ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాలకు పూనుకున్న సుభిరామిరెడ్డి

ఇటీవల జాతీయ అవార్డుల పురస్కారాలు కనిపించిన సందర్భంలో ప్రస్తుతం, వ్యాపారవేత్త- రాజకీయ నాయకులు అయిన టి.సుబ్బిరామిరెడ్డి, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాల గురించి ప్రస్తావించడం జరిగింది. అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయిన ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాలను మళ్ళీ పునరుద్దించడానికి పూనుకోవడం జరిగింది టి సుబ్బిరామిరెడ్డి. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు:  భారతీయ సినిమాలోని గొప్ప ప్రతిభావంతులను సన్మానించేందుకు ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను పునరుద్ధరిస్తానని అక్కినేని నాగేశ్వర్ రావు అభిమానులకు టి సుబ్బిరామి రెడ్డి హామీ ఇచ్చారు. లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, […]

Share:

ఇటీవల జాతీయ అవార్డుల పురస్కారాలు కనిపించిన సందర్భంలో ప్రస్తుతం, వ్యాపారవేత్త- రాజకీయ నాయకులు అయిన టి.సుబ్బిరామిరెడ్డి, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాల గురించి ప్రస్తావించడం జరిగింది. అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయిన ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాలను మళ్ళీ పునరుద్దించడానికి పూనుకోవడం జరిగింది టి సుబ్బిరామిరెడ్డి.

ఏఎన్ఆర్ జాతీయ అవార్డు: 

భారతీయ సినిమాలోని గొప్ప ప్రతిభావంతులను సన్మానించేందుకు ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను పునరుద్ధరిస్తానని అక్కినేని నాగేశ్వర్ రావు అభిమానులకు టి సుబ్బిరామి రెడ్డి హామీ ఇచ్చారు. లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ మరియు ఎస్ఎస్ రాజమౌళి వంటి దిగ్గజాలు తమ తమ రంగాలలో చేసిన విశిష్ట కృషికి ఈ అవార్డుతో సత్కరించడం జరిగింది అని జరిగిన థెస్పియన్ ANR సన్మాన కార్యక్రమంలో TSR చెప్పారు. తాము నిజానికి అక్కినేని నాగార్జున మద్దతుతో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను పునరుద్ధరిస్తామని, భారతీయ సినిమాలోని అత్యుత్తమ ప్రతిభను మరోసారి సత్కరిస్తామని అన్నారాయన.

నిజానికి, ANR జాతీయ అవార్డును అక్కినేని నాగేశ్వర్ రావు గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించింది. వారి జీవితకాల విజయాలు, అంతేకాకుండా భారతీయ సినిమాకి చేసిన సేవలకు వ్యక్తులను గుర్తించడానికి ప్రతి సంవత్సరం గౌరవనీయమైన అవార్డు ఇవ్వడం జరిగేది. తొలి అవార్డును బాలీవుడ్ లెజెండరీ నటుడు దేవ్ ఆనంద్ అందుకున్నారు.

అవార్డు అందుకున్న వారు ఎంతోమంది: 

శ్రీదేవి, శ్యామ్ బెనెగల్, హేమ మాలిని, కె బాలచందర్, షబానా అజ్మీ మరియు ఇతర దిగ్గజాలు ఇటువంటి గౌరవప్రదమైన ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకోవడం జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత, ఉత్తమ ప్రతిభ ఉన్నవారికి ఇది మళ్లీ అందించడం జరుగుతుంది. వ్యాపారవేత్తగా మారిన నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు అభిమానులకు హామీ ఇచ్చాడు, అతను భారతీయ చలనచిత్రంలో గొప్ప ప్రతిభావంతులకు ANR జాతీయ అవార్డులను పునరుద్ధరిస్తానని చెప్పాడు.

ఇటీవల సైమా అవార్డు అందుకున్న ఉత్తమ నటుడు: 

దుబాయ్ లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తను ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆధార అభిమానాలు పొందిన RRR సినిమాలో కొమరం భీమా పాత్రలో పోషించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకుగాను బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మేరకు తను అవార్డ్స్ వేదికపై మాట్లాడిన తీరు అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా ఆధార అభిమానాలు పొందిన RRR సినిమాలో కొమరం భీమా పాత్రలో పోషించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు గాను, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 లో బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. నటుడు మాట్లాడుతూ.. ‘‘కొమరం భీమ్‌ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా నమ్మినందుకు నా జక్కన్న, దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండోది RRRకి సపోర్టుగా నిలబడ్డందుకు అన్నయ్య, స్నేహితుడు, నా సహనటుడి చరణ్ కి ముఖ్యంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను” అంటూ తమ టీమ్ మెంబర్స్ గురించి చాలా బాగా మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్.

అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ “నా అభిమానులకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నన్ను నా అడ్డంకుల నుంచి బయటకి తెచ్చినాము, నేను పడిపోయిన ప్రతిసారీ నన్ను నిలబెట్టినందుకు, నా కళ్ళ నుండి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టును తుడుచుకున్నందుకు, నేను విచారంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ప్రతిసారి నా పక్షాన నిలిచిన నా అభిమానులందరికీ నమస్కరిస్తాను.” అంటూ చాలా గొప్పగా మాట్లాడారు.

RRR నటుడు తన మాటలను అభిమానులకు ఇలా వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. చాలా సందర్భాలలో, అతను అభిమానులకు తన అత్యంత గౌరవాన్ని తనదైన శైలిలో చూపిస్తూనే ఉన్నాడు. అంతే కాకుండా మరి కొన్నిసార్లు భావోద్వేగానికి కూడా గురయ్యాడు.