పవన్ మహేశ్ లపై తమిళ డైరెక్టర్ వ్యాఖ్యలు

మూవీ హిట్ అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మూవీని హిట్ చేసేందుకు డైరెక్టర్ హీరో బాండింగ్ అనేది చాలా ముఖ్యం. వీరిద్దరి మధ్య కనుక ఒక ఎమోషనల్ బాండ్ కనెక్ట్ అయితే ఆ మూవీ తప్పకుండా హిట్ అవుతుంది. అందుకోసమే హీరోలు మూవీలు తీసేటపుడు తమతో కనెక్ట్ అయిన డైరెక్టర్స్ కే ఓటేస్తారు. అలా టాలెంటెడ్ దర్శకులు హిట్లు కొడుతుంటారు. మన ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. కేవలం తెలుగు […]

Share:

మూవీ హిట్ అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మూవీని హిట్ చేసేందుకు డైరెక్టర్ హీరో బాండింగ్ అనేది చాలా ముఖ్యం. వీరిద్దరి మధ్య కనుక ఒక ఎమోషనల్ బాండ్ కనెక్ట్ అయితే ఆ మూవీ తప్పకుండా హిట్ అవుతుంది. అందుకోసమే హీరోలు మూవీలు తీసేటపుడు తమతో కనెక్ట్ అయిన డైరెక్టర్స్ కే ఓటేస్తారు. అలా టాలెంటెడ్ దర్శకులు హిట్లు కొడుతుంటారు. మన ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీ అనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది టాప్ డైరెక్టర్లు ఉన్నారు. తమిళ దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు తీయడం కొత్తేం కాదు. వారు చాలా రోజుల నుంచి తెలుగు హీరోలతో మూవీలు తీస్తున్నారు. అందుకోసమే వారు ఇక్కడి ఫ్యాన్స్ కు సుపరిచితులుగా మారిపోయారు. 

ఎస్ జే సూర్య స్టైలే సెపరేటు

తమిళ దర్శకులలో ఎస్ జే సూర్య స్టైలే సెపరేటుగా ఉంటుంది. మనోడు సినిమా తీస్తున్నాడంటే అందులో ఏదో ఒక హైలెట్ మ్యాటర్ ఉంటుంది. ఈ డైరెక్టర్ సినిమాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ఎస్ జే సూర్య కేవలం సినిమాలను డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా సినిమాలలో యాక్ట్ కూడా చేస్తుంటాడు. అందుకోసమే అతడికి అంత క్రేజ్. అటువంటి ఎస్ జే సూర్య నటించిన రీసెంట్ మూవీ మార్క్ ఆంటోని. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ జే సూర్య మాట్లాడుతూ… తనకు ఇద్దరు టాలీవుడ్ స్టార్లతో మళ్లీ వర్క్ చేయాలనుందని తెలిపాడు. తెలుగు సూపర్‌స్టార్‌ అయిన మహేశ్ బాబుకు త్వరలో బ్లాక్‌బస్టర్‌ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఎస్ జే సూర్య ఇలా ప్రకటన చేయడంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ జే సూర్య మాట్లాడుతూ… మహేశ్ బాబుతో నాని అనే సినిమా తీశాను కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. అతనికి ఒక పెద్ద హిట్ బాకీ ఉన్నానని, త్వరలోనే ఆ హిట్ అందిస్తానని ప్రామిస్ చేశాడు. కానీ నాని సినిమా పెద్దగా ఫలితం సాధించకపోయినా కానీ ఈ మూవీలో మహేశ్ నటనకు ప్రశంసలు అందాయి. కేవలం మహేశ్ బాబుతో మాత్రమే కాకుండా తెలుగు స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తో కూడా ఒక బ్లాక్‌ బస్టర్‌ మూవీ తీయగలనని అతడు విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ వాఖ్యలను విన్న ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

మహేశ్ తో కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాదు…. 

ఎస్ జే సూర్య కేవలం మహేశ్ బాబుతో డైరెక్టర్ గా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించాడు. మహేశ్ బాబు, తమిళ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ మూవీ భయంకరమైన విలన్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. ఆ మూవీలో మహేశ్ తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం చాలా బాగుందని సూర్య చెప్పాడు. ప్రస్తుతం, అతను విశాల్ నటించిన తమిళ చిత్రం మార్క్ ఆంటోనితో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది తమిళ మూవీ అయినా కానీ తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ టైమ్ ట్రావెల్ మరియు ప్రత్యేకమైన కాన్సెప్ట్ చుట్టూ తిరిగే డిఫరెంట్ మూవీ అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ మూవీలో తాను ఒక డిఫరెంట్ అండ్ చాలెంజింగ్ రోల్ లో నటించానని చెబుతూ సూర్య ముగించాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు తనకు డైరెక్టర్ గా చాన్స్ ఇస్తాడో లేదో అని సూర్య తెలిపాడు. అతడు డైరెక్టర్ గా చాన్స్ ఇస్తే మాత్రం తనకి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తానని వెల్లడించాడు. మహేశ్ కు హిట్ బాకీ ఉన్నానని ఆ రుణం తీర్చుకుంటానని తెలిపాడు.