ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోలేదు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఓ రకంగా సంబరాలు చేసుకుంటారు. అటువంటి పవన్ కల్యాణ్ తనకు గబ్బర్ సింగ్ లాంటి సాలిడ్ హిట్ అందించిన హరీష్ శంకర్ కాంబోలో మూవీ చేస్తున్నాడంటే ఆ హైప్ వీరలెవెల్లో ఉంటుంది. ఆ హైప్స్ కు తగ్గట్టుగానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఆ మధ్య ఈ మూవీ మోషన్ పోస్టర్ తో పాటుగా గ్లింప్స్ ను కూడా మూవీ […]

Share:

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఓ రకంగా సంబరాలు చేసుకుంటారు. అటువంటి పవన్ కల్యాణ్ తనకు గబ్బర్ సింగ్ లాంటి సాలిడ్ హిట్ అందించిన హరీష్ శంకర్ కాంబోలో మూవీ చేస్తున్నాడంటే ఆ హైప్ వీరలెవెల్లో ఉంటుంది. ఆ హైప్స్ కు తగ్గట్టుగానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఆ మధ్య ఈ మూవీ మోషన్ పోస్టర్ తో పాటుగా గ్లింప్స్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ గ్లింప్స్ కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో మూవీ యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. 

ఆగిపోయిందంటూ వార్తలు

ఫ్యాన్స్ ఫస్ట్ గ్లింప్స్ కిక్ లో ఉండగానే ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయిందంటూ వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయడంతో ఈ మూవీని పక్కన పెట్టారని జోరుగా వార్తలు వినిపించాయి. ఈ మూవీని మైత్రీ మేకర్స్ వంటి బడా ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. అంతే కాకుండా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కాంబోలో వస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఈ మూవీ ఆగిందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయారు. అరే ఇలా అయిందేంటంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కానీ ఈ మూవీ ఆగిపోలేదని ఇటీవలే మూవీ యూనిట్ స్ట్రాంగ్ అప్ డేట్ ఇచ్చింది. నెక్ట్స్ షెడ్యూల్ ను ఎప్పుడు మొదలుపెడతారో కూడా చెప్పింది. ఈ అప్ డేట్ విని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

సెప్టెంబర్ 5 నుంచి..

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ కానుందని మూవీ యూనిట్ తెలిపింది. ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం ఇప్పటికే ఓ భారీ సెట్ ను డిజైన్ చేశారు. ఈ సెట్ లో అటు హీరో పవన్ కల్యాణ్ తో పాటు కీలక నటీనటుల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించినున్నట్లు సమాచారం. ఈ మూవీలో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఫుల్ స్వింగ్ లో ఉన్న శ్రీ లీల ఈ మూవీలో పవన్ తో జోడీ కట్టడంతో అంతా వీరి కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు. 

మరోసారి ఖాకీ డ్రెస్ లో

పవన్ కల్యాణ్ పోలీస్ పాత్రలో నటించిన సినిమాలకు కొదువ లేదు. కానీ హరీష్ శంకర్ కాంబోలో ఆయన మరోసారి పోలీసాఫీసర్ గా కనిపించడంతో గబ్బర్ సింగ్ మ్యాజిక్ ఈ మూవీకి కూడా రిపీట్ అవుతుందని టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా గబ్బర్ సింగ్ సినిమాకు హిట్ మ్యూజిక్ ఇచ్చిన రాక్ స్టార్ డీఎస్పీ నే ఈ మూవీకి కూడా స్వరాలు సమకూరుస్తున్నాడు. దీంతో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం ఖాయం అని అంతా కామెంట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన లాస్ట్ మూవీ బ్రోతో హిట్ కొట్టాడా లేదా అనేది మేకర్స్ కే తెలియాలి. బ్రో సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిందని మేకర్స్ అనౌన్స్ చేయగా.. భారీ నష్టాలను మూటగట్టుకుందని కొంత మంది రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. బ్రోలో ఒక మంత్రి క్యారెక్టర్ ను కామెడీగా చూపించారని ఆ మధ్య వివాదం నడిచింది. ఈ వివాదాలను పక్కన పెడితే బ్రో మూవీ ఒక తమిళ హిట్ మూవీ. తమిళ నాట సూపర్ హిట్ అయిన వినోదాయ సిత్తం సినిమాను అదే మూవీ దర్శకుడు సముద్రఖని ఇక్కడ తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతడికి స్ర్కీన్ ప్లేలో సాయమందించారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కలిసి నటించారు. టైమ్ అనే కాన్సెప్ట్ లో తెరకెక్కిన ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ ను మాత్రం విపరీతంగా అలరించింది.