ఇప్పటికీ పనిచేస్తుందని, భావోద్వేగాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాయని, కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు చిత్రాలు చూడడానికి థియేటర్లకు వస్తున్నారని తెలిపారు. గతంలో జర్మన్, ఫ్రెంచ్, కొరియన్ సినిమాల మాదిరిగా పిఎస్ 2 ఉంటుందని తెలిపారు. సినిమాలో ఎక్కువగా శాతం హీరో పాత్రకు సంబంధించిన కంటెంట్ ఉంటుందన్నారు.  పిఎస్ 2 ను ప్రజలు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలని తెలిపారు. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా మణిరత్నంకి కృతజ్ఞతలు 

తెలిపారు. 

పిఎస్ 1 తీసిన ఎనిమిది నెలలోనే పిఎస్ 2 వచ్చింది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలైంది. పిఎస్ 2 చోళ యువరాజు అరుణ్ మోలి వర్మ కథను కొనసాగిస్తుంది. రాజరాజ 1 చక్రవర్తి అవడం ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. 

కాగా మణిరత్నం భారత చలనచిత్ర దర్శకుడు. నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాలలో ఆయన పనిచేశారు. ఆరు జాతీయ అవార్డులను, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులను, ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్ సౌత్ లను అందుకున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులను గెలుచుకున్నారు. 2002లో పద్మశ్రీ తో ఆయనను ప్రభుత్వం సత్కరించింది.

 మణిరత్నం 1956 జూన్ 2న ఆయన మద్రాస్‌లోని మదురైలో గోపాలరత్నం, సుబ్రహ్మణ్యంలకు జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1983లో కన్నడ చిత్రం పల్లవి అను పల్లవి అనే చిత్రంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆయన చేసిన సినిమాలు ఎక్కువగా పరాజయం అవ్వడంతో ఆఫర్లు తక్కువగా వచ్చేవి. 

1986 మౌనరాగం సినిమాతో నిర్మాతగా మారారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. రోజా , బాంబే, దిల్సే, మౌనరాగం చిత్రాలు మణిరత్నం చిత్రాలలో ప్రముఖమైనవి. మణిరత్నం నటి సుహాసిని 1988 ఆగస్టు 26న వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. చెన్నైలోని అల్వార్ పేటలో నివాసం ఉంటున్నారు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ను నడుపుతున్నారు.