OG గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ అంతే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ టైంలో వరుస పెట్టి రీమేక్ లే చేస్తూ ఉండగా ఒరిజినల్ కథతో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు సాహో డైరెక్టర్ సుజీత్  డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా ఒజీ-ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్  నుండి  గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అంచనాలు అయితే ఆకాశాన్ని దాటిపోయాయి. ఎక్స్ లెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రిచ్ సినిమాటోగ్రఫీతో […]

Share:

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ టైంలో వరుస పెట్టి రీమేక్ లే చేస్తూ ఉండగా ఒరిజినల్ కథతో పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు సాహో డైరెక్టర్ సుజీత్  డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా ఒజీ-ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్  నుండి  గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అంచనాలు అయితే ఆకాశాన్ని దాటిపోయాయి. ఎక్స్ లెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రిచ్ సినిమాటోగ్రఫీతో మెప్పించిన ఒజీ గ్లిమ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ యాటిట్యూడ్, స్వాగ్ అండ్ హీరోయిజం సీన్స్ తో దుమ్ము దుమారం లేపగా తర్వాత తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో హైప్ ను పెంచేసింది. ఇక గ్లిమ్స్ చివర్లో పోలిస్ స్టేషన్ లో పవర్ స్టార్ మరాఠీ డైలాగ్.. ఓ రేంజ్ లో మెంటల్ మాస్ అనిపించాయి అని చెప్పాలి. 

ఆల్ రెడీ ఓజీ మీద అంచనాలు భారీగా ఉండగా ఈ గ్లిమ్స్ మీద అంచనాలు ఇప్పుడు మరో లెవల్ కి వెళ్లిపోయాయి అని చెప్పాలి. సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా ఊహకందని ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక గ్లిమ్స్ కి రికార్డ్ వ్యూస్ అండ్ లైక్స్ వస్తూ ఉండగా 24 గంటల్లో ఆల్ టైం రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గ్లింప్స్ వీడియోను వదిలారు. ఫ్యాన్స్ ఆశలను ఏమాత్రం నిరాశపరచకుండా వీడియో అదిరిపోయేలా ఉంది.

ఈ గ్లింప్స్‌కి అర్జున్ దాస్ వాయిస్‌ ఓవర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. పవర్ స్టార్ స్టైల్, మ్యానరిజమ్స్‌తో వీడియో మొత్తం ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఈ వీడియో చూస్తుంటే సినిమాలో వయెలన్స్ ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ పవన్‌ను ఎలివేట్ చేసిన విధానం అయితే హైలెట్ అనిపించింది. అందుకు తగ్గట్లే థమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిపడేశాడు. నిజం చెప్పాలంటే పవన్‌కి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు సుజీత్. అలానే డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

ఓజీ సినిమా గురించి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో థమన్ ప్రత్యేకంగా చెప్పాడు. సినిమాకు తాను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్‌లో ఉంటుందని చెప్పాడు. థమన్ మాట్లాడుతూ… ఓజీ ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా. దీనికి ఏమేమి చేయాలో నాకు బాగా తెలుసు. ఈ సినిమా మామూలుగా ఉండదు.. అంటే చాలా సేటిస్‌ఫేక్షన్ ఉంటుంది. ఫ్యాన్స్ పవన్ కల్యాణ్‌ను ఎలా చూడాలో.. అలానే ఓజీలో కనిపిస్తారు. ఇక నా టీమ్ ఒకటి కంప్లీట్‌గా దానిపైనే పని చేస్తుంది. ఇది చాలా ఫ్రెష్ స్క్రిప్ట్. చాలా కొత్తగా వెళ్తామని అన్నారు. థమన్ చెప్పిన మాట ప్రకారం ఓజీగా గట్టిగానే బీజీ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌కి థమన్ బీజీ తోడవడంతో వీడియో అదిరిపోయింది. ఇక పవర్ స్టార్ స్వాగ్, స్టైల్ గూస్ బంప్స్ తెప్పించాయి. అసలే ఓజీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ వీడియోతో వాటిని సుజీత్ ఇంకా పెంచేశాడు. అసలే సినిమాను స్టైలిష్‌గా తెరకెక్కిస్తాడనే పేరు సుజీత్‌‍కి ఉండనే ఉంది.