బిడ్డకు పాలిచ్చినందుకు అక్క మీద కంప్లైంట్..!

ఈరోజుల్లో మంచి చేసిన చెడే ఎదురైంది అన్నదానికి ఒక చక్కని ఉదాహరణ ఈ వార్త అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఈ వార్త వినగానే పోలీసులు కూడా అవ్వక్కయ్యారు. ఇలాంటి విషయాలకు కూడా పోలీసులను పిలుస్తారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఏం జరిగింది.. ఏ మంచి చేద్దాం అనుకుంటే ఎటువంటి చెడు ఎదురయింది? తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే..  కథ ఏమిటి:  తల్లిపాలు పుట్టిన బిడ్డకి ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. పోషకాలతో […]

Share:

ఈరోజుల్లో మంచి చేసిన చెడే ఎదురైంది అన్నదానికి ఒక చక్కని ఉదాహరణ ఈ వార్త అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఈ వార్త వినగానే పోలీసులు కూడా అవ్వక్కయ్యారు. ఇలాంటి విషయాలకు కూడా పోలీసులను పిలుస్తారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఏం జరిగింది.. ఏ మంచి చేద్దాం అనుకుంటే ఎటువంటి చెడు ఎదురయింది? తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.. 

కథ ఏమిటి: 

తల్లిపాలు పుట్టిన బిడ్డకి ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. పోషకాలతో నిండిన తల్లిపాలు పుట్టిన బిడ్డకి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తుంది. డాక్టర్లు కూడా చాలా మందికి తల్లిపాలు ఇవ్వమని సిఫారసు చేస్తారు. ఇక జరిగిన సంఘటన విషయానికి వస్తే, ఇద్దరు అక్క చెల్లెలు వారాల వ్యవధిలో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. చెల్లి ఇటీవల అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. అదే సమయంలో చెల్లి భర్త కూడా దూరంగా ఉండటంతో, అక్కకు బిడ్డ బాధ్యతలు అప్పగించి హాస్పిటల్ లో చేరింది చెల్లి. కొద్దిరోజుల తర్వాత తను ఇంటికి వచ్చి చూసేసరికి తన బిడ్డకి తన అక్క తల్లి పాలు అందించడం చూసి షాక్ అయినట్లు తెలిపింది. అంతేకాకుండా తన సొంత బిడ్డ కోసం ఏర్పాటు చేసిన బేబీ మిల్క్ పౌడర్ చెత్తలో పడేసి, తన పర్మిషన్ లేకుండా తన బిడ్డకి పాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీసింది అక్కని. 

అంతేకాకుండా తన పర్మిషన్ లేకుండా బిడ్డకు ఎలా పాలిస్తావు అంటూ తన అక్క మీద సీరియస్ అయింది ఇంటికి తిరిగి వచ్చిన చెల్లి. అంతేకాకుండా తన పర్మిషన్ లేకుండా తన బిడ్డకు పాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అక్క మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది చెల్లె. ఇది తెలుసుకున్న అక్క, బిడ్డకి పాలు ఇవ్వడం ఏ మాత్రం తప్పుడు విషయం కాదు అని, ఈ మాత్రం దానికి పోలీసులు వరకు వెళ్లడం సవ్యం కాదు అంటూ, చెల్లి మీద సీరియస్ అయింది. అయితే మరో పక్క, తన బిడ్డ కోసం తీసుకువచ్చిన 14 డబ్బాల పాల పౌడర్ని అక్క చెత్తలో పాడేయడం తనకి నచ్చలేదు అంటూ చెల్లి కోప్పడిది. తను ఒకవేళ తన బిడ్డకి పాలు ఇవ్వాలంటే తన పర్మిషన్ తీసుకోవాలని, అంతేకాకుండా పర్మిషన్ లేకుండా 14 డబ్బాల పాల పౌడర్ని చెత్తకుప్పలో ఎలా పడేస్తారు అంటూ కంప్లైంట్ లో పేర్కొంది చెల్లె. 

అక్క మీద చెల్లి కోప్పడంతో, అంతేకాకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కారణంగా, తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకున్నందుకు తనకి డబ్బు పే చెయ్యాలని పట్టుబట్టింది అక్క. కానీ 14 డబ్బాల పాల పౌడర్ పడేసినందుకు ఇది చెల్లు అని తెగేసి చెప్పినట్లు, చెల్లి రీడిట్ సోషల్ మీడియా బ్లాగ్ ద్వారా వెల్లడించింది. 

నెటిజెన్స్ కామెంట్స్: 

సోషల్ మీడియా బ్లాగ్ లో ఈ వార్తలు చదివిన చాలా మంది నెటిజెన్స్ తమవైపు నుంచి కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. చెల్లి అక్క మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సరైన పద్ధతి కాదని, ఏదైనా కోపతాపాలు ఉంటే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలంటూ కామెంట్ పెట్టారు ఒకరు. మరొకరు పర్మిషన్ లేకుండా బిడ్డకి పాలు ఇవ్వడం కరెక్ట్ విషయం కాదని, కానీ, ఈ విషయం గురించి పోలీసులను సంప్రదించడం తప్పు అంటూ కామెంట్ పెట్టారు ఒకరు. బేబీ సిట్టింగ్ చేసినందుకు ఇతరులకు డబ్బు పే చేయాల్సిన అవసరం ఉందని, కానీ తమ సొంత బిడ్డలా చూసుకుని పాలు ఇచ్చి ఒక బిడ్డ ఆకలి తీర్చినందుకు, చెల్లి ఇలాగ స్పందించకూడదు అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.